అన్వేషించండి

Pushpa 2: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - జపాన్‌లో ‘పుష్ప 2’ రిలీజ్‌పై క్లారిటీ

Pushpa 2: అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ నుండి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఈ సినిమా నుండి ఒక కీలక అప్డేట్‌ను అందించింది రష్మిక.

Rashmika Mandanna about Pushpa 2 Release in Japan: ప్రస్తుతం తెలుగు హీరోలకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా అనేది కేవలం రీజియనల అన్నట్టుగా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అంతా తెలుగు సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. అదే తరహాలో ప్రస్తుతం చాలామంది ఆడియన్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘పుష్ప 2’ కూడా ఒకటి. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప’ బౌండరీలను దాటి హిట్ అయ్యింది. అందుకే దాని సీక్వెల్‌ను ఎన్నో ఇతర దేశాల్లో కూడా విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.

జపాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

‘పుష్ప’కు ఇండియాలో మాత్రమే కాదు.. చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా జపాన్‌లో ఇప్పుడు చాలామంది మూవీ లవర్స్ ‘పుష్ప’కు, అల్లు అర్జున్‌కు ఫ్యాన్స్ అయ్యారు. అందుకే దాని సీక్వెల్‌ను జపాన్‌లో కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ‘పుష్ప 2’కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నా కూడా దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వడానికి మూవీ టీమ్ సిద్ధంగా లేదు. ఇప్పటివరకు ఈ సీక్వెల్ నుండి ఒక పోస్టర్, గ్లింప్స్ మాత్రమే విడుదల అయ్యింది. అంతే కాకుండా శరవేగంగా షూటింగ్ జరుపుకోవాలి అనుకుంటున్నా కూడా ఎన్నోసార్లు ఈ మూవీ షూటింగ్‌కు బ్రేక్ పడింది. కానీ ఇంతలోనే అల్లు అర్జున్ జపాన్ ఫ్యాన్స్‌కు మాత్రం ఒక గుడ్ న్యూస్ వినిపించింది రష్మిక.

శ్రీవల్లిగా క్రేజ్..

‘పుష్ప’లో టైటిల్ పాత్రతో అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ లభించిందో.. అందులో శ్రీవల్లిగా నటించినందుకు రష్మికకు కూడా అంతే పాపులారిటీ లభించింది. అందుకే ‘పుష్ప 2’లో అసలు తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తున్న రష్మిక.. తాజాగా టోక్యోలో జరిగిన క్రంచీరోల్ యానిమీ అవార్డ్స్‌ ఈవెంట్‌కు హాజరయ్యింది. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘పుష్ప 2’పై కీలక అప్డేట్‌ను అందించింది ఈ కన్నడ బ్యూటీ. దీంతో ఒక్కసారిగా ‘పుష్ప 2’పై మళ్లీ జపాన్‌లో వార్తలు వైరల్ అయ్యాయి.

చర్చలు జరుగుతున్నాయి..

‘‘జపాన్‌లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. పుష్ప 2 ఒరిజినల్ వర్షన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో.. అదే రోజు జపాన్‌లో కూడా సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇది చాలా భారీగా ఉండబోతుంది’’ అని రష్మిక మందనా చెప్పుకొచ్చింది. దీంతో జపాన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహం మరింత పెరిగిపోయింది. 2024 ఆగస్ట్ 15న ఎలాగైనా ‘పుష్ప 2’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ సీక్వెల్‌పై ఇంట్రెస్ట్ తగ్గిపోతుందని, మరోసారి రిలీజ్ పోస్ట్‌పోన్ అయినా ఎవరూ దీనిపై అంతగా ఆసక్తి చూపించకపోవచ్చని కొందరు విమర్శిస్తున్నారు.

Also Read: ఫ్రెండ్ ఇంటికే కన్నం, చోరీ చేసి గోవాలో ఎంజాయ్ చేస్తున్న నటి సౌమ్య శెట్టి అరెస్ట్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Sandeep Reddy Vanga : సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
Raakh Series OTT : ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
The Mummy OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget