అన్వేషించండి

Rishab Shetty : జై హనుమాన్ కోసం రిషబ్ శెట్టి రెమ్యునరేషన్ - రెండు ఆప్షన్స్... ఏది సెలక్ట్ చేసుకుంటారో?

Jai Hanuman Movie : 'జై హనుమాన్' మూవీలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Rishab Shetty Remuneration For Jai Hanuman Movie : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ ఎపిక్ 'హను మాన్'. 2024 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం 'జై హనుమాన్' టైటిల్‌తో సీక్వెల్ తెరకెక్కుతుండగా... రీసెంట్‌గానే హిస్టారికల్ ప్లేస్ హంపీలోని అంజనాద్రిపై పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభమైంది.

రిషబ్ రెమ్యునరేషన్ ఎంతంటే?

సీక్వెల్‌లో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ కోసం ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ విషయంలో ఆయన రెండు ఆప్షన్స్ అనుకుంటున్నట్లు ఫిలింనగర్ సర్కిల్లో ప్రచారం సాగుతోంది. మొదటిది... రూ.20 కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో 33 శాతం వాటా. రెండోది... లాభనష్టాలతో సంబంధం లేకుండా టోటల్ రూ.80 కోట్ల రెమ్యునరేషన్.

హీరో రిషబ్ ఫస్ట్ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతుండగా... నిర్మాతలు రెండో ఆప్షన్ బెటర్ అని అనుకుంటున్నారట. ఈ క్రమంలో ఆయన ఏది ఫైనల్ చేస్తారనేది మరో వారంలో తేలిపోతుందట. ఇప్పటికే ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేయగా హైప్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు, హీరో తేజ సజ్జా ఈ ప్రాజెక్ట్ కోసం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. హనుమాన్, మిరాయ్ వంటి బిగ్ సక్సెస్‌లతో తేజ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంటున్నారు. 

Also Read : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్

సీక్వెల్ స్టోరీ ఏంటంటే?

జై హనుమాన్ ఫస్ట్ పార్ట్‌ను మించి ఉండనుందని ఇదివరకే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేశారు. ఓ సరికొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'హను మాన్'లో హనుమంత్‌గా కనిపించిన తేజ సజ్జా సీక్వెల్‌లోనూ అదే రోల్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. హనుమంతుడిగా రిషబ్ శెట్టి, మరో కీలక పాత్రలో హీరో రానా దగ్గుబాటి నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. త్వరలోనే షూటింగ్ అప్డేట్స్‌తో ఇతర వివరాలు సైతం వెల్లడి కానున్నాయి. 

చిన్నప్పటి నుంచి స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ సినిమాలు చూస్తూ సూపర్ పవర్స్‌పై పిచ్చితో అడ్వెంచర్స్ చేయాలనుకునే విలన్ స్టోరీకి మైథలాజికల్ టచ్ ఇస్తూ ఫస్ట్ పార్ట్‌ను రూపొందించారు. తేజ సజ్జాతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని కీలకపాత్రలు పోషించారు. క్లైమాక్స్‌లో హీరో విలన్‌ను దైవ శక్తితో అంతం చేయగా... శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అనేది సస్పెన్స్.  సీక్వెల్‌లో దీనిపై క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా 'జై హనుమాన్' తెరకెక్కనుంది.

Also Read : న్యూ టాలెంట్... ప్రొడ్యూసర్ హీరో కిరణ్ అబ్బవరం - తిమ్మరాజుపల్లి టీవీ రిలీజ్ ఎప్పుడంటే?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Tollywood Debut : సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
సినిమాల్లోకి బాలయ్య కుమార్తె తేజస్విని ఎంట్రీ? - ఆ వార్తల్లో నిజమెంత!?
Newton's 3rd Law Movie Review - న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ: సుమంత్ హీరోగా ఈటీవీ విన్ తీసిన థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Newtons 3rd Law OTT : రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
రెండు ఓటీటీల్లో సుమంత్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget