శ్రీలీలతో మామూలుగా ఉండదు, ఒక్క ఈవెంట్ కే అన్ని లక్షలా?
ధమాకా తర్వాత ఫుల్ బిజీగా మారిపోయిన శ్రీలీల.. వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవట్లేదు. అందులో భాగంగా ఆమె ఇటీవల హాజరైన తానా కార్యక్రమానికి రూ.20లక్షలు తీసుకుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి
Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటిమణుల్లో శ్రీలీల ఒకరు. వరుస సినిమాలతో.. చేతిలో భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతూ.. కొత్తగా వచ్చే హీరోయిన్లకు సైతం పోటీగా నిలుస్తోంది. ఇప్పటికే ‘పెళ్లి సందడి’, ‘ధమాకా’ వంటి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న శ్రీలీల.. ప్రస్తుతం ‘ఆదికేశవ’, ‘స్కంద’, ‘భగవంత్ కేసరి’, ‘నితిన్32’, ‘గుంటూరు కారం’, ‘వీడీ12’, ‘అనగనగా ఒక రోజు’ వంటి చిత్రాలకు సిద్ధమవుతోంది.
ఇదిలా ఉండగా.. జూన్ చివరి వారంలో డల్లాస్‌లో జరిగిన కార్యక్రమానికి శ్రీలీలని నాటా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ఆహ్వానించింది. అయితే ప్రస్తుతమున్న టైట్ షెడ్యూల్ కారణంగా ఈ కార్యక్రమానికి హాజరుకావడం కుదరదని, వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించింది. అయితే జూలై రెండవ వారంలో ఫిలడెల్ఫియాలో జరిగిన తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) కార్యక్రమంలో ఆమె కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన కెరీర్‌లో ముఖ్యమైన పాత్ర పోషించిన కె. రాఘవేంద్రరావు పట్ల కృతజ్ఞతా సూచకంగా ఆమె ఈ కార్యక్రమానికి హాజరైనందని టాక్ వినిపిస్తోంది.
శ్రీలీల.. తానా సభ్యుల ఆహ్వాన్ని తిరస్కరించేందుకు కష్టంగా భావించింది. అయితే శ్రీలీల ఈ కార్యక్రమానికి హాజరైనందుకు ఆమెకు వారు రూ.20 లక్షలు చెల్లించినట్లు సమాచారం. అంతేకాకుండా, తానా బాలకృష్ణకు రూ. 1 కోటి చెల్లించి, అతని కుటుంబం మొత్తానికి బిజినెస్ క్లాస్ టిక్కెట్లను అందించి తమ దాతృత్వాన్ని చాటుకున్నట్టు తెలుస్తోంది.
'ధమాకా' సినిమాతో రూ.100 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది శ్రీలీల. అప్పటినుంచి వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తోంది. తన అందం, అభినయం, నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ అమ్మడు సుకుమార్, దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఓ పెద్ద ప్రాజెక్టును రిజెక్ట్ చేసిందని సమాచారం. సుకుమార్, దిల్ రాజు కాంబినేషన్లో తీసే సినిమాలో శ్రీలీలకు ఆఫర్ ఇచ్చారట. కానీ ఆ సినిమా చేయనని చెప్పినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే ఇంతకీ దిల్ రాజు సినిమా ఏదో కాదు ఆయన సోదరుడి కొడుకు ఆశిష్ నటిస్తున్న ‘సెల్ఫిష్’ సినిమానేనట. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల సెట్ అవుతుందని దిల్ రాజుకు.. సుకుమార్ సలహా ఇచ్చారని, ఆ సూచనతో ఆయన టీమ్ శ్రీ లీలను కలిసినట్టు తెలుస్తోంది. కానీ అప్పటికే ధమాకా సినిమాతో బిజీగా ఉండడంతో పాటుగా.. ఆమె చేతిలో అప్పటికే మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉండడంతో.. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో శ్రీలీలా ఈ ఆఫర్ ను వదులుకుందని సమాచారం.
ఇక శ్రీలీల ప్రస్తుత సినిమా విషయాలకొస్తే ఆమె.. త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తోన్న 'గుంటూరు కారం'లోనూ శ్రీలీల నటిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా కనీసం 50శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే 'గుంటూరు కారం' సినిమాలో పలువురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి.అయితే ఇటీవలే ఈ సినిమాలో నటి మీనాక్షి చౌదరి కూడా ఫిక్స్ అయినట్లు ఆమే స్వయంగా వెల్లడించారు.
Read Also : మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన DJ టిల్లు - అతని స్థానంలో మరో యంగ్ హీరోకి ఛాన్స్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial