కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ - నయా సినిమా షురూ!
సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా #SDT16 లాంఛనంగా ప్రారంభం అయింది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు జయంత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సుకుమార్ కథ అందిస్తుండగా కార్తీక వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అజయ్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా ‘కాంతార’ కు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్, టీజర్ ను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే ఈ టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది.
ఈ సినిమాకి 'రుద్రవనం' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.. కథ ప్రకారం.. సినిమాలో రుద్రవనం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఊహించని విధంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటిని హీరో ఎలా ఛేదించాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో ఇదివరకు చాలా సినిమాలొచ్చాయి. కాకపోతే సాయిధరమ్ తేజ్ తొలిసారి ఇలాంటి జోనర్ లో నటిస్తున్నారు.
View this post on Instagram
View this post on Instagram