Samantha Ruth Prabhu: ఒకవైపు నాగ చైతన్య పెళ్లి... మరోవైపు సమంత పార్టీ... చైతూ పెళ్లి రోజు సామ్ అలా చేసిందా?
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి సందడి నెలకొన్న వేళ సమంత షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఆసక్తికరంగా మారింది. అందులో సమంత పార్టీని ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
సమంత - నాగ చైతన్య గురించి వచ్చే ప్రతీ వార్తా ఆసక్తికరమే. సౌత్ క్వీన్ సమంత ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాగ చైతన్యకి సంబంధించి ఏ వార్త తెరపైకి వచ్చినా ముందుగా అందరి చూపు సమంతపైనే పడుతుంది. ఈ జంట మాజీ అయినప్పటికీ వాళ్ల గురించి వచ్చే వార్తలు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సమంత ఓ పార్టీలో ఎంజాయ్ చేయడం, అది నాగచైతన్య రెండో పెళ్లి తర్వాత కావడం కొత్త చర్చకు దారి తీసింది.
గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య 2021లో డివోర్స్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సింగిల్ గా ఉన్న నాగ చైతన్య హీరోయిన్ శోభిత దూళిపాళతో ప్రేమలో పడ్డాడు. అయితే ఈ విషయాన్ని నాగ చైతన్య అఫీషియల్ గా ప్రకటించలేదు. కానీ ఒకానొక టైంలో శోభిత - నాగ చైతన్య కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వీరి రిలేషన్ గురించి రూమర్లు మొదలయ్యాయి. కానీ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని ఆ తర్వాత విషయాన్ని బయటపెట్టారు శోభిత - నాగచైతన్య.
కానీ సమంత - నాగ చైతన్య విడిపోవడం అన్నది సంచలనంగా మారింది. పైగా నాగ చైతన్యతో డివోర్స్ కారణంగా సమంత దారుణమైన ట్రోలింగ్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన వీరిద్దరూ ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. ఓవైపు సమంత, మరోవైపు నాగచైతన్య సినిమాలు చేసుకుంటూ గడిపేశారు. అయితే ఒకానొక టైంలో మయోసైటిస్ కారణంగా సమంత దాదాపు ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. రీసెంట్ గా 'సిటాడెల్ హనీ బన్నీ' అనే అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ తో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది. ఇక మరోవైపు నాగ చైతన్య - శోభిత ధూళిపాళ్లతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. డిసెంబర్ 4న ఈ జంట పెద్దల ఆశీర్వాదాలతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.
అయితే నాగ చైతన్య - శోభితతో రెండో పెళ్లి చేసుకుంటున్న సమయంలో సమంత తన స్నేహితులతో కలిసి కాక్ టెయిల్ పార్టీని ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆ వీడియోలో బ్యాగ్రౌండ్ ప్లేలో మ్యూజిక్ వస్తుండగా, సమంత తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ చేస్తూ సరదాగా పార్టీని ఎంజాయ్ చేస్తుంది. 'ఇష్టమైన వారితో అందమైన సాయంత్రం' అంటూ ఆ పిక్ ను సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. ఈ వైరల్ వీడియోలో సమంత బ్యాక్ లెస్ లాంగ్ ఫ్రాక్ ధరించింది. ఓపెన్ హెయిర్ స్టైల్ తో హాలీవుడ్ హీరోయిన్ లా కనిపించింది.
అయితే మరోవైపు శోభిత దూళిపాళతో నాగచైతన్య రెండో వివాహంపై సమంత ఎలా స్పందిస్తుందో అనే ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో సమంత షేర్ చేసిన ఆ ఫోటో మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షించింది. నాగ చైతన్య రెండవ వివాహంపై ఆమె డైరెక్ట్ గా కామెంట్ చేయలేదు. కానీ ఇలా పార్టీలో ఎంజాయ్ చేస్తూ కనిపించి, ఆ విషయాన్ని ఆమె అసలు పట్టించుకోలేదు అనిపించేలా చేసింది. ఇదిలా ఉండగా నాగ చైతన్య ఆగస్టులో శోభితతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం జరిగింది. కాగా సమంత ప్రస్తుతం 'రక్త్ బ్రహ్మాండ్' అనే సినిమా షూటింగ్ స్టార్ట్ చేసింది. మరోవైపు నాగ చైతన్య 'తండేల్' సినిమాతో బిజీగా ఉన్నాడు.
Also Read: నా కోసం కాదు, వాళ్ళ కోసం... ఆ మూడుసార్లూ Pushpa 2 హిట్టవ్వాలని బలంగా కోరుకున్నా - అల్లు అర్జున్