అన్వేషించండి

Pathaan 2: 'పఠాన్ 2'లో మరో స్టార్ హీరో, డిసెంబర్‌లో సెట్స్ మీదకు - ఇద్దరిలో విలన్ ఎవరు?

Shah Rukh Khan's Pathaan 2 Update: షారుఖ్ ఖాన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో 'పఠాన్' ఒకటి. ఆ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆల్రెడీ స్టోరీ లైన్ ఫిక్స్ చేశారు.

పఠాన్... వరుస ఫ్లాపుల్లో ఉన్న షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు భారీ విజయం అందించిన సినిమా. 'జీరో', 'జోయా ఫాక్టర్' వంటి పరాజయాల తర్వాత నాలుగేళ్లు విరామం తీసుకుని మరీ తిరిగొచ్చారు బాలీవుడ్ బాద్షా. భారీ హిట్ అందుకున్నారు. 'పఠాన్' విడుదల ముందు వరకు హిందీ వెర్షన్ హయ్యస్ట్ కలెక్షన్స్ రికార్డు ప్రభాస్ 'బాహుబలి 2' పేరు మీద ఉండేది. ఆ రికార్డును షారుఖ్ బ్రేక్ చేశారు. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ 'పఠాన్ 2'తో మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు.

'పఠాన్' క్లైమాక్స్ గుర్తు ఉందా? గూఢచారిగా మళ్లీ తిరిగొస్తానని షారుఖ్ ఖాన్ ప్రామిస్ చేస్తారు. ఆ గూఢచారిని ప్రేక్షకుల ముందుకు ఎలా తీసుకు రావాలి? కథ ఎలా ఉండాలి? అనే విషయంలో రచయిత, నిర్మాత ఆదిత్య చోప్రా (Aditya Chopra) ఓ ఐడియాకు వచ్చారని బాలీవుడ్ టాక్. పూర్తి వివరాల్లోకి వెళితే...

డిసెంబర్ 2024లో సెట్స్ మీదకు 'పఠాన్ 2'
Pathaan 2 Regular Shoot: 'పఠాన్' జనవరి 2023లో విడుదల అయింది. సినిమాకు మొదటి రోజు నుంచి సక్సెస్ టాక్ వచ్చింది. ఆ వెంటనే సీక్వెల్ చేయాలని షారుఖ్, ఆదిత్య నిర్ణయానికి వచ్చారట. కథ కూడా రెడీ చేశారని ముంబై టాక్. ఈ ఏడాది ఆఖరు (డిసెంబర్)లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని బీ టౌన్ వర్గాలు తెలిపాయి.

'పఠాన్ 2'లో షారుఖ్ వర్సెస్ సల్మాన్!
Pathaan Vs Tiger in Pathaan 2: 'పఠాన్' సినిమాలో షారుఖ్ ఖాన్ వర్సెస్ సల్మాన్ ఖాన్ ఫైట్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'పఠాన్' సినిమాలో షారుఖ్ కష్టాల్లో ఉన్నప్పుడు సల్మాన్ (టైగర్) క్యారెక్టర్ వచ్చి హెల్ప్ చేస్తుంది. 'టైగర్ 3'లో సల్మాన్ కష్టాల్లో ఉన్నప్పుడు షారుఖ్ వస్తాడు. అయితే, ఈ రెండు క్యారెక్టర్ల మధ్య ఫైట్ జరిగితే? అనే కాన్సెప్ట్ తీసుకుని 'పఠాన్ 2' స్క్రిప్ట్ రెడీ చేశారట. మరి, ఇద్దరిలో ఎవరు విలన్ అవుతారో చూడాలి.

Also Read: 19 కోట్లతో తీస్తే వచ్చింది 80 లక్షలే... సల్మాన్ డిజాస్టర్ దెబ్బకు దర్శకుడి కెరీర్ క్లోజ్, హీరోయిన్‌ అయితే ఇండియలో ఇంకో సినిమా చేయలేదు... ఆ ఫ్లాప్ ఏదో తెలుసా?

బాలీవుడ్ బడా స్టార్లు ఇద్దరి మధ్య ఫైట్ అంటే సెట్స్ మీదకు వెళ్ళకముందు నుంచి సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. 'పఠాన్ 2'తో ఈ ఫ్రాంచైజీకి ఫుల్ స్టాప్ పెట్టడం లేదని, మరిన్ని సినిమాలు వస్తూ ఉంటాయని బాలీవుడ్ ఖబర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ (YRF Spy Universe)లో 'ఏక్ థా టైగర్', 'టైగర్ జిందా హై', 'వార్', 'పఠాన్', 'టైగర్ 3' సినిమాలు వచ్చాయి. త్వరలో 'వార్ 2' స్టార్ట్ కానుంది. ఆ సినిమాలో హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించనున్నారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో మరొక ఫిమేల్ స్పై ఫిల్మ్ రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత 'పఠాన్ 2' థియేటర్లలోకి రానుంది.

Also Readపదేళ్ల తర్వాత హిందీ సినిమాలో రాశీ ఖన్నా - యాక్షన్ థ్రిల్లర్ లో శారీలో...

Pathaan 2: 'పఠాన్ 2'లో మరో స్టార్ హీరో, డిసెంబర్‌లో సెట్స్ మీదకు - ఇద్దరిలో విలన్ ఎవరు?

'పఠాన్'లో దీపికా పదుకోన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఆ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు. మరి, 'పఠాన్ 2' దర్శకత్వ బాధ్యతలను ఆదిత్య చోప్రా ఎవరికి అప్పగిస్తారో చూడాలి. 'వార్'కు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తే... 'వార్ 2'కు అయాన్ ముఖర్జీని దర్శకుడిగా ఎంపిక చేశారు. టైగర్ ఫ్రాంచైజీ సినిమాలకూ దర్శకులు మారారు.

టాప్ హెడ్ లైన్స్

Devi Sri Prasad: దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
దేవికి ఓటు వేసిన నాగార్జున... 'కింగ్ 100'కు డీఎస్పీ మ్యూజిక్ కన్ఫర్మ్
Vijay Varma: తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
తమన్నా మాజీ బాయ్‌ఫ్రెండ్‌కు లైంగిక వేధింపులు... కాస్టింగ్ కౌచ్ గురించి విజయ్ వర్మ ఏమన్నాడంటే?
Casting Couch: డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
డబ్బులు అడిగితే  లైంగిక కోర్కెలు తీర్చమన్నాడు... అందాల పోటీల్లో చీకటి కోణం
Nandamuri Deepika: నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు
నిజమైన ఫ్రెండ్ మీరే... భర్తను గుర్తు చేసుకున్న హరికృష్ణ పెద్ద కోడలు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget