అన్వేషించండి

Deepika Padukone Pregnancy: పెళ్లయిన ఆరేళ్లకు గుడ్ న్యూస్ చెప్పిన దీపికా పదుకొనే - డ్యూ డేట్ కూడా చెప్పేసిన బ్యూటీ

Ranveer - Deepika: బాలీవుడ్‌లో క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న రణవీర్ సింగ్, దీపికా పదుకొనె.. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రకటించారు.

బాలీవుడ్‌లో మరో జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. గత కొంతకాలంగా రణవీర్ సింగ్, దీపికా పదుకొనె తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త సినీ సర్కిల్లో వైరల్ అయ్యింది. తాజాగా ఒక ఈవెంట్‌లో బేబీ బంప్‌తో కూడా కనిపించింది దీపికా. కానీ ఇప్పటివరకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడానికి ఈ జంట ముందుకు రాలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ్నెన్సీ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు. డ్యూ డేట్ ఎప్పుడో చెప్పి.. క్రియేటివ్‌గా వారి ప్రెగ్నెన్సీ గురించి అనౌన్స్ చేశారు రణవీర్, దీపికా. దీంతో కొంతకాలంగా వస్తున్న వార్తలు నిజం కావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీలవుతున్నారు.

పెళ్లి వీడియోకు క్రేజ్..

‘సెప్టెంబర్ 2024’ అని డేట్ పెట్టి దాని చుట్టూ పిల్లలకు సంబంధించిన బట్టలు, షూస్ ఉన్న ఫోటోను రణవీర్ సింగ్, దీపికా పదుకొనె కలిసి తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఫ్యాన్స్ అంతా వీరికి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఇప్పటికీ పలుమార్లు దీపికా ప్రెగ్నెంట్ అని రూమర్స్ వైరల్ అవ్వగా.. ఫైనల్‌గా వీరు వీరి మొదటి బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధమయ్యారు. రణవీర్ సింగ్, దీపికా పదుకొనె పెళ్లయ్యి దాదాపు ఏడేళ్లు అవుతోంది. 2018 నవంబర్ 14న వీరు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నిరోజుల క్రితం వీరు కలిసి ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నారు. అందులో వీరి వెడ్డింగ్ వీడియోను రిలీజ్ చేశారు కూడా. కొన్నిగంటల్లోనే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by दीपिका पादुकोण (@deepikapadukone)

ఆ సినిమా నుండే..

రణవీర్ సింగ్, దీపికా పదుకొనె మొదటిసారిగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్ లీలా’ మూవీ షూటింగ్‌లో కలిశారు. ఇందులో వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అప్పటినుండే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు, డేటింగ్ చేస్తున్నారు అని రూమర్స్ వైరల్ అయినా.. వాటిపై పెద్దగా స్పందించలేదు. కొన్నేళ్ల తర్వాత వీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని తెలిసేలా చక్కర్లు కొట్టడం మొదలుపెట్టింది ఈ జంట. ఫైనల్‌గా సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకున్నారు. ఇప్పటివరకు రణవీర్, దీపికా హీరోహీరోయిన్లుగా రెండు సినిమాలు తెరకెక్కగా.. ఆ రెండిటినీ సంజయ్ లీలా భన్సాలీనే డైరెక్ట్ చేయడం విశేషం.

కెరీర్‌లో బిజీ..

పెళ్లయిన తర్వాత కూడా దీపికా పదుకొనె, రణవీర్ సింగ్ ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. వీరిద్దరూ చేస్తున్న సినిమాల సంఖ్య తగ్గినా కూడా స్క్రీన్‌పై వీరు కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తారు. గతేడాది దీపికాకు బాగా కలిసొచ్చింది. ముందుగా ‘పఠాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది దీపికా. అందులో తన ఆన్ స్క్రీన్ బెస్ట్ కో స్టార్ అయిన షారుఖ్ ఖాన్‌కు జోడీగా కనిపించింది. ఆ తర్వాత షారుఖ్ హీరోగా తెరకెక్కిన మరో మూవీ ‘జవాన్’లో గెస్ట్ రోల్‌లో అలరించింది. ఇక తాజాగా హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘ఫైటర్’లో దీపికా నటన అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా మరోసారి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది దీపికా పదుకొనె. ఇక రణవీర్ సింగ్.. తన ‘డాన్ 3’ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు.దవ

Also Read: అప్పుడు అలాంటి సీన్స్ చేయనని చెప్పాను - కానీ, ఇప్పుడు మనసు మార్చుకున్నా: అనన్య నాగళ్ల

టాప్ హెడ్ లైన్స్

Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
Rashmika Mandanna : అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
అండర్ వాటర్‌లో రష్మిక సాహసం - ఇండియన్ సినీ చరిత్రలోనే ఫస్ట్ టైం
Jana Nayagan Censor Review : జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
జన నాయగన్‌‍కు A సర్టిఫికెట్ - రన్ టైం ఫిక్స్... రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget