అన్వేషించండి

Yodha Teaser Review: పదేళ్ల తర్వాత హిందీ సినిమాలో రాశీ ఖన్నా - యాక్షన్ ఫిల్మ్‌లో ట్రెడిషనల్‌గా!

Raashi Khanna look in Yodha: తెలుగు సినిమాలతో పాపులరైన ఢిల్లీ అమ్మాయి రాశీ ఖన్నా. ఇప్పుడామె ఓ హిందీ సినిమా చేశారు. యాక్షన్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేసినట్లు అర్థం అవుతోంది.

రాశీ ఖన్నా ఢిల్లీ అమ్మాయి. హిందీ సినిమా 'మద్రాస్ కేఫ్'తో కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేశారు. జాన్ అబ్రహం సరసన నటించిన ఆ సినిమా 2013లో విడుదలైంది. ఆ మరుసటి ఏడాది 'ఊహలు గుసగుసలాడే'తో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి తెలుగు సినిమాలు చేస్తున్నారు. మధ్యలో ఓ మలయాళ, కొన్ని తమిళ సినిమాలు చేశారు. హిందీ వెబ్ సిరీస్‌లు 'రుద్ర', 'ఫర్జి' కూడా చేశారు. అయితే... పదేళ్ల తర్వాత మళ్లీ ఆమె ఓ హిందీ చేశారు. ఆ సినిమా పేరు 'యోధ'. ఇవాళ టీజర్ విడుదలైంది.

యాక్షన్ సినిమాలో రాశి ట్రెడిషనల్ లుక్!
Yodha Teaser Review: యాక్షన్ ఎంటర్‌టైనర్, థ్రిల్లర్ సినిమాగా 'యోధ'ను తెరకెక్కించారు. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. కథ ఏమిటి? అనేది టీజర్ చూస్తే ఈజీగా చెప్పవచ్చు. ప్రయాణికులతో బయలు దేరడానికి సిద్ధంగా ఉన్న ఓ భారతీయ విమానాన్ని తీవ్రవాదులు హైజాక్ చేస్తారు. వాళ్లను విడిపించడానికి భారత ప్రభుత్వం, అధికారులు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 

'యోధ'లో సిద్ధార్థ్ మల్హోత్రా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రోల్ చేశారు. కమాండోగా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేసినట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. రాశీ ఖన్నా రోల్ ఏమిటనేది క్లారిటీ లేదు. కానీ, ఆమె ట్రెడిషనల్ లుక్ - శారీలో కనిపించారు. ఎయిర్ పోర్ట్ లేదా ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. మరో హీరోయిన్ దిశా పాట్నీ ఎయిర్ హోస్టెస్ డ్రస్ లో కనిపించారు. ఆమె యాక్షన్ సీన్లు కూడా చేశారట.

Also Readయువ దర్శకుడికి అవకాశం ఇస్తున్న బాలకృష్ణ - నానికి హిట్ ఇచ్చినోడితో?

''సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించడం గొప్ప అనుభూతి ఇచ్చింది. అతనికి క్రమశిక్షణ చాలా ఎక్కువ. 'యోధ' సినిమాలో యాక్షన్ సీక్వెన్సుల కోసం అతను చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రేక్షకులు ఈ ఇసినిమా ఎప్పుడు చూస్తారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కెమెరా ముందు మాత్రమే కాదు... కెమెరా వెనుక సైతం సిద్ధార్థ్ మల్హోత్రా అమేజింగ్ పర్సన్. ఆయన బిహేవియర్ నన్ను ఆకట్టుకుంది. అతనిలో భక్తి కూడా ఎక్కువే'' అని కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో రాశీ ఖన్నా పేర్కొన్నారు. 

సిద్ధార్థ్ మల్హోత్రా... షేర్షా నిర్మాతలు!
కార్గిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కిన హిందీ సినిమా 'షేర్షా'లో సిద్ధార్థ్ మల్హోత్రా ఆర్మీ ఆఫీసర్ రోల్ చేశారు. మరోసారి ఆయన ఆ తరహా పాత్రను 'యోధ'లో చేస్తున్నారు. విశేషం ఏమిటంటే...  'షేర్షా' మేకర్స్ 'యోధ'ను ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు. సాగర్ అంబ్రే, పుష్కర్ ఓఝా సంయుక్త దర్శకత్వంలో 'యోధ' తెరకెక్కింది. మార్చి 15న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: సితార చేతికి మమ్ముట్టి 'భ్రమయుగం' - తెలుగులో ఆ రోజే విడుదల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget