News
News
వీడియోలు ఆటలు
X

NTR 30 - Saif Ali Khan : అప్పుడు ప్రభాస్, ఇప్పుడు ఎన్టీఆర్ - సంతకం చేసిన సైఫ్!

ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ సినిమా చేయనున్నారు. సంతకం చేశారని సమాచారం.

FOLLOW US: 
Share:

మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా (NTR 30 Movie) రూపొందుతోంది. హైదరాబాదులో ఈ మధ్య ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగిసింది. త్వరలో గోవాలో రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే...

ఎన్టీఆర్ 30... సైఫ్ సంతకం!
ఎన్టీఆర్ 30లో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) విలన్ అనే విషయం కొన్ని రోజుల క్రితమే బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ( NTR 30 Villain) కు ఢీ కొనే బలమైన ప్రతినాయకుడి పాత్రలో నవాబ్ వారసుడు కనిపించనున్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇటీవల అగ్రిమెంట్ పేపర్స్ మీద సైఫ్ సంతకం చేసేశారట.

అప్పుడు ప్రభాస్... ఇప్పుడు ఎన్టీఆర్!
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ఓం రౌత్ తెరకెక్కించిన సినిమా 'ఆదిపురుష్'. రామాయణం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో లంకేశ్ (రావణుడి) పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ప్రభాస్ తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో విలన్ రోల్ చేస్తున్నారు. అయితే... 'ఆదిపురుష్' హిందీ సినిమా. బాలీవుడ్ టెక్నీషియన్లు పని చేసిన సినిమా. తెలుగు దర్శక - నిర్మాతలు చేస్తున్న సినిమా ఎన్టీఆర్ 30. సో... సైఫ్ అలీ ఖాన్ సౌత్ ఇండియన్ డెబ్యూ ఇది. 

Also Read ఎన్టీఆర్ ఇంట్లో అమెజాన్ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ - అసలేం జరిగిందంటే?

ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దీనికి యువ సంగీత సంచలన అనిరుధ్  రవిచంద్రన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ జోడీగా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కథానాయికగా సందడి చేయనున్నారు.  

ఎన్టీఆర్ 30 తర్వాత 'వార్ 2'
కొరటాల శివ సినిమా కంప్లీట్ అయిన తర్వాత హిందీలో 'వార్ 2' సినిమా (War 2 Movie) షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ (Hrithik Roshan)తో ఢీ అంటే ఢీ కొట్టే పాత్రలో ఆయన కనిపిస్తారట. 'ఆర్ఆర్ఆర్' తర్వాత నార్త్ ఇండియాలో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. పైగా, ఆయన నటనకు హిందీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన్ను తీసుకోవడం ద్వారా సౌత్ ప్రేక్షకుల్లోకి కూడా 'వార్ 2'కు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. 

'వార్ 2' తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా!
నిజం చెప్పాలంటే... కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని అందరూ భావించారు. ముందు అనుకున్న లైనప్ కూడా అదే! అయితే... 'వార్ 2' రావడంతో మొత్తం లైనప్ మారింది. ఎన్టీఆర్ 32వ సినిమా ప్రశాంత్ నీల్ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఆ సినిమా రూపొందుతోంది. ఆ తర్వాత కూడా భారీ పాన్ ఇండియా సినిమాలు ఎన్టీఆర్ చేయనున్నారు. 

Also Read దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్

Published at : 13 Apr 2023 11:41 AM (IST) Tags: Janhvi Kapoor Jr NTR Koratala siva Saif Ali Khan ntr 30 movie

సంబంధిత కథనాలు

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

Allu Sirish: సందీప్ కిషన్ కాదన్న కథతో అల్లు శిరీష్? - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రేపే!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

PKSDT: దేవుడి షూ కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు 'బ్రో'..!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

మామతో అల్లుడి పోజు, పవన్ మూవీ సెట్‌లో మంటలు, చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక - మరిన్ని సినీ విశేషాలు మీ కోసం!

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

Prasanth Varma: 8 మంది సూపర్ హీరోస్ మూవీస్ తీస్తా, ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు: ప్రశాంత్ వర్మ

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

సాయి పల్లవిపై మనసు పారేసుకున్న బాలీవుడ్ హీరో - ఆమెపై క్రష్ ఉందంటూ కామెంట్స్!

టాప్ స్టోరీస్

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి భగవంత్ కుబా