అన్వేషించండి

Samantha : సమంత ప్రస్తుతానికి ఖాళీ - చేతిలో ఉన్నవన్నీ ఫినిష్, వాట్ నెక్స్ట్ బేబీ?

సిటాడెల్ వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమంత స్పష్టం చేశారు. దాంతో ఆవిడ నెక్స్ట్ ఏం చేస్తుంది? అని ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. కొందరు అయితే సినిమాలకు గుడ్ బై చెబుతుందా? అంటున్నారు. 

'సిటాడెల్' వెబ్ సిరీస్ షూటింగ్ కంప్లీట్ చేసినట్టు సమంత (Samantha) స్పష్టం చేశారు. దాంతో ఆవిడ నెక్స్ట్ ఏం చేస్తుంది? అని ఫ్యాన్స్ డిస్కస్ చేస్తున్నారు. కొందరు అయితే సినిమాలకు గుడ్ బై చెబుతుందా? అంటున్నారు. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్తుందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమంత చేతిలో ఇప్పుడు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ‘ఖుషి’ సినిమా ఒకటి. అలాగే, ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ మరొకటి. 

జులై 13 నాకెంతో ప్రత్యేకమైన రోజు: సమంత

విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ సినిమాలో సమంత నటించింది. ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ఇప్పుడు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ కూడా జులై 13తో పూర్తయింది. ఈ సందర్భంగా ఆమె ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ‘‘జులై 13 నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఈ రోజు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ పూర్తయింది’’ అని రాసుకొచ్చింది. అయితే సమంత ‘ఖుషి’, ‘సిటాడెల్’ ప్రాజెక్టుల తర్వాత సమంత మరే ప్రాజెక్ట్ కి కూడా సైన్ చేయలేదు. ఇప్పుడు సమంత ఇలా పోస్ట్ చేయడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమంత ఇకపై సినిమాల్లో నటించదా?

మొన్నటి వరకూ సమంత కొన్ని రోజుల పాటు తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం పై శ్రద్ద పెట్టడానికే సినిమాల నుంచి విరామం తీసుకుంటోంది అని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు సమంత చేసిన పోస్ట్ కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ షూటింగ్ చివరి రోజు తనకెంతో స్పెషల్ అని సమంత చెప్పడంతో ఇకపై కెమెరా ముందుకు రాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే సమంత ఇలా ఎమోషనల్ పోస్ట్ చేసింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. 

Also Read సాయి తేజ్ - చీటీల చిన్ని - అప్పులు, వసూళ్లు, నవ్వులు

అడ్వాన్సులన్నీ వెనక్కి..

సమంత చేతితలో ఉన్న రెండు ప్రాజెక్టులు కూడా పూర్తయిపోయాయి. తన నుంచి ఎలాంటి కొత్త ప్రాజెక్ట్ ప్రకటనలూ రాలేదు. అయితే కొన్ని సినిమాలకు ముందే అడ్వాన్సులు తీసుకున్న సమంత వాటన్నిటినీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తుందట. దాదాపు ఏడాది పైగానే ఆమె సినిమాలకు దూరంగా ఉంటుందని అంటున్నారు. అయితే విరామం తర్వాత అయినా వచ్చి తమ సినిమాల్లో చేయాలని అడ్వాన్సులు ఇస్తున్నారట మేకర్స్. అయినా వాటిని కూడా సమంత సున్నితంగా తిరిస్కరిస్తోందని తెలుస్తోంది. దీంతో సమంత ఇప్పట్లో సినిమాల్లో నటించదా లేదా పూర్తిగా సినిమాలకు దూరం అవ్వాలనుకుంటుందా అనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరి ఫ్యాన్స్ కు సమంత ఎలాంటి న్యూస్ చెబుతుందో వేచి చూడాలి. ఇక విజయ్ దేవరకొండతో కలసి నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్, సమంత ఇద్దరికీ ఈ సినిమా చాలా ప్రత్యేకం. మరి ఈ మూవీ వీరికి ఎలాంటి హిట్ ను అందిస్తుందో చూడాలి. 

Also Read: ఆమె నన్ను మోసం చేసింది - కంగనా రనౌత్‌పై బీజేపీ నేత ఫైర్, కోర్టులో దావా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Varanasi : వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
వారణాసి నుంచి మరో లీక్ - మహేశ్ ఫ్యాన్స్ ఆందోళన... రాజమౌళి రియాక్షన్ ఏంటి?
Nandamuri Alekhya: మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
మోడలింగ్‌లోకి నందమూరి అలేఖ్య... కెరీర్ రీస్టార్ట్ చేసిన తారకరత్న భార్య
GDN Release : మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
మిరాకిల్ మ్యాన్ మాధవన్ - ఎడిసన్ ఆఫ్ ఇండియా GDN రియల్ స్టోరీ... ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్‌
Bhari Movie: 'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి
'బరి'లో తండ్రీ కొడుకులు... తొలిసారి నాగబాబు, వరుణ్ తేజ్ కలిసి

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget