అన్వేషించండి

Pushpa 2 : 'పుష్ప' టీమ్‌కి తప్పని లీకుల బెడద - సెట్స్ నుంచి లీకైన రష్మిక లుక్!

Pushpa 2 : 'పుష్ప 2' షూటింగ్ నుంచి రష్మిక లుక్ లీకైంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Rashmika Look Leak From Pushpa 2 Sets : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'పుష్ప 2' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. 'పుష్ప' పార్ట్-1 భారీ సక్సెస్ అవడంతో 'పుష్ప 2'ని మరింత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన మేకర్స్ అనుకున్న టైంకి సినిమాని విడుదల చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు. ఇటీవల వైజాగ్ లో ఈ సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇదిలా ఉంటే 'పుష్ప 2' మూవీ టీం కి లీకుల బెడద ఎక్కువైపోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి చాలానే లీక్స్ వచ్చాయి  ఇక ఇప్పుడు మరో లీక్ బయటికి వచ్చింది. 

'పుష్ప 2' నుండి రష్మిక లుక్ లీక్

'యానిమల్' సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. తాజాగా ఈ కన్నడ బ్యూటీ 'పుష్ప 2' న్యూ షెడ్యూల్ షూటింగ్లో జాయిన్ అయింది. ఈ లేటెస్ట్ షెడ్యూల్ నుంచే రష్మిక లుక్ లీక్ అయ్యింది. 'పుష్ప 2' లో శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న రష్మిక ఎరుపు రంగు చీరలో ఒంటినిండా నగలతో ముస్తాబై ఉన్న వీడియో లీకై నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫాన్స్ శ్రీవల్లి పాత్రలో రష్మిక మహారాణిలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

యాగంటి లో 'పుష్ప 2' షూటింగ్

'పుష్ప 2' లేటెస్ట్ షెడ్యూల్ ని యాగంటి లో ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని హీరోయిన్ రష్మిక మందన స్వయంగా తన ఇన్ స్టా స్టోరీస్ లో ఓ పిక్ షేర్ చేస్తూ తెలిపింది. " ఈ రోజు యాగంటి టెంపుల్ లో షూట్ చేసాం. ఈ ప్రదేశం యొక్క చరిత్ర ఎంతో అద్భుతం. అలాంటి ఈ చారిత్రాత్మక గుడిలో కొంత సమయాన్ని గడపడం ఇంకెంతో అద్భుతంగా అనిపించింది" అని రాసుకొస్తూ #Pushpa2therule అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేసింది. దీంతో 'పుష్ప 2' షూటింగ్ యాగంటిలో జరుగుతుందనే విషయం రష్మిక పోస్ట్ ద్వారా బయట పడింది.


Pushpa 2 : 'పుష్ప' టీమ్‌కి తప్పని లీకుల బెడద - సెట్స్ నుంచి లీకైన రష్మిక లుక్!

ఏప్రిల్ 8 న 'పుష్ప 2' స్పెషల్ సర్ప్రైజ్

'పుష్ప 2' నుంచి త్వరలోనే అదిరిపోయే సర్ప్రైజ్ రాబోతుందని సమాచారం. అది కూడా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 9 న ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్ సుమారు రూ.300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక లతోపాటు ఫాహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగదీష్ బండారి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : గ్రాండ్‌గా పూజతో ప్రారంభమైన రామ్ చరణ్ కొత్త సినిమా - ముఖ్య అతిథిగా మెగాస్టార్

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Review - 'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
'చెన్నై లవ్ స్టోరీ' రివ్యూ: ప్రేమకు ఫాంటసీ టచ్... కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Varanasi Title Controversy: వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్... రాజమౌళి - మహేష్ సినిమాకు నో టెన్షన్
వారణాసి టైటిల్ వివాదానికి ఫుల్ స్టాప్... రాజమౌళి - మహేష్ సినిమాకు నో టెన్షన్
Jana Nayakudu Collection: జన నాయకుడు కలెక్షన్లు... తెలుగులో ఎంత? తమిళ్ & వరల్డ్ వైడ్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
జన నాయకుడు కలెక్షన్లు... తెలుగులో ఎంత? తమిళ్ & వరల్డ్ వైడ్ ఎంత? ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Friday OTT Movies : నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్
నాగబంధం To థ్రిల్లర్ సీక్రెట్ ఆఫ్ కళింగ - శుక్రవారం ఒక్క రోజే 18 సినిమాలు స్ట్రీమింగ్

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
హైరైడర్ హైబ్రిడ్‌ & డస్టర్ టర్బో DCT కంపారిజన్‌ - లాంగ్‌టర్మ్‌లో ఎక్కువ లాభం ఇచ్చేది ఏ కారు?
సిటీలోఎక్కువ డ్రైవ్‌ చేసేవాళ్లకు ఏ SUV బెస్ట్‌? టయోటా హైరైడర్ హైబ్రిడ్‌ Vs రెనాల్ట్ డస్టర్‌ - ఏది కొనాలి?
Embed widget