అన్వేషించండి

Bhupinder Singh: వ్యక్తిని గన్‌తో కాల్చి చంపిన సీరియల్ నటుడు - చిన్న కారణానికే దారుణం

మామూలుగా పొలం తగాదాల్లో కుటుంబాల మధ్య హత్యలు జరగడం కామన్‌గా మారిపోయింది. కానీ ఒక నటుడు కూడా ఇలాంటి ఒక చిన్న విషయంపై తన పక్కింటివారిని హత్య చేయడం కలకలం సృష్టిస్తోంది.

ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకు గొడవలకు పెట్టుకొని, అది సీరియస్ అయితే ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఇక ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉండే సెలబ్రిటీలు కూడా దీనికి మినహాయింపు కాదని ఒక టీవీ నటుడు నిరూపించాడు. తన పక్కింటివారితో జరిగిన గొడవలో కోపంతో ఒకరి చావుకు కారణమయ్యాడు బుల్లితెర నటుడు. మరో ముగ్గురు కూడా తన వల్లే తీవ్ర గాయాలపాలయ్యారు. ఆ సీరియస్ నటుడు ఎవరో తెలుగు ప్రేక్షకులకు తెలియకపోయినా.. హిందీలో సీరియల్స్‌ను ఫాలో అయ్యేవారికి మాత్రం సుపరిచితుడే. అతడే భూపిందర్ సింగ్. తెలుగులో కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్, చిరంజీవిలాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు భూపిందర్. టాలీవుడ్‌లో కూడా ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకున్న ఈ నటుడు.. ఇప్పుడు హంతకుడు అయ్యాడు.

చెట్ల కోసం గొడవ..
‘యే ప్యార్ న హోగా కమ్’, ‘మధుబాలా’ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు భూపిందర్ సింగ్. తాజాగా ఒకరి చావుకు కారణమయ్యి.. పోలీసులను తనను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలు ఏం జరిగిందంటే.. బిజ్నోర్‌లోని తన పొలం దగ్గర ఒక కంచెను ఏర్పాటు చేసుకున్నాడు భూపిందర్. తన పొలం పక్కనే ఉన్న గుర్దీప్ సింగ్ పొలంలో నుంచి కొన్ని చెట్లను కట్ చేయాలని భూపిందర్ నిర్ణయించుకున్నాడు. దానికి గుర్దీప్ ఒప్పుకోలేదని సమాచారం. దీంతో భూపిందర్‌కు కోపం రావడంతో ముగ్గురు మనుషులను తీసుకువెళ్లి గుర్దీప్‌పై, తన కుటుంబ సభ్యలపై దాడి చేశాడు. 

గన్‌తో కాల్పులు..
భూపిందర్‌ సింగ్‌తో పాటు తనతో పాటు వచ్చిన అనుచరులు కొన్ని లైసెన్స్ ఉన్న గన్స్‌తో, కొన్ని చట్టవిరుద్ధమైన ఆయుధాలతో గుర్దీప్ కుటుంబంపై దాడి చేశారు. ఈ దాడిలో గుర్దీప్ 23 ఏళ్ల కొడుకు గోవింద్ మరణించాడు. మరో కుమారుడు అమ్రీక్‌కు, తన భార్య బీరో బాయ్‌కు గాయాలు అయ్యాయి. గుర్దీప్ సింగ్ మాత్రం ఈ దాడి నుంచి తప్పించుకోగలిగాడు. గాయాలపాలైనవారిని మోరదాబాద్ డిఐజీ కలిసి ఘటన గురించి విచారించారు. దీనిలో పోలిసుల వైఫల్యం కూడా ఉందని బాధిత కుటుంబం ఆరోపించింది. నవంబర్ 19న భూపిందర్ సింగ్.. తమతో గొడవకు వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని వాపోయారు. వారు అప్పుడే ఫిర్యాదును సీరియస్‌గా తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్నారు.

హిందీతో పాటు తెలుగులో కూడా..
ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే భూపిందర్ సింగ్‌తో పాటు తన అనుచరులను అరెస్ట్ చేశారు. ఇందులో పాల్గొన్న మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గుర్దీప్ కుటుంబం చికిత్సను అందుకుంటోంది. సీరియల్స్‌లో మాత్రమే కాకుండా భూపిందర్ సింగ్.. పలు సినిమాల్లో కూడా నటించాడు. ‘షామ్ గన్‌షామ్’, ‘విలన్’, ‘యువ్‌రాజ్’ వంటి హిందీ చిత్రాలతో పాటు ‘బద్రి’, ‘అంజి’, ‘తమ్ముడు’ వంటి తెలుగు సినిమాల్లో కూడా భూపిందర్ సింగ్ కనిపించాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘తమ్ముడు’లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించన భూపిందర్.. తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.

Also Read: ఆ రేప్ సీన్‌తో పోలిస్తే ఇదెంత - యానిమల్ ఇంటిమేట్ సీన్స్ పై తృప్తి దిమ్రీ షాకింగ్ కామెంట్స్?

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget