News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

పాన్ మూవీ అదుర్స్, ఫ్యామిలీ మూవీ రాక్స్ - పోటాపోటీగా ‘సామజవరగమన’, ‘స్పై’ కలెక్షన్స్!

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో రిలీజ్ అవుతున్న సినిమాలు మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి.. రీసెంట్ గా విడుదలైన నిఖిల్ సిద్ధార్థ్' స్పై'.. శ్రీ విష్ణు సామజవరగమన భారీ కలెక్షన్స్ వసూలు చేస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Samajavaragamana vs Spy BO Collections : రెండు మీడియం-బడ్జెట్ తెలుగు సినిమాలు లాంగ్ వీకెండ్‌లో విడుదలై బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్‌కి మరింత ఊపును తీసుకొచ్చాయి. స్వాతంత్య్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ కథాంశంతో హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'స్పై' మూవీ విదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 16 కోట్లు రాబట్టింది.

‘‘ 'స్పై' రెండవ రోజు ప్రపంచవ్యాప్తంగా 15.8 కోట్ల గ్రాస్‌ను సాధించి ఘనమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. వారాంతం ప్రారంభం కాగానే, సినిమా బుకింగ్‌లు దూకుడును ప్రదర్శించాయి" అని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా ట్వీట్ చేశారు. వాస్తవానికి పాన్ ఇండియా మూవీగా నిఖిల్ మూవీకి ఇంకా హైప్ వస్తుందని ఆశించారు. ఒక వేళ ‘సామజవరగమన’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చి ఉండకపోతే.. ఈ మూవీకి మరిన్ని వసూళ్లు సాధించేదని తెలుస్తోంది. ప్రస్తుతమైతే రెండు సినిమాలు.. నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ శ్రీవిష్ణు మూవీకే ఓటేస్తున్నారు.

బక్రీద్ కారణంగా జాతీయ సెలవు దినమైన గురువారం ఈ స్పై.. ‘కార్తికేయ 2’కు సమానంగా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ ను ప్రారంభించింది. ఇక సోమవారం నుంచి కూడా 'స్పై' ఇదే జోరును కొనసాగిస్తోందో లేదో చూడాలి. కాగా ఈ చిత్రానికి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు వచ్చాయి. గ్యారీ BH దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'స్పై'లో నిఖిల్ సిద్ధార్థ RAW ఏజెంట్ పాత్రను పోషించాడు. 

ఇదిలా ఉండగా హీరో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం, మొదటి రోజు కంటే 2వ రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. కేవలం మౌత్ పబ్లిసిటీతో ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన 'సామజవరగమన' మూవీని తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.6.3 కోట్లు రాబట్టింది. అమెరికాలోనూ తెలుగు సినిమాలకు మంచి స్పందన వస్తోంది. 

ఇటీవలి కాలంలో రిలీజ్ అయ్యే సినిమాలు బాలీవుడ్ మూవీస్ కంటే ఎక్కువ వసూళ్లను రాబడుతున్నాయి. వచ్చే శుక్రవారం, శ్రీ సింహ నటించిన 'భాగ్ సాలే', నాగ శౌర్య నటించిన 'రంగబలి' థియేటర్లలో విడుదల కానున్నాయి. మరి ఈ సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటాయో వేచి చూడాలి.

ఇక 'స్పై' సినిమాలో హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య మీనన్.. తమిళ, మలయాళ ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో ఆమె జాక్ పాట్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించేందుకు ఆల్ మోస్ట్ ఆమె ఎంపికయినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. 'ఓజి' సినిమాలో ఐశ్వర్య ఓ ఇంపార్టెంట్ రోల్ ను పోషించనున్నట్టు సమాచారం. దర్శకుడు సుజిత్.. నిర్మాత దానయ్య కలిసి 'ఓజీ' సినిమాను ఓ డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు. ఇటీవలే ముంబయిలో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా... ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ మూవీకి సంబంధించిన వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

Read Also : Arjun Das Telugu Movie : తెలుగులోకి అర్జున్ దాస్ తమిళ సినిమా - లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రొడక్షన్ గురూ

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 02 Jul 2023 01:29 PM (IST) Tags: Sri Vishnu Box office Collections Spy Nikhil Siddarth samajavaragamana Pan Indinan Movies

ఇవి కూడా చూడండి

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Hi Nanna Movie Review - హాయ్ నాన్న రివ్యూ: నాని, మృణాల్ సినిమా హిట్టా? ఫట్టా?

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Movies Releasing This Week : ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమా, సిరీస్‌లు ఇవే!

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

Prabhas Marriage: ప్రభాస్‌కు జన్మలో పెళ్లి కాదు - బాంబు పేల్చిన వేణు స్వామి, మండి పడుతున్న ఫ్యాన్స్!

Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ

Aditi Govitrikar: అందుకు ఒప్పుకోలేదని సినిమా నుంచి తీసేశారు - క్యాస్టింగ్ కౌచ్‌పై నోరువిప్పిన ‘తమ్ముడు’ బ్యూటీ

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

Aravind Krishna Actor: ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్‌లో టాలీవుడ్ హీరో

టాప్ స్టోరీస్

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions in Hyderabad: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, గురువారం హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

SI Exam Results: ఎస్‌ఐ పరీక్ష తుది ఫలితాలు విడుదల, ఫైనల్ ఆన్సర్ 'కీ' అందుబాటులో

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Pushpa Actor Arrest: ‘పుష్ప’ నటుడు కేశవ అరెస్టు, యువతి సూసైడ్‌తో కేసు నమోదు

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ

Revanth Reddy News: ముగిసిన రేవంత్ ఢిల్లీ పర్యటన, మళ్లీ వెనక్కి రమ్మని అధిష్ఠానం పిలుపు - మరో భేటీ