ఓటీటీల్లో సూర్య సూపర్ హిట్ సినిమాలు - ఎందులో ఏముందో తెలుసా?

Published by: Satya Pulagam

తమిళంతో పాటు తెలుగులోనూ సూర్యకు బ్లాక్ బస్టర్ అందించిన సినిమా 'గజినీ'. ఇందులో అసిన్ హీరోయిన్. సన్‌ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సూర్య సన్నాఫ్ కృష్ణన్... గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

'ఆకాశమే నీ హద్దురా' తర్వాత 'జై భీమ్' కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయ్యింది. అది కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో డైరెక్టుగా విడుదలైన సూర్య సినిమా 'ఆకాశమే నీ హద్దురా'. దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

పోలీసుగా సూర్య నటించిన సినిమా 'యముడు'. ఈ సినిమా జియో హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

'యముడు' తర్వాత సింగమ్ ఫ్రాంచైజీ చేశారు సూర్య. అందులో 'సింగమ్ 2' సన్ నెక్స్ట్, జియో హాట్ స్టార్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

'సింగమ్ 3' మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

'గజినీ' తర్వాత ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా 'సెవెంత్ సెన్స్'. ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాను యూట్యూబ్ లో చూడవచ్చు. సన్‌ నెక్ట్స్‌ ఓటీటీలో కూడా ఉంది. 'వీడోక్కడే' కూడా యూట్యూబ్ లో ఉంది.

లింగుస్వామి దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా 'సికిందర్'. తెలుగు వెర్షన్ 'జీ 5' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులో వెంకటేష్ చేసిన 'ఘర్షణ' గుర్తుందా? సూర్య చేసిన తమిళ్ హిట్ 'కాక్కా కాక్కా'కు రీమేక్ అది. సూర్య సినిమా 'సింప్లీ సౌత్' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకు ముందు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఉండేది. కానీ, ఇప్పుడు అందుబాటులో లేదు.