సూర్య 'ఆవేశం' ఫేమ్ జితు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ 'సీన్'. ఈ టైటిల్ గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు.
SCENE Title Glimpse: 'సీన్' తెలుగు టైటిల్ టీజర్ రిలీజ్... డీఎస్పీ ప్రేమ్‌రాజ్‌గా అదరగొట్టిన సూర్య
Suriya SCENE Glimpse: 'కరుప్పు', 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయం తర్వాత సూర్య నటిస్తున్న సినిమా 'సీన్'. అందులో ఆయన డీఎస్పీ రోల్ చేశారు. తాజాగా తెలుగు టైటిల్ టీజర్ విడుదల చేశారు.

- సూర్య జితు మాధవన్ దర్శకత్వంలో 'సీన్' టైటిల్ టీజర్ విడుదలయ్యింది.
- డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య విలక్షణ ప్రవర్తన హైలైట్ అయింది.
- నజ్రియా హీరోయిన్; సినిమా దీపావళికి నవంబర్ 6న విడుదలవుతుంది.
'కరుప్పు' (తెలుగులో 'వీరభద్రుడు'), 'విశ్వనాథ్ అండ్ సన్స్' విజయాలతో సూర్య (Suriya) సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల విదేశాల్లో 20వ వివాహ వార్షికోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. జ్యోతికను మళ్ళీ పెళ్ళి చేసుకున్నారు. ఇప్పుడు కొత్త సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు. 'ఆవేశం' ఫేమ్, మలయాళ దర్శకుడు జితు మాధవన్ (Jithu Madhavan) కాంబినేషన్‌లో సూర్య చేస్తున్న సినిమా (Suriya 47 Film)కు 'సీన్' (Scene) టైటిల్ ఖరారు చేశారు. తాజాగా తెలుగు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు.
డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య
'సీన్' సినిమాలో విచిత్రమైన పోలీస్ ఆఫీసర్, డీఎస్పీ ప్రేమ్‌రాజ్ పాత్రలో సూర్య నటిస్తున్నారు. లేటెస్టుగా విడుదల చేసిన వీడియోలో ఆయన పాత్రను పరిచయం చేశారు. వాయిస్ ఓవర్ ద్వారా డీఎస్పీ విలక్షణమైన వ్యక్తిత్వాన్ని, సినిమాలో ఫన్ ఎలా ఉంటుందనేది స్పష్టంగా చూపించారు. క్రైమ్ సీన్ వద్దకు డీఎస్పీ ప్రేమ్‌రాజ్ రావడం, ఆయన విచిత్రమైన ప్రవర్తన, అలవాట్లు నవ్వులు పూయించడమే కాదు... సినిమాతో పాటు ఆ పాత్రపై ఆసక్తి పెంచుతున్నాయి.
'సీన్' టైటిల్ గ్లింప్స్‌లో కానిస్టేబుల్ భుజంపై చేయి వేసిన సూర్య ఎంట్రీ స్టైలిష్‌గా, కమాండింగ్‌గా ఉంది. ఎంతటి కఠినమైన నేరస్థులను అయినా పట్టుకోగలనని ఆయన చెప్పే డైలాగులు మాస్ ఎలివేషన్‌ను అందించగా... ఆ వార్నింగ్ ఆకట్టుకుంది. సూర్య స్వాగ్, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం మెప్పించేలా ఉన్నాయి.
Also Read: Pragya Jaiswal Bikini Photos - బికినీలో ప్రగ్యా జైస్వాల్... స్లిమ్ అండ్ గ్లామరస్ లుక్‌లో బ్యూటీ
'సీన్' సినిమాలో సూర్య సరసన నజ్రియా కథానాయికగా కాగా... 'ప్రేమలు' ఫేమ్ నస్లీన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జగారం స్టూడియోస్, 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై జ్యోతిక, సూర్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ ఏడాది నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
Also Read: Ranabaali Release Date - అక్టోబర్ 16నే 'రణబాలి' రిలీజ్... షూటింగ్ ఫినిష్ చేసిన విజయ్ దేవరకొండ టీమ్
Frequently Asked Questions
సూర్య కొత్త సినిమా టైటిల్ ఏమిటి?
'సీన్' సినిమాలో సూర్య పాత్ర ఏమిటి?
'సీన్' సినిమాలో సూర్య డీఎస్పీ ప్రేమ్‌రాజ్ అనే విచిత్రమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన విలక్షణమైన వ్యక్తిత్వం, అలవాట్లు సినిమాలో ఫన్‌ను అందిస్తాయి.
'సీన్' సినిమాలో హీరోయిన్ ఎవరు? నిర్మాతలు ఎవరు?
'సీన్' సినిమాలో సూర్య సరసన నజ్రియా కథానాయికగా నటిస్తోంది. జ్యోతిక, సూర్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
'సీన్' సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది?
'సీన్' సినిమా ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. చిత్ర బృందం అధికారికంగా ఈ తేదీని ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు






















