Sharwanand Divorce: భార్యకు దూరంగా శర్వానంద్... విడాకులు దిశగా అడుగులు - ఏది నిజం? ఏది పుకారు?
Sharwanand Divorce News: ఫిల్మ్ నగర్ వర్గాల్లో లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే... యువ కథానాయకుడు శర్వానంద్ విడాకులు తీసుకున్నారనేది. ఇండస్ట్రీలో డిస్కషన్ టాపిక్ అయిన ఈ న్యూస్‌లో నిజం ఎంత? అనేది తెలుసుకోండి.

Latest Celebrity Divorce News: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక హీరో విడాకులు తీసుకుంటున్నారా? యువ కథానాయకుడు శర్వానంద్ కుటుంబ జీవితంలో ఏం జరుగుతోంది? భార్యతో ఆయనకు మనస్పర్థలు ఎందుకు వచ్చాయి? అనేది అటు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు ఇటు సామాన్య ప్రేక్షకులలో సైతం చర్చకు దారి తీసింది. ఆయన విడాకులు తీసుకున్నారని ప్రచారం జోరుగా జరుగుతోంది. అసలు ఇందులో నిజం ఎంత? వాస్తవాలు ఏమిటి? అనేది చూస్తే...
భార్యకు దూరంగా శర్వానంద్...
విడాకులు అయితే తీసుకోలేదు!
అవును... గత కొన్ని రోజులుగా భార్యకు దూరంగా ఉంటున్నారు శర్వానంద్. ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు గొడవలు వచ్చాయి? అనేది కుటుంబ సభ్యులకు ఎరుక. అయితే ఇంకా విడాకులు తీసుకోలేదు. తీసుకునే ఉద్దేశం కూడా లేదని ఆయన కుటుంబ సన్నిహితులు తెలియజేస్తున్నారు. భార్యతో దూరంగా ఉండటం వల్ల విడాకులు తీసుకున్నారని ప్రచారం మొదలైంది. సోషల్ మీడియా నుంచి భార్య, పాపతో ఉన్న ఫోటోలను శర్వానంద్ ఇంకా డిలీట్ చేయలేదు.
View this post on Instagram
పాప జన్మించాక విడాకులా...
శర్వానంద్ భార్య ఎవరు? ఏమైంది?
Who Is Sharwanand wife?: శర్వానంద్ భార్య పేరు రక్షిత రెడ్డి. ఆమె సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. తెలంగాణ హైకోర్టులో ఆమె తండ్రి మధుసూదన్ రెడ్డి పెద్ద పేరున్న న్యాయవాది. రక్షిత కుటుంబానికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణకు ఆమె మనవరాలు.
View this post on Instagram
జైపూర్ (Leela Palace Jaipur)లోని లీలా ప్యాలెస్‌లో రెండేళ్ల క్రితం... జూన్ 3న శర్వానంద్, రక్షితల వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమార్తె కూడా ఉంది. ఈ జంట మధ్య గొడవలకు కారణం ఏమిటి? అనేది చర్చనీయాంశం అయ్యింది. ఇద్దరినీ మళ్ళీ ఒక్కటి చేసేందుకు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట.
Also Read: ముద్దులతో రెచ్చిపోయిన కిరణ్ అబ్బవరం - ఘాటుగా 'కే ర్యాంప్' టీజర్... చూశారా?





















