అన్వేషించండి

Shalini Ajithkumar: చిరంజీవితో త్రోబ్యాక్‌ ఫోటో - 34 ఏళ్ల తర్వాత ఆ ఫోటో షేర్‌ చేసిన షాలిని, దాని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Shalini With Chiranjeevi Throwback Pic: హీరో అజిత్‌ కుమార్‌ భార్య, మాజీ నటి షాలిని చిరంజీవితో దిగిన త్రోబ్యాక్‌ ఫొటో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆమె పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Ajith Kumar Wife Shalini Shared Throwback Photo with Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవి, దివంగత నటి శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూవీ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పాలి. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకక్కిన ఈ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సోసియో ఫాంటసీ జానర్‌లో 1990లో ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. ఇందులో అతిలోక సుందరిగా నటించని శ్రీదేవిని ఇప్పిటికీ ఆమె ఫ్యాన్స్‌ అలాగే చూస్తారు. ఈ చిత్రంలో ఆమె అందానికి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

ఇక చిరంజీవి కెరీర్‌లో ఈ మూవీ మరో మైల్‌స్టోన్‌గా నిలిచింది. అంతటి విజయం సాధించిన ఈ సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్టులుగా నటించిన చిన్నారులు కూడా తమ నటనతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. వారెవరో కాదు తమిళ స్టార్‌ హీరో అజిత్‌ భార్య, మాజీ నటి షాలిని ఆమె సోదరి నటి షామిలి, ఆమె సోదరుడు, నటుడు రిచర్డ్ రిషి. ఈ  ముగ్గురు ఈ ఇందులో చైల్డ్‌ ఆర్టిస్టులుగా నటించి తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో చిరంజీవి కోసం 'జై చిరంజీవా' పాటలో తమ అద్భుతమైన నటన, ఎక్స్‌ప్రెషన్స్‌తో అందరిని ఆకట్టుకున్నారు.

అయితే ఇప్పుడు ఈ మూవీ 34 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా నటి షాలిని త్రోబ్యాక్‌ ఫోటో షేర్‌ చేశారు. చిరంజీవితో కలిసి అప్పుడు, ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి దిగిన ఫోటోను షాలిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. "లవ్లీ త్రోబ్యాక్‌ విత్‌ చిరంజీవి సార్‌" అంటూ ఈ ఫోటోకు క్యాప్షన్‌ ఇచ్చారు. అలాగే ఆమె సోదరుడు, నటుడు రిచర్డ్‌ రిషి కూడా అదే ఫోటోను అప్పుడు, ఇప్పుడు అంటూ పంచుకున్నారు. ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇండస్ట్రీలో చిరంజీవికి ప్రత్యేకమైన గుర్తింపు. అందరితో సన్నిహితంగా ఉంటూ ఇండస్ట్రీలో అజాతశత్రువుగా పేరు గడించారు. ఇక రీసెంట్‌గా చిరంజీవి లేటెస్ట్‌ మూవీ షూటింగ్‌ షాలిని భర్త, స్టార్‌ హీరో అజిత్‌ సందడి చేసిన సంగతి తెలిసిందే.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)

మూవీ సెట్‌లో చిరంజీవిని కలిసి ఆయన సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ ఫోటోలను చిరంజీవి షేర్‌ చేస్తూ..అజిత్‌ సడెన్‌ తన మూవీ సెట్‌లో అడుగుపెట్టడం తనకు సర్‌ప్రైజ్‌ని ఇచ్చింది. ఆయనను కలవడం తనకో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందంటూ మెగాస్టార్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన 'విశ్వంభర' మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. బింబిసార ఫేం వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవి కెరీర్‌లోనే ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మాదిరిగానే ‘విశ్వంభర’ సోసియో ఫాంటసీ మూవీగా రూపొందుతుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా, ఆషిక రంగనాథ్, ఈషా చావ్లా, సురభిల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  

Also Read: మరో మూడు రోజుల్లో 'కల్కి' ట్రైలర్‌ - మరో కొత్త పోస్టర్‌ రిలీజ్‌ చేసిన టీం, వారియర్‌గా కనిపించిన బిగ్‌బి

టాప్ హెడ్ లైన్స్

Ranabaali Trailer Review : విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
విజయ్ దేవరకొండ రణబాలి ట్రైలర్ రివ్యూ - శింగనమల బొబ్బిలి యాక్షన్, వయలెన్స్ వేరే లెవల్
Romantic Drama OTT : ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
ఓటీటీలోకి బేబీ కపుల్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదు భాషల్లో స్ట్రీమింగ్... టైటిల్ చేంజ్ వెనుక అసలు రీజన్ ఏంటంటే?
Baa Baa Black Sheep Trailer Review : మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
మ్యాజికల్ బాక్స్ కోసం వార్... క్రైమ్ కామెడీ బా బా బ్లాక్ షీప్ - సీఎం మెచ్చిన మూవీ... ట్రెండింగ్‌లో ట్రైలర్
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఎపిక్ To థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐస్... ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chalo Lok Bhavan Congress Protest: టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
టీ పీసీసీ చీఫ్ సహా పలువురు మంత్రుల అరెస్ట్ - లోక్ భవన్‌ ముట్టడించడమే కారణం
VC Sajjanar Junior NTR Fans: మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
మీ ఫ్యాన్స్ డీప్ ఫేక్ చేస్తున్నారు..కాస్త చూడండి - జూనియర్ ఎన్టీఆర్‌కు కమిషనర్ సజ్జనార్ రిక్వెస్ట్
Centre Rebuttal Elon Musk : రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
రూల్స్ అంటే రూల్స్.. అందరికీ వర్తిస్తాయి - ఎలాన్ మస్క్ ఆరోపణలకు కేంద్రం ఘాటు రిప్లై !
Secunderabad Property Fraud: ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
ఎన్నారైల ఆస్తులు నకిలీ పత్రాలతో కబ్జా - హైదరాబాద్‌లో ఘరానా గ్యాంగ్ అరెస్ట్
Vijayasai Reddy: జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
జగన్ మతం మార్చుకోవాలి - మేం రాగానే టీటీడీ బోర్డు రద్దు - తిరుపతిలో విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Ravindra Jadeja Viral Post: అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, జడేజా కామెంట్ వైరల్
అగార్కర్ తప్పుకున్న వేళ జడ్డూ సెటైరికల్ పోస్ట్.. సెలెక్టర్ పదవి ప్రొసీజర్ ఏంటంటూ ప్రశ్న, సోషల్ మీడియాలో జడేజా కామెంట్ వైరల్
Indian 3 Movie Release : సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
సేనాపతి ఈజ్ బ్యాక్ - భారతీయుడు 3 ఇన్ వార్ మోడ్
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
Embed widget