‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో యాంగ్రీ మ్యాన్? సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేస్తున్న సీనియర్ హీరో?
నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’. ఇందులో ఒక పవర్ ఫుల్ రోల్ లో సీనియర్ హీరో ఒకరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టాలీవుడ్ లో 'యాంగ్రీ మ్యాన్' అనగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చే హీరో డా. రాజశేఖర్. ఒకప్పుడు అగ్ర హీరోల్లో ఒకరిగా రాణించిన ఆయన.. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, డ్రామా.. ఇలా అన్ని రకాల సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. అయితే సీనియర్ నటుడు గత దశాబ్ద కాలంగా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నారు. 'పీఎస్‌వీ గరుడ వేగ' 'కల్కి' చిత్రాలు హిట్టయినా, సక్సెస్ ట్రాక్ ని కొనసాగించలేకపోయారు. దీంతో కాస్త గ్యాప్ తీసుకొని 'శేఖర్' సినిమాలో తన వయసుకు తగ్గ పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసారు. కానీ ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో రూట్ మార్చిన రాజశేఖర్ ఇప్పుడు ఓ యంగ్ హీరో సినిమాలో స్పెషల్ రోల్ చేయడానికి రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి.
కెరీర్ ప్రారంభంలో క్యారక్టర్ ఆర్టిస్టుగా, విలన్ వేషాలు వేసిన రాజశేఖర్.. హీరోగా అవకాశాలు అందుకున్న తర్వాత అలాంటి రోల్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే సోలో హీరోగా సినిమాలు తగ్గించిన తర్వాత ఆయన కొత్త అవతారంపై ప్రచారం సాగుతూ వచ్చింది. ఫలానా సినిమాతో ప్రతినాయకుడిగా రీఎంట్రీ ఇవ్వనున్నారని, ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. రాజశేఖర్ సైతం 'ధృవ' చిత్రంలో అరవింద్ స్వామి తరహా విలన్ రోల్స్ చేయడానికి రెడీ అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఆ సమయంలో ఆయనకి చాలా అవకాశాలే వచ్చినా ఎందుకనో చేయలేదు. అయితే ఇన్నేళ్లకు ఓ స్పెషల్ రోల్ కు ఓకే అన్నారని, ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ మూవీలో కీలక పాత్ర పోషించనున్నారని టాక్ వినిపిస్తోంది.
యూత్ స్టార్ నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’. ఇందులో శ్రీలేల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో కీలకమైన పాత్ర కోసం రాజశేఖర్ ను చిత్ర బృందం సంప్రదించారట. కథ నచ్చడం, తనదైన శైలిలోనే సాగే పాత్ర కావడంతో ఈ చిత్రంలో నటించడానికి సీనియర్ నటుడు వెంటనే అంగీకరించారట. అంతేకాదు రెండు రోజుల క్రితం ఆయన సెట్స్ లో అడుగుపెట్టి షూటింగ్ లో పాల్గొంటున్నారని వార్తలు వస్తున్నాయి.
Also Read: ఈ ఏడాదిలో ఇదే పెద్ద సినిమా.. బడ్జెట్లో కాదండోయ్ రన్టైమ్లో.. మాసోడు అంతసేపు సీట్లో కూర్చోబెడతాడా?
రాజశేఖర్ కోసం దర్శక రచయిత వక్కంతం వంశీ ఒక పవర్ ఫుల్ పాత్రను డిజైన్ చేశారట. అది ప్రత్యేక పాత్ర అయినప్పటికీ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. ఇప్పటి వరకు యాంగ్రీ మ్యాన్ గా అలరించిన రాజశేఖర్.. ఇప్పుడు ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ సినిమాలో స్పెషల్ రోల్ తో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతారని, కచ్చితంగా నితిన్ చిత్రానికి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో రాజశేఖర్ ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారో చూడాలి.
కాగా, ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ చిత్రాన్ని ఆదిత్య మూవీస్ సమర్పణలో నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. హరీష్ జైరాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఇతర పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. కొన్ని రోజుల క్రితం వచ్చిన 'డేంజర్ పిల్లా' లిరికల్ సాంగ్ సంగీత ప్రియులను అలరించింది. ఈ చిత్రం డిసెంబర్ 8న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ముందుగా డిసెంబర్ 23న విడుదల చేయాలని భావించారు కానీ, 'సలార్' సినిమాని డిసెంబర్ 22న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించడంతో నితిన్ మూవీ రిలీజ్ ను రెండు వారాలు ప్రీపోన్ చేశారు.
Also Read: ఓటీటీలోకి రాబోతున్న షారుఖ్ 'జవాన్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial