Ravi Teja : మాస్ మహారాజ రవితేజ నెక్స్ట్ మూవీ కన్ఫర్మ్ - ఆ డైరెక్టర్‌తో థ్రిల్లర్ జానర్‌లో...
Raviteja Upcoming Movie : మాస్ మహారాజ్ రవితేజ తన నెక్స్ట్ మూవీపై కీలక అప్డేట్ ఇచ్చారు. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కీలక ప్రకటన చేశారు.

Ravi Teja Next Film With Director Shiva Nirvana : మాస్ మహారాజ రవితేజ నెక్స్ట్ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ఈ సంక్రాంతికి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' అంటూ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో అలరించేందుకు ఆయన సిద్ధం కాగా... ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తర్వాత చేయబోయే మూవీ గురించి హింట్ ఇచ్చారు.
థ్రిల్లర్ జానర్‌లో...
ఇప్పటివరకూ మాస్, యాక్షన్, కామెడీ జానర్లలో ఎంటర్టైన్ చేసిన మాస్ మహారాజ ఈసారి థ్రిల్లర్ జానర్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నారు. 'నిన్ను కోరి', 'మజిలీ' వంటి సూపర్ హిట్ మూవీస్ తీసిన డైరెక్టర్ శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
Also Read : 'ది రాజా సాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? - ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు...
'మిస్టర్ బచ్చన్' రిజల్ట్‌పై...
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రవితేజ, మూవీ టీంతో పాటు డైరెక్టర్స్ బాబీ, శివ నిర్వాణ, హరీష్ శంకర్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ రిజల్ట్‌పై స్పందించారు. ఆ మూవీ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంలో ఫెయిల్ అయ్యిందని... రవితేజతో మరోసారి బ్లాక్ బస్టర్ అందిస్తానని చెప్పారు. ఇది నాకు నేనే చేసుకున్న ప్రామిస్ అంటూ చెప్పారు.
మాస్ మహారాజ ట్యాగ్‌పై...
ఈ మూవీకి మాస్ మహారాజ ట్యాగ్ తీసేయమని రవితేజ అన్నట్లు సోషల్ మీడియాలో వినిపించిందని... నిజానికి ఆ పేరు పేటెంట్ రైట్స్ తనవేనని హరీష్ తెలిపారు. 'అది ఉంచాలన్నా తీసేయాలన్నా నన్నే అడగాలి. రవితేజ నాకు సినీ పరిశ్రమలో పునర్జన్మ ఇచ్చాడు. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా అందరితో ఒకేలా ఉండే మనస్తత్వం ఆయన సొంతం. ఇలాంటి లక్షణం పవన్ తర్వాత ఆయనలోనే చూశా. కొన్నేళ్ల క్రితం సంక్రాంతికి వచ్చిన 'మిరపకాయ్' మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఇదే తేదీకి వస్తోన్న క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' కూడా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని చెప్పారు.
అది ఎంజాయ్ చేస్తా...
సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కొంతమంది డైరెక్టర్స్‌తో వర్క్ చేయడాన్ని తాను ఎంజాయ్ చేస్తానని రవితేజ అన్నారు. 'అనిల్ రావిపూడి, బాబీ, హరీశ్ శంకర్, కిషోర్‌లతో కలిసి ప్రయాణించడాన్ని విపరీతంగా ఎంజాయ్ చేస్తా. ఈ సినిమాతో నాది... కిశోర్‌ది హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'లో నేను, ఆషికా, డింపుల్ కలిసి చేసిన అల్లరి చూస్తారు. ఈ చిత్రం కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.' అని అన్నారు.
మూవీకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించగా... రవితేజ సరసన ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటించారు. వీరితో పేటే వెన్నెల కిశోర్, సత్య, సునీల్, మురళీధర్ గౌడ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ నెల 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






















