Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన రణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?
స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ జంట కొత్త ఇంట్లో అడుగు పెట్టింది. సుమారు 120 కోట్ల రూపాయలతో కొన్న ఇంట్లో పూజలు చేసింది. గృహ ప్రవేశం చేసింది. పూజ చేసినప్పుడు తీసిన ఫోటోలను మీరూ చూడండి.
బాలీవుడ్ కథానాయకుడు రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) డ్రసింగ్ స్టైల్ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. పీరియాడిక్ ఫిల్మ్స్ చేసినప్పటికీ... ఆయన మోడ్రన్ ఫిల్మ్స్ కూడా చేశారు. అయితే... కొన్ని విషయాలలో మాత్రం రణ్‌వీర్ చాలా ట్రెడిషనల్. ఆయనతో పాటు దీపికా పదుకోన్ (Deepika Padukone) కూడా! అందుకు తాజా ఉదాహరణ... నేడు జరిగిన గృహ ప్రవేశం!
అలీబాగ్‌లో కొత్త ఇల్లు
ముంబైకి దగ్గరలో గల అలీబాగ్‌లో రణ్‌వీర్, దీపిక ఒక ఇల్లు కొన్నారు. సరదాగా సేద తీరడానికి, అప్పుడప్పుడూ స్మాల్ వెకేషన్ ట్రిప్స్ వేయడం కోసం ఆ ఇల్లును కొనుగోలు చేశారని బాలీవుడ్ టాక్. సుమారు రెండున్నర ఎకరాల్లో గల ఆ ఇంటి ఖరీదు 22 కోట్ల రూపాయలు అని సమాచారం. ఈ రోజు ఆ ఇంటి గృహ ప్రవేశం జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారట.
కొత్త ఇంట్లో రణ్‌వీర్ - దీపిక పూజలు
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులు శుక్రవారం కొత్త ఇంట్లో అడుగు పెట్టారు. గృహ ప్రవేశం సందర్భంగా సంప్రదాయాలను అనుసరిస్తూ పూజలు చేశారు. ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రణ్‌వీర్ పోస్ట్ చేశారు. వాటిని బట్టి దంపతులు ఇద్దరూ హోమం చేసినట్లు తెలుస్తోంది. ఇంట్లో అడుగు పెట్టామని పరోక్షంగా రణ్‌వీర్ చెప్పారు. అదీ సంగతి!
రణ్‌వీర్ - దీపిక పూజలు చేసిన ఫోటోలను చూడండి
(Ranveer Singh Deepika Padukone Alibaug Griha Pravesh Pooja Pics)
రూ. 120 కోట్లతో ఇల్లు కొన్న బాలీవుడ్ స్టార్ కపుల్
ముంబైలోని ఖరీదైన ప్రాంతాలలో ఒకటైన బాంద్రాలో కూడా రణ్‌వీర్ సింగ్ - దీపికా పదుకోన్ దంపతులు ఓ ఇల్లు కొన్నారని సమాచారం. ఇల్లు అంటే... ఇల్లు కాదు అనుకోండి. ఒక అపార్ట్‌మెంట్‌లోని ఫోర్ బెడ్ రూమ్ ఫ్లాట్. అదీ బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇంటికి సమీపంలో! సల్మాన్ ఖాన్ ఇల్లు కూడా పక్కనే ఉంటుందట. కరెక్టుగా చెప్పాలంటే... షారుఖ్, సల్మాన్ ఇళ్లకు మధ్యలో రణ్‌వీర్, దీపిక ఫ్లాట్ కొన్నారు. దాని ఖరీదు సుమారు 120 కోట్ల రూపాయలు అని జూలైలో బాలీవుడ్ కోడై కూసింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఆ ఇంట్లో స్టార్ కపుల్ అడుగు పెట్టారు.
Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
రణ్‌వీర్, దీపిక పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో బిజీ బిజీగా ఉంటున్నారు. ఎవరి సినిమాలతో వారికి తీరిక లేకుండా పోతుంది. అందుకని, సరదాగా సేద తీరడానికి అలీబాగ్ ఇల్లు కొన్నారట. ఇక, పెళ్లి తర్వాత వాళ్లిద్దరూ '83' సినిమాలో జంటగా కనిపించరు. అంతే కాదు... ఆ సినిమా నిర్మాతలలో దీపికా పదుకోన్ కూడా ఒకరు. ప్రస్తుతం రణ్‌వీర్ 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' (Rocky Aur Rani Ki Prem Kahani Movie) , 'సర్కస్', 'అపరిచితుడు' హిందీ రీమేక్ చేస్తున్నారు. రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా, లోక నాయకుడు కమల్ హాసన్ 'భారతీయుడు 2' పూర్తి చేసిన తర్వాత 'అపరిచితుడు' హిందీ రీమేక్ స్టార్ట్ చేయాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు 'పఠాన్', 'ఫైటర్', 'ది ఇంటర్న్', ప్రభాస్ 'ప్రాజెక్ట్ కె' సినిమాలతో దీపికా పదుకోన్ బిజీగా ఉన్నారు.
Also Read : వాంటెడ్ పండు గాడ్ రివ్యూ: సుధీర్, అనసూయ, సునీల్‌ల పండుగాడు మెప్పించాడా?