అన్వేషించండి

Shah Rukh Khan : బాలీవుడ్ టాప్ డైరెక్టర్ కి నో చెప్పిన షారుఖ్ ఖాన్ - కారణం అదేనట!

Shah Rukh Khan : బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలితో సినిమా చేసేందుకు షారుక్ ఖాన్ నో చెప్పినట్లు సమాచారం.

Shah Rukh Khan said no to this top director: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కెరియర్ లో 2023 చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడాదిలోనే షారుక్ ఖాన్ వరుస సక్సెస్ లను చూశాడు. సుమారు ఐదేళ్లుగా అపజయాలతో సతమతమవుతున్న షారుక్ ఖాన్ కి గత ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన 'పఠాన్' భారీ కం బ్యాక్ ఇచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యికోట్ల వసూళ్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత జవాన్ తో మరోసారి రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఒకే ఏడాదిలో రెండు సినిమాలతో వెయ్యి కోట్ల వసూళ్లు అందుకున్న ఏకైక హీరోగా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ లో అరుదైన ఘనతను సాధించాడు.

ఇక అదే ఏడాది చివర్లో వచ్చిన 'డంకీ' మూవీ పఠాన్, జవాన్ వంటి సినిమాల రేంజ్ లో కాకపోయినా డీసెంట్ హిట్ అనిపించుకుంది. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ రాజ్ కుమార్ హిరాని డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర రూ1.450 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది. తాప్సి, విక్కి కౌశల్, బొమన్ ఇరానీ, అనిల్ గ్రోవర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో ఎమోషనల్ కంటెంట్ బాలీవుడ్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యింది. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ తాజాగా ఓ బాలీవుడ్ అగ్ర దర్శకుడికి నో చెప్పినట్లు తెలుస్తుంది. లేటెస్ట్ బాలీవుడ్ మీడియా కథనం ప్రకారం.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ షారుక్ ఖాన్ తో 'ఇన్షాల్లా' అనే రొమాంటిక్ కామెడీ మూవీ చేసేందుకు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నాడు.

కానీ ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఇక ఇదే ప్రాజెక్ట్ చేసేందుకు సంజయ్ లీల బన్సాలీ రీసెంట్ గా1 షారుఖాన్ ని అప్రోచ్ అవ్వగా అందుకు షారుక్ నో చెప్పినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఇదే ప్రాజెక్ట్ గురించి డైరెక్టర్ సంజయ్ చర్చలు జరుపుతూ ఉన్నారట. మొదట్లో ఆసక్తి చూపించిన షారుక్ ఆ తర్వాత మాత్రం ఈ ప్రాజెక్టు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ మీడియా పేర్కొంది. రొమాంటిక్ కామెడీ జోనర్ లో లో షారుఖ్ ఖాన్ చాలా సినిమాలు చేశారు. అందుకే ఇప్పుడు మళ్లీ అలాంటి రొమాంటిక్ ఎంటర్టైనర్స్ చేయడానికి కింగ్ ఖాన్ ఆసక్తి చూపడం లేదని, అందుకే సంజయ్ లీలా బన్సాలీ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

కాగా షారుక్ ఖాన్ ఇకపై తన తదుపరి సినిమాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇకనుంచి వయసుకు తగ్గ పాత్రలు చేయాలని షారుక్ డిసైడ్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు." ఈ సారి కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నా. ఇకపై నా వయసుకు తగిన సినిమాలు చేస్తాను. అందులోనూ నేను ప్రధాన పాత్రలో నటిస్తాను. అది అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా. నా నెక్ట్స్ మూవీ వచ్చే ఏడాది మార్చి లేదంటే ఏప్రిల్​లో ప్రారంభం కానుంది" అంటూ చెప్పుకొచ్చాడు.

Also Read : నా జీవితాన్ని రోజురోజుకు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నావు - హ్యాపీ బర్త్‌డే ఎన్‌ఎస్‌జీ, మహేష్‌ ట్వీట్‌ వైరల్‌

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget