Satya Dev Samavarthi : సమవర్తిగా సత్యదేవ్ - వెర్సటైల్ హీరో వైల్డ్ యాక్షన్ మోడ్
Satya Dev SD16 Update : టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కొత్త మూవీ పోస్టర్ రిలీజైంది. ఆయన కెరీర్‌లో ఇది 16వ సినిమా కాగా డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.

Satya Dev's SD16 Movie First Poster Out Now : డిఫరెంట్ రోల్స్‌తో తనకుంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు టాలీవుడ్ వెర్సటైల్ హీరో సత్యదేవ్. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాణంలో హీరోగా నటించిన మూవీ 'రావు బహదూర్' రిలీజ్‌కు రెడీగా ఉంది. తాజాగా తన నెక్స్ట్ మూవీ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు.
సరికొత్త టైటిల్
సత్యదేవ్ కెరీర్‌లో ఇది 16వ మూవీ కాగా 'సమవర్తి' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మాస్ లుక్‌లో సత్యదేవ్ ఫస్ట్ పోస్టర్ హైప్ క్రియేట్ చేస్తోంది. కొందరు కత్తులు, వెపన్స్‌తో చుట్టుముట్టగా... చెవిలో హెడ్ ఫోన్స్, నోట్లో బీడీతో నుదుటిపై గాటుతో కూల్‌గా మాస్ ఇంటెన్స్‌గా సత్యదేవ్ లుక్ ఆసక్తి కలిగిస్తోంది. ఆయన పూర్తిగా కొత్త జానర్‌లోకి అడుగుపెడుతూ... ఫుల్ ఫ్లెడ్జ్, యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు. 'ఓ భయంకరమైన సాహస యాత్ర' అంటూ మేకర్స్ రాసుకొచ్చారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీ రూపొందిస్తున్నారు.
ఈ మూవీకి అజయ్ నాగ్ దర్శకత్వం వహించగా... వైల్డ్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందించనున్నారు. రుద్ర పిక్చర్స్, పంచభూత క్రియేషన్స్ బ్యానర్‌పై... శశిధర్ రెడ్డి, శివచరణ్ రెడ్డి నిర్మిస్తున్నారు. సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మిగిలిన అప్డేట్స్ రానున్నాయి.
View this post on Instagram
Also Read : ఓటీటీలోకి గాయపడ్డ సింహం - సడన్‌గా తరుణ్ భాస్కర్ కొత్త మూవీ స్ట్రీమింగ్
సమవర్తి నటీనటులు : సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్ తదితరులు.
టెక్నికల్ టీమ్ : ఆర్ట్ డైరెక్టర్ - మొండ్రు రవికుమార్, కాస్ట్యూమ్ డిజైనర్ - ప్రియాంక రెబెకా శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్ - ఉల్లాస్ హైదుర్
ఎడిటర్ - ఆదిత్య తివారి, డీవోపీ - హర్ష మల్లికార్జున, దేవ్ దీప్ గండికుండు, మ్యూజిక్ - సింజిత్ యెర్రమల్లి, క్రియేటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఉజ్వల్ బీఎం, ప్రొడ్యూసర్స్ - శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి, డైరెక్షన్ - అజయ్ నాగ్.వి
సత్యదేవ్ హీరోగా నటించిన సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' జులై 3న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత జూన్ 5నే రిలీజ్ కావాల్సి ఉండగా... అనుకోని కారణాలతో వాయిదా పడింది. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ మూవీని జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మహేశ్ బాబు నిర్మించారు. సత్యదేవ్ సరసన దీప థామస్ హీరోయిన్‌గా నటించారు. 1920 - 40ల నాటి పీరియాడికల్ సైకలాజికల్ డ్రామాగా మూవీ తెరకెక్కినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది.
Before You Go
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు























