Rashmika Mandanna: సేమ్ టు సేమ్: మహేష్ బాబులా రష్మిక మందన్న స్టిల్ - శ్రీవల్లి రియాక్షన్ ఇదే!
‘పుష్ప 2’ మూవీ నుంచి రష్మిక మందన్న ఫస్ట్ లుక్ రివీల్ అయ్యింది. ఈ ఫోటోలో రష్మిక అచ్చం మహేష్ బాబులా పోజు పెట్టిందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ పై రష్మిక తాజాగా స్పందించింది.
Rashmika Mandanna Photo from Pushpa 2: మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప 2’. అల్లు అర్జున్ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. బన్నీ నటించిన ‘పుష్ప’ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది. ఆ సినిమా విడుదలై రెండున్నర ఏండ్లు అవుతుంది. దీనికి సీక్వెల్ వస్తున్న ‘పుష్ప 2’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే, ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
రష్మికకు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
‘పుష్ప 2’ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అల్లు అర్జున్ పోస్టర్లు విడుదల కాగా, తాజాగా రష్మిక లుక్ ను రివీల్ చేశారు. రష్మిక బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 5న ఆమె ఫస్ట్ లుక్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. హ్యాపీ బర్త్ డే శ్రీవల్లి అంటూ ఈ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు. అల్లు అర్జున్, రష్మికకు పెళ్లి కావడంతో ‘పుష్ప’ సినిమా కంప్లీట్ అవుతుంది. సీక్వెల్ లో పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి కనిపించబోతోంది. ఈ పోస్టర్ లో రష్మిక ఒంటి నిండా నగలతో పట్టుచీర కట్టుకుని, జుట్టును వెనకకు కట్టుకుని కనిపించింది. ఆమె చేతి వేళ్లను రింగులా పెట్టి అందులోనుంచి చూస్తూ జోష్ ఫుల్ గా కనిపిస్తుంది.
మహేష్ బాబు ఫోటోతో పోలిక - స్పందించిన రష్మిక
అటు‘గుంటూరుకారం’ సినిమాలో మహేష్ బాబు కూడ అచ్చం ‘పుష్ప 2’లో రష్మిక మాదిరిగానే తన చేతి వేళ్ల సందులో నుంచి చూస్తూ కనిపిస్తాడు. ఈ రెండు ఫోటోలను ఒకే చోట్ట పెట్టి ఇద్దరు ఒకేలా పోజు పెట్టారంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు, మహేష్ బాబు అభిమానుల తరఫున రష్మికకు శుభకాంక్షలు చెప్తున్నారు నెటిజన్లు. ఈ పోస్టును చూసి రష్మిక రియాక్ట్ అయ్యింది. “ఓఓఓ.. నైస్.. నాకు ఈ కోల్లెజ్ నచ్చింది” అని కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 2020లో మహేష్ బాబు, రష్మిక మందన్న జంటగా ‘సరిలేరు నీకెవ్వరు’ అనే సినిమా తెరకెక్కింది. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
Wishing @iamRashmika a very happy birthday on behalf of superstar @urstrulyMahesh fans🥳 #HappyBirthdayRashmika #MaheshBabu | #RashmikaMandanna #GunturKaaram | #Pushpa2TheRule pic.twitter.com/hYNioR8sXJ
— VardhanDHFM (@_VardhanDHFM_) April 5, 2024
వరుస ప్రాజెక్టులతో రష్మిక ఫుల్ బిజీ
రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘పుష్ప: ది రూల్’లో నటిస్తుంది. అటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనే సినిమా చేస్తుంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. శాంతరూబన్ దర్శకత్వం వహిస్తున్న ‘రెయిన్ బో’ అనే ద్విభాషా చిత్రంలోనూ ఆమె నటిస్తోంది. విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా, ప్రదీప్ రావత్ ముఖ్యపాత్రల్లో యేసుబాయి భోంసాలే తెరకెక్కిస్తున్న బాలీవుడ్ మూవీ ‘చావా’లోనూ ఆమె నటిస్తుంది.
Also Read: సెట్‌లో అందరూ చప్పట్లు కొట్టారు, ప్రేక్షకులు మాత్రం ట్రోల్ చేశారు - ‘యానిమల్’పై రష్మిక స్పందన