Pawan Kalyan: పవన్ చేతుల్లో ఏపీ సేఫ్ - మెగా హీరో ఆసక్తిర ట్వీట్, నితిన్ ఎమోషనల్ పోస్ట్
Sai Dharam Tej Tweet on Pawan Kalyan: పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కాయమైంది. భారీ మెజారిటీతో ఆయన విజయం వైపు దూసుకుపోతున్నారు. దీంతో ఆయన గెలుపుపై మెగా హీరో ఆసక్తికర ట్వీట్ చేశారు.
Sai Dharam Tej Tweet on Pawan Kalyan Over AP Election: ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం ఖరారైంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పటి వరకు జరిగిన ఓట్ల లెక్కింపులకలో జనసేన దాదాపు 20 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యతను కనబరిచింది. దీంతో పవన్ కళ్యాణ్‌కు సోషల్ మీడియాలో వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి.
తాజా తన మామయ్య, జనసేనాని గెలుపుపై మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. పవన్ ఓ చిన్నారి ఎత్తుకున్న ఫోటో షేర్ చేస్తూ.."ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం మరియు భవిష్యత్తు ఇప్పుడు సురక్షితమైన చేతుల్లో ఉంది. జనసేన పార్టీ పవర్ తుఫాను" అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. అలాగే పవన్ గెలుపును హీరో నితిన్, డైరెక్టర్ హరీష్ శంకర్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
The Present & Future of Andhra Pradesh is now in safe hands.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) June 4, 2024
POWER STORM @JanaSenaParty 💪🏼💪🏼💪🏼 pic.twitter.com/zM3QPlt7WZ
ఈ మేరకు నితిన్, హరీష్ శంకర్ కూడా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "డియర్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ఎన్నికల్లో మీ చారిత్రకమైన విజయం, మీరు కూటమిని అగ్రస్థానానికి చేర్చిన తీరు పట్ల ఓ అభిమానిగా, సోదరుడిగా చాలా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నాను. అలాగే సంతోషంతో ఉబ్బితబ్బిబైపోతున్నా. ఎమోషన్స్‌తో కూడిన నా ఆనందాన్ని వర్ణించలేకపోతున్నా. కానీ మీ అలుపెరగని పోరాటానికి ఈ అద్భుతమైన పోరాటమే నిదర్శనం. మీకు మరింత పవర్ ఉండాలని ఆశిస్తున్నా. పవర్ స్టర్ ఫరెవర్"(Dearest @PawanKalyan garu.. As a fan and as a brother, I am supremely thrilled and overjoyed at your history making win in this election and the way you have Powered the alliance to the Top! Can’t express my happiness enough as emotions are taking over. But what a fantastic hard fought, well deserved stupendous win ! More ‘Power’ to You, our Power Star for ever!!) అంటూ నితిన్ ట్వీట్ చేశాడు.
Dearest @PawanKalyan garu.. As a fan and as a brother, I am supremely thrilled and overjoyed at your history making win in this election and the way you have Powered the alliance to the Top! Can’t express my happiness enough as emotions are taking over. But what a fantastic hard…
— nithiin (@actor_nithiin) June 4, 2024
కాగా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వరుసగా పరాజయం పొందిన సంగతి తెలిసిందే. అయినా కూడా వెనకడుగు వేయకుండ పదేళ్లుగా రాజకీయాల్లో పవన్ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. తన సొంత ఖర్చులతో పార్టీని ముందుకు నడిపిస్తూ వచ్చారు. ఇక ఈసారి ఎలాగైనా వైఎస్ జగన్‌ను అధికారం నుంచి దింపుతానంటూ కూటమి కలిసి బరిలో దిగారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీ గెలిచారు.
Also Read: మరోసారి శోభితాతో దొరికిపోయిన నాగ చైతన్య - యూరప్ వెకేషన్‌లో ఈ రూమర్డ్ కపుల్, ఫోటో వైరల్