అన్వేషించండి

Shruti Haasan: నా ఫోకస్ వాటిమీదే - పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన శ్రుతిహాసన్!

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ రాజకీయాల్లోకి రాబోతుందంటూ వార్తలు ప్రచారం అవ్వడంతో తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె పొలిటికల్ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు రాజకీయాల్లో రాణిస్తున్నారు. హీరోలు పాలిటిక్స్ కి లోకి రావడం చూస్తూనే ఉన్నాం. కానీ హీరోయిన్స్ విషయంలో అది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పటి హీరోయిన్లు రాజకీయాల్లో మెప్పించారు. అయితే ఈ తరం నటీమణులు రాజకీయాలపై అంతగా ఆసక్తి చూపించడం లేదు. కానీ ఈ తరంలో అగ్ర హీరోయిన్ గా భారీ గుర్తింపు తెచ్చుకున్న శృతిహాసన్ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

తన తండ్రి కమలహాసన్ ఎలాగో రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి శృతిహాసన్ కూడా తండ్రిని ఆదర్శంగా తీసుకుని పాలిటిక్స్ లోకి రాబోతుందని సోషల్ మీడియాలోనూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే విషయంపై శృతిహాసన్ స్పందించారు. స్వయంగా మీడియా ముందే పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు. శృతిహాసన్ ఏదైనా ముక్కు సూటిగా చెబుతుంది. ఎవరికి భయపడదు. ఆమె స్వతంత్ర భావాలు కలిగిన అమ్మాయి. తనకు నచ్చింది చేస్తుంది. దానిపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గదు. ప్రస్తుతం తెలుగు, తమిళంలో వరస సినిమాలు చేస్తున్న శృతిహాసన్ రాజకీయాలకు వస్తున్నారంటూ ప్రచారం ఊపందుకుంది. శృతిహాసన్ తండ్రి కమల్ హాసన్ ప్రస్తుతం మక్కల్ ఇయక్కమ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. 

గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసింది. ఈ క్రమంలోనే శృతిహాసన్ రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని, త్వరలోనే ఆమె పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. తాజాగా కోయంబత్తూర్ లో ఒక కార్యక్రమానికి హాజరైన శృతిహాసన్ కి ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో ఆమె బదిలిస్తూ.." ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కానీ ఆసక్తి నాకు లేదు. నా దృష్టి మొత్తం సినిమాల మీదే ఉంది. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మంచి కథలు ప్రేక్షకులకు అందించాలని లక్ష్యంతోనే పనిచేస్తాను. నేను తమిళ అమ్మాయిని, ఎక్కువగా తమిళ చిత్రాలు చేస్తాను  ఇతర భాషల్లో మంచి కథలు దొరికితే అక్కడ కూడా చేస్తాను" అంటూ చెప్పుకొచ్చింది. శృతిహాసన్ వ్యాఖ్యలతో ఆమె పొలిటికల్ ఎంట్రీ పుకార్లకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు.

ఇక శృతిహాసన్ కెరియర్ విషయానికొస్తే.. టాలీవుడ్ లో రవితేజ సరసన 'క్రాక్' మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహరెడ్డి' వంటి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరో ప్రభాస్ సరసన 'సలార్' (Salaar) మూవీలో నటిస్తోంది. ఈ మూవీ విజయం సాధించడం శృతిహాసన్ కి చాలా కీలకం. ఎందుకంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి, సలార్ హిట్ అయితే శృతిహాసన్ కెరియర్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కానుంది.

Also Read : ‘సప్త సాగరాలు దాటి’ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అన్ని భాషల్లో ఒకేసారి విడుదల

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Dose OTT : ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఒకేసారి ఐదు ఓటీటీల్లో సైకలాజికల్ మెడికల్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hrudhayam Murali Trailer : 20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
20 ఏళ్ల తర్వాత నటుడిగా తమన్ - 'హృదయం మురళి' ట్రైలర్‌లో ఇది వెరీ స్పెషల్
OG Sequel : పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
పవన్ కల్యాణ్ OG సీక్వెల్ - ఫ్యాన్స్ గెట్ రెడీ... తమన్ బిగ్ అప్డేట్
Sing Geetham OTT : ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఓటీటీలోకి ముందుగానే సింగ్ గీతం - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Fishermen Missing: ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌- ఆరుగురు జాలర్లపై ఆశలు గల్లంతు, రూ.10 లక్షల పరిహారం
CM Revanth Reddy Soft Hindutva Strategy: బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
బీజేపీ బలానికి రేవంత్ విరుగుడు ! తెలంగాణలో సాఫ్ట్ హిందూత్వ పాలిటిక్స్ వెనుక అసలు స్కెచ్ ఇదే!
FIFA World Cup Dispute: ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
ఈజిప్ట్‌-అర్జెంటీనా మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ మోస్తఫా జికో సంచలన వ్యాఖ్యలు, కన్నీళ్లు పెట్టుకున్న లియోనెల్ మెస్సి!
US Attacks Iran: ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
ఇరాన్‌పై మెరుపుదాడులు చేసిన అమెరికా సైన్యం.. చమురు విక్రయాల లైసెన్స్ రద్దు, ఆంక్షలు కఠినతరం
E20 ఇంధనంపై మరో కొత్త చర్చ - పాత బైక్‌లు, కార్ల రబ్బర్‌ భాగాలు పాడయ్యే ఛాన్స్‌!
E20 పెట్రోల్‌తో పాత బండ్లకు ప్రమాదం! రబ్బర్ భాగాలు దెబ్బతినే అవకాశం ఉందని ARAI హెచ్చరిక
Pawan Kalyan Fan Dies: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్‌ మృతి.. ఆ కోరిక తీరకుండానే..!
Viral Video: ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
ఆదోని శివాలయం గర్భగుడిలో సిగరెట్‌ వెలిగించి అపచారం, నిందితుడి అరెస్ట్
Best Mileage Cars: కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
కిలోమీటరుకు కేవలం ₹2.68 మాత్రమే ఖర్చయ్యే కార్లు ఇవే! నెలవారీలో ఎంత ఆదా అవుతుంది? 
Embed widget