Rashmika Mandanna: ‘కుబేర’లో రష్మిక లుక్ చూడాలని ఉందా? జస్ట్ ఆ రోజు వరకు ఆగండి
Kubera Movie Update: నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆమె నటిస్తున్న సినిమా కుబేర నుంచి అప్ డేట్ వచ్చింది. ఆమె ఫస్ట్ లుక్ ఎప్పుడంటే?
Kubera Release Date: నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'కుబేర' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు రష్మిక. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్ కూడా నటిస్తున్నారు. ఇక ఇటీవలే నాగార్జున, ధనుష్ కి సంబంధించిన పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు రష్మిక మందన్నకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు.
ఫస్ట్ లుక్ అప్పుడే..
రష్మిక ఫస్ట్ లుక్ రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది 'కుబేర' టీమ్. ప్రీ లుక్ పోస్టర్ ని ఇన్ స్టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. జులై 5న ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రీ లుక్ పోస్టర్ లో రష్మిక ఒక చేతిలో సూట్ కేస్ పట్టుకుని అడవుల్లోకి వెళ్తున్నట్లు చూపించారు. దీంతో ఆమె క్యారెక్టర్, లుక్ ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రష్మిక అభిమానులు.
బిజీబిజీగా అమ్మడు..
రష్మిక మందన్న చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలు ఉన్నాయి.‘ పుష్ప’ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక ప్రస్తుతం 'పుష్ప - 2'లో శ్రీవల్లిగా చేస్తుంది రష్మిక. 'యానిమల్ పార్క్'లో గీతాంజలిగా రష్మికనే ఉండనుంది. ఆ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని ఇప్పటికే ప్రకటించారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ ‘సికందర్’తో పాటు విక్కీ కౌశల్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఛావ’లో కూడా రష్మిక మందన్న చేస్తున్నారు. ఇప్పుడు ‘కుబేర’లో బిజీగా ఉంది ఈ అమ్మడు.
ముంబైలో షూటింగ్..
'కుబేర' షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ధనుష్, రష్మిక, నాగార్జునపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించి పెద్ద సెట్ కూడా వేశారు మేకర్స్. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి రష్మిక అప్ డేట్స్ ఇస్తూ వస్తున్నారు. నైట్ షూట్స్ చేస్తున్నానని, పొద్దున్న జిమ్ కి వెళ్తున్నాను అంటూ గతంలో పోస్ట్ లు పెట్టారు.
చాలా ఏళ్ల తర్వాత..
Kubera 🔥🔥🔥❤️ @dhanushkraja @iamnagarjuna @sekharkammula @jimSarbh @Daliptahil @ThisIsDSP @SVCLLP @amigoscreation @AdityaMusic @KuberaTheMovie #Kubera pic.twitter.com/0lXAgdm22N
— Rashmika Mandanna (@iamRashmika) July 2, 2024
టాలీవుడ్ సూపర్ డైరెక్టర్స్ లో ఒకరు శేఖర్ కమ్ముల. ఆయన వరుసగా సినిమాలు చేయనప్పటికీ తీసిన సినిమాల్లో ఆయన మార్క్ కచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో లవ్ స్టోరీలు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలు, యూత్ ఫుల్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన రూట్ మార్చారు. 'కుబేర' అనే టైటిల్ తో యాక్షన్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక శేఖర్ కమ్ముల తీస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మనోహర్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Also Read: దుబాయ్ యూట్యూబర్‌తో ‘రాజ రాజ చోర’ బ్యూటీ పెళ్లి? అసలు విషయం చెప్పేసిన సునయన