అన్వేషించండి

Salaar OTT : ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్' - అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్, వాళ్లకు మాత్రం నిరాశే?

Salaar OTT : సలార్ మూవీ అర్ధరాత్రి నుంచి నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. హిందీ తప్ప మిగతా అన్ని భాషల్లో అందుబాటులో ఉంది.

Salaar is now streaming on OTT : KGF' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 'బాహుబలి 2' తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్  సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ అందుకున్న ప్రభాస్ కి 'సలార్' భారీ కం బ్యాక్ ఇచ్చింది. అంతేకాకుండా మొదటి రోజు రూ.178 కోట్ల ఓపెనింగ్స్ అందుకొని ప్రభాస్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాల లిస్ట్ లో చేరింది. సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినా.. దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కటౌట్‌ను వాడుకున్న విధానం ప్రేక్షకులకు నచ్చింది.

ముఖ్యంగా అభిమానులను ఈ సినిమా చాలా మెప్పించింది. ప్రభాస్ ఇమేజ్, ఫిజిక్ దృష్టిలో పెట్టుకుని ఫైట్స్ కంపోజ్ చేశారు ప్రశాంత్ నీల్. సినిమాలో వచ్చే కోటెరమ్మ ఫైట్, ఖాన్సార్ పెద్దల సమక్షంలో జరిగే ఫైట్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించింది. ముఖ్యంగా 'సలార్' ఎండింగ్ ట్విస్ట్ రెండో పార్ట్ మీద విపరీతమైన అంచనాలు పెంచింది. చాలాకాలం తర్వాత ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు 'సలార్'తో ఊరట లభించింది. తమ ఫేవరెట్ హీరోను తాము ఎలా చూడాలనుకుంటున్నారో అచ్చం అలాగే చూపించి ప్రభాస్ ఫ్యాన్స్‌ను ఫుల్‌గా సంతోషపెట్టాడు ప్రశాంత్ నీల్. దాంతో ప్రపంచవ్యాప్తంగా 'సలార్' సినిమా రూ.600 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.

ఇక సంక్రాంతికి ఎన్నో సినిమాలు థియేటర్లలో సందడి చేయడంతో ‘సలార్’ జోరు కాస్త తగ్గింది. ఫైనల్‌గా ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 20 అనగా శనివారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులోకి వచ్చింది 'సలార్'. అర్ధరాత్రి నుంచే సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన 28 రోజులకు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ అందుబాటులోకి రావడం గమనార్హం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ 'సలార్' ఓటీటీ హిందీ వెర్షన్ ని మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు. హిందీలో ఒప్పందం ప్రకారం థియేటర్లో రిలీజ్ అయిన 8 వారాలకు ఓటీటీ వర్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఒక విధంగా హిందీ ఆడియన్స్ కి ఇది బాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇక మిగతా భాషలో ఆడియన్స్ థియేటర్లో సినిమాని ఎవరైనా మిస్ అయి ఉంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.. చూసేయండి. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ సుమారు రూ.250 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ స్నేహితుడిగా ప్రధాన పాత్ర చేశారు. ఈశ్వరీ రావు, జగపతి బాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి భువన గౌడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.

Also Read :  ఫిబ్రవరిలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్‌? వరుడు ఎవరంటే..

టాప్ హెడ్ లైన్స్

Mahesh Babu: సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
సంక్రాంతి హిట్స్ స్పెషలిస్టుతో మహేష్... 'వారణాసి' తర్వాత ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా?
Toxic Ticket Price Hike: ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
ఆరున్నరకు ఏపీ, తెలంగాణలో 'టాక్సిక్' ఫస్ట్ షోలు... తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు ఎంత పెంచారంటే?
Toxic Advance Booking: టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!
టాక్సిక్ @ 50 కోట్లు... అడ్వాన్స్ బుకింగ్స్‌లో యశ్ జోరు... 'పెద్ది', 'రాజా సాబ్'ను బీట్ చేసి మరీ!
Irumudi Controversy: 'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్
'ఇరుముడి'పై ఏపీ టీచర్స్ ఆగ్రహం... వివాదంలో రవితేజ సినిమా - ఆ సీన్స్ డిలీట్ చేయాలని డిమాండ్

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Polavaram Left Canal: గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
గోదావరి జలాలతో ఉత్తరాంధ్రకు కొత్త వెలుగు.. సూపర్‌ ఎల్‌నినో సమయంలో రైతులకు ఊరట
Junior Doctors Strike: సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు 2 వారాల డెడ్‌లైన్
Pant Injury Update: పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
పంత్ గాయంపై అప్డేట్.. మూడో రోజు ఆట‌లో బ‌రిలోకి దిగ‌ని రిష‌భ్.. డబ్ల్యూటీసీ రేసుపై ద్ర‌విడ్ కీల‌క వ్యాఖ్య‌లు
YS Jagan:
"స్థానిక సంస్థలన్నీ మనవే! ఏకగ్రీవాలు కానివ్వొద్దు, ఎలక్షన్స్‌ను లైట్ తీసుకొవద్దు" వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
వైజాగ్ డేటా సెంటర్‌ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. పర్యావరణ అనుమతులను పక్కన పెట్టలేం
Rules for Foreign Travel Clearances: విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
విదేశాలకు వెళ్లాలంటే ఏ రాజకీయ నేతలు కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకోవాలి
Embed widget