అన్వేషించండి

షారుఖ్ ఖాన్​కి హత్యా బెదిరింపులు.. Y+ భద్రతను కల్పించిన ప్రభుత్వం

బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్​కి మహారాష్ట్ర ప్రభుత్వం Y+ భద్రతను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసి ఆరుగురు వ్యక్తిగత సిబ్బందిని నియమించింది.

బాలీవుడ్ అగ్ర హీరో షారుక్ ఖాన్​కి గత కొద్ది రోజుల నుంచి హత్య బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఆయన్ని చంపేస్తామంటూ ముంబైలోని ఆయన నివాసానికి కొన్ని లేఖలు కూడా రావడం జరిగింది. దీంతో షారుక్ ముంబై పోలీసులను ఆశ్రయించగా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని షారుక్ ఖాన్​కి Y+ భద్రతను కేటాయించింది. ఈ ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలు రూ.1000 కోట్ల కలెక్షన్స్​తో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ రెండు సినిమాలతో షారుక్ ఖాన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అయితే ఈ రెండు సినిమాల సక్సెస్ తర్వాత షారుక్​కి బెదిరింపులు కూడా ఎక్కువైపోయాయి.

ఆయన్ని చంపేస్తామని ముంబైలో ఆయన నివాసం మన్నథ్ రెసిడెన్సీకి పలు లేఖలు వచ్చాయి. దీంతో షారుఖ్ ఖాన్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు వస్తున్న బెదిరింపు కాల్స్ దృష్ట్యా మరింత భద్రత కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ముందుస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంది. షారుక్ కల్పించిన భద్రతను మరింత పెంచింది. ఆ భద్రతను Y+ కేటగిరీగా మారుస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు మహారాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ ఆరుగురు వ్యక్తిగత భద్రత సిబ్బందిని నియమించింది. వాళ్లు మూడు షిఫ్ట్స్​లో ఆయనకు భద్రత కల్పించబోతున్నారు.

ఈ భద్రతకు సంబంధించిన ఖర్చును షారుక్ ఖాన్ చెల్లించబోతున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ Y+ ప్లస్ భద్రతలో ఆరుగురు పోలీసు కమాండోలు, MP-5 మిషన్ గన్లు AK- 47 అసాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్ వంటి ఆయుధాలతో పోలీసులు షారుక్ ఖాన్​కి అంగరక్షకులుగా ఉంటారు. Y+ భద్రతలో మొత్తం 11 మంది రక్షణగా ఉంటారు. ఇందులో ముగ్గురు లేదా నలుగురు కమాండోలు ఉంటారు. వీరు 24 గంటల పాటు రక్షణ కల్పించి పోయే వ్యక్తికి కాపలాగా ఉంటారు. మూడు షిఫ్టుల్లో పని చేస్తారు. దీనికోసం నెలకు 15 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇక నుంచి షారుక్ ఖాన్ ఎక్కడికి వెళ్లినా ఈ వై ప్లస్ సెక్యూరిటీతోనే వెళ్తారు. వీళ్లతో పాటు లోకల్ పోలీసులు కూడా షారుఖ్​కి భద్రత ఏర్పాట్లు చేస్తారు.

షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్ల వసూళ్లను అందుకొని వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్​ని షేక్ చేసింది. అట్లీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్నిచోట్ల బ్లాక్ బస్టర్ టాక్​ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్​తో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మించిన ఈ చిత్రం బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్​లో ఒకటిగా నిలిచింది. దీనికంటే ముందు షారుక్ నటించిన 'పఠాన్' కూడా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్​ని అందుకోవడం విశేషం. చాలా ఏళ్లుగా హిట్టు లేక సతమతమవుతున్న షారుక్​కి 'పఠాన్', 'జవాన్' వంటి సినిమాలు భారీ కం బ్యాక్ ఇవ్వడంతో ఇప్పుడు అదే జోష్​తో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో 'డంకీ' సినిమా చేస్తున్నారు. డిసెంబర్ 22న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది.

Also Read : చైతూ, సమంత ప్యాచ్ అప్ అయ్యారా? ఇన్​స్టాలో పోస్ట్​కి అర్థం అదేనా?

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Suyodhana Teaser Review : అసలు సుయోధన ఎవరు? - హీరోకి వినిపించి కనిపిస్తే... ఇంట్రెస్టింగ్‌గా టీజర్
అసలు సుయోధన ఎవరు? - హీరోకి వినిపించి కనిపిస్తే... ఇంట్రెస్టింగ్‌గా టీజర్
Actress Poorna : పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ - భర్తతో కలిసి బెస్ట్ మూమెంట్
పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ పూర్ణ - భర్తతో కలిసి బెస్ట్ మూమెంట్
Keerthy Suresh: కీర్తి సురేష్ లేటెస్ట్ హిందీ సినిమా 'రఫ్తార్' రిలీజ్ డేట్... రాజ్ కుమార్ రావు సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందంటే?
కీర్తి సురేష్ లేటెస్ట్ హిందీ సినిమా 'రఫ్తార్' రిలీజ్ డేట్... రాజ్ కుమార్ రావు సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందంటే?
Mohan Babu : 'ది ప్యారడైజ్'లో మోహన్ బాబు - శికంజా మాలిక్ రోల్‌పై డైరెక్టర్ రియాక్షన్
'ది ప్యారడైజ్'లో మోహన్ బాబు - శికంజా మాలిక్ రోల్‌పై డైరెక్టర్ రియాక్షన్

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Seetha Payanam OTT : ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి సీతాపయనం - అర్జున్ కుమార్తె లవ్ ఎంటర్టైనర్ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Petrol Pump Scam: ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
ఇప్పుడు 0 కాదు.. పెట్రోల్- డీజిల్ సాంద్రతతో మోసం చేస్తున్న పెట్రోల్ పంపులు!
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
Embed widget