అన్వేషించండి

Salaar Sequel Title Fixed: ‘సలార్’ సీక్వెల్‌కు టైటిల్ ఫిక్స్ - పార్ట్ 1లోనే రివీల్ చేసిన ప్రశాంత్ నీల్

Salaar Sequel Title Fixed: ‘సలార్’ పార్ట్ 1ను ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ముగించిన ప్రశాంత్ నీల్.. సెకండ్ పార్ట్ కోసం సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇక పార్ట్ 1లోనే సీక్వెల్ టైటిల్ ఏంటో రివీల్ చేశాడు.

Salaar Sequel Title Fixed: ‘బాహూబలి’తో ప్యాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌కు ఆ తర్వాత ఒక్క సరైన హిట్ కూడా లేదు. అందుకే ఫ్యాన్స్ ఆశలన్నీ ‘సలార్’పైనే ఉన్నాయి. ‘కేజీఎఫ్’లాంటి సినిమాతో కన్నడ యంగ్ హీరో యశ్‌ను ప్యాన్ ఇండియా స్టార్‌ను చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్. అలాంటి దర్శకుడి టేకింగ్‌లో ప్రభాస్ కటౌట్ అదిరిపోతుందని ఫ్యాన్స్ ముందు నుంచే నమ్మడం మొదలుపెట్టారు. అందుకే ‘సలార్’కు మేకర్స్ పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా.. ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్ల దగ్గర ఎగబడ్డారు. ఫైనల్‌గా ‘సలార్ పార్ట్ 1’కు ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ టాక్ లభిస్తోంది. ఇంతలోనే ఈ మూవీ పార్ట్ 2 టైటిల్ ఇదే అంటూ ఒక ప్రచారం వైరల్ అవుతోంది.

‘బాహుబలి’ బాటలోనే ‘సలార్’

దర్శక ధీరుడు రాజమౌళి.. ‘బాహుబలి’ని రెండు పార్ట్స్‌గా తెరకెక్కించి ప్రభాస్‌కు హిట్ ఇచ్చాడు. అదే ఫార్ములా ఫాలో అయ్యి ‘కేజీఎఫ్’ను రెండు చాప్టర్లుగా విడుదల చేసి.. రెండిటితో శాండిల్‌వుడ్‌ను ఒక రేంజ్‌లో తీసుకెళ్లి నిలబెట్టాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక ఈ హీరో, దర్శకుడు కాంబినేషన్‌లో తెరకెక్కబోయే ‘సలార్’ కూడా రెండు పార్ట్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని.. ఈ మూవీ షూటింగ్ సమయం నుండే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనుకున్నట్టుగానే ‘సలార్’ మొదటి పార్ట్ పేరు ‘సీజ్‌ఫైర్’ అని పెట్టి డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు ప్రశాంత్ నీల్. ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు యాక్షన్ మూవీ లవర్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ‘బాహుబలి’ పార్ట్ 1లాగానే ‘సలార్’ పార్ట్ 1ను కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ఆపేశాడు ప్రశాంత్ నీల్.

శత్రువుల మధ్య యుద్ధం

‘బాహుబలి’ పార్ట్ 1 ముగిసే సమయానికి కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని సస్పెన్స్‌గా వదిలేశాడు దర్శకుడు రాజమౌళి. ఇక ‘సలార్’ పార్ట్ 1 సీజ్‌ఫైర్ ముగిసే సమయానికి బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న దేవ, వరధరాజ్ మానార్‌ను బద్దశత్రువులను చేశాడు. ఇక పార్ట్ 1 సీజ్‌ఫైర్‌లో ఫ్రెండ్స్‌లాగా ఎమోషన్‌ను పండించిన ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్.. రెండో పార్ట్‌లో శత్రువల్లాగా వైలెన్స్‌ను చూపించనున్నారని తెలుస్తోంది. ‘సలార్’ పార్ట్ 1 పేరు సీజ్‌ఫైర్ కాగా.. పార్ట్ 2 పేరు ‘శౌర్యంగ పర్వం’ అని వార్తలు బయటికొచ్చాయి. అంటే ‘సలార్ శౌర్యంగ పర్వం’ అనే పేరుతో ఈ సీక్వెల్ విడుదల కానుంది. 

‘శౌర్యంగ పర్వం’లో చూడండి

‘సలార్ సీజ్‌ఫైర్’ను ఆకట్టుకునేలా తెరకెక్కించి.. ‘సలార్ శౌర్యంగ పర్వం’ కోసం ప్రశాంత్ నీల్.. ఆడియన్స్‌లో అంచనాలను మరింత భారీగా పెంచేశాడని సినిమా చూసిన ప్రేక్షకులు రివ్యూ ఇస్తున్నారు. దేవ, వరధరాజా మానార్‌లను శత్రువులుగా మార్చి పార్ట్ 1ను ముగించిన తర్వాత మిగతా కథను ‘శౌర్యంగ పర్వం’లో చూడమని డైరెక్టర్ రివీల్ చేశాడు. దీంతో ‘శౌర్యంగ పర్వం’ అనే టైటిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉందని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మొత్తానికి ఎన్నో ఏళ్లుగా తమ హీరో ఎప్పుడు హిట్ కొడతాడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్‌కు ‘సలార్ సీజ్‌ఫైర్’తో ఫుల్ మీల్స్ పెట్టాడు ప్రశాంత్ నీల్.

Also Read: ‘సలార్‘ టీమ్ దెబ్బకు దిగొచ్చిన పీవీఆర్, ఐనాక్స్ - ఇక ఫ్యాన్స్‌కు పండగే

టాప్ హెడ్ లైన్స్

Hrudayam Murali OTT : ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్ - ఓటీటీలోకి తమన్ రీసెంట్ మూవీ... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Anna Lezhneva : పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
పవన్ బాటలోనే అన్నా కొణిదెల - వన్యప్రాణుల దత్తత
Anupama Parameswaran : నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
నా సోషల్ మీడియా... ఏదైనా పోస్ట్ చేస్తా - అనుపమ పరమేశ్వరన్ స్ట్రాంగ్ రియాక్షన్
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget