అన్వేషించండి

Ramayan: రణబీర్, యశ్, సాయి పల్లవిల ‘రామాయణ్’ - హిట్ ఫార్ములాను ఫాలో అవుతున్న మేకర్స్

Ramayan Movie Release: నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ‘రామాయణ్’ గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ బయటికి రాగా తాజాగా అందులోకి మరో రూమర్ యాడ్ అయ్యింది.

Nitesh Tiwari Ramayan Latest Update: రామాయణం లాంటి ఇతిహాసాన్ని ఎంతమంది దర్శకులు ఎన్నిసార్లు తెరకెక్కించినా... దానిని చూడడానికి ప్రేక్షకులు ముందుకొస్తారు. అందుకే బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారీ కూడా ఈసారి తన స్టైల్‌లో రామాయణాన్ని చెప్పడానికి సిద్ధమయ్యాడు. అసలు నితేష్ తివారీ రామాయణాన్ని తెరకెక్కిస్తున్న వార్తలు నిజమా కాదా అని ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌లో ఉండగా తాజాగా ఈ మూవీ సెట్స్ నుండి ఫోటోలు లీక్ అవ్వడంతో ప్రేక్షకులకు ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా ఈ సినిమా గురించి మరొక ఆసక్తికర రూమర్ బాలీవుడ్‌లో వైరల్ అవుతోంది. ఈ రామాయణం కేవలం ఒక భాగంగా మాత్రమే విడుదల కావడం లేదట.

సెట్స్ నుంచి లీకైన ఫోటోలు...

నితేష్ తివారీ... తను తెరకెక్కించే రామాయణం కోసం ఎంచుకున్న క్యాస్టింగ్‌తోనే ప్రేక్షకుల్లో ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ చేశారు. రణబీర్ కపూర్‌ను రాముడిగా సాయి పల్లవిను సీతగా, కన్నడ స్టార్ యశ్‌ను రావణాసురుడిగా ఎంపిక చేయడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురుచూడడం మొదలుపెట్టారు. ఇతర క్యాస్టింగ్ వివరాలు పూర్తిగా బయటికి రాకపోయినా.. ‘రామాయణ్’ సెట్స్ నుండి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు వైరల్ అవ్వడంతో కొన్నిరోజుల పాటు సోషల్ మీడియాలో ఈ సినిమా గురించే టాక్ నడిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ రూమర్ బయటికొచ్చింది.

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు...

బాలీవుడ్‌లో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘రామాయణ్’ను రెండు భాగాలుగా విడుదల చేయాలని దర్శకుడు నితేష్ తివారీ నిర్ణయించుకున్నారట. గత కొన్నాళ్లుగా ఒక సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయడం ఒక హిట్ ఫార్ములాగా మారిపోయింది. అలాగే ఈ సినిమా స్కేల్‌ను దృష్టిలో పెట్టుకొని తను ఈ ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. అంతే కాకుండా ఇలా చేయడం వల్ల కథను రెండు దృష్టి కోణాల్లో చూపించవచ్చని దర్శకుడు భావిస్తున్నారట. మామూలుగా రెండు భాగాలుగా వచ్చే సినిమాలు... ముందుగా మొదటి భాగం షూటింగ్‌ను పూర్తి చేసుకొని, అది ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత రెండో భాగం షూటింగ్ మొదలవుతుంది. కానీ ‘రామాయణ్’ అలా కాకుండా రెండు భాగాలుగా ఒకేసారి షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

ఒకే భారీ షెడ్యూల్..

‘రామాయణ్’ పార్ట్ 1 ప్రేక్షకుల ముందుకు రాకముందే పార్ట్ 2 షూటింగ్ కూడా ప్రారంభించనున్నారట మేకర్స్. ఈ రెండు భాగాల షూటింగ్‌ను పూర్తి చేయడం కోసం 350 రోజుల షెడ్యూల్‌ను ప్రిపేర్ చేసిందట టీమ్. ఈ షెడ్యూల్స్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్‌తో పాటు ఇతర మూవీ క్యాస్టింగ్ కూడా పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు. ఒక ఏడాది వ్యవధిలోనే ‘రామాయణ్’కు సంబంధించిన రెండు భాగాలు విడుదలయ్యేలా కూడా సన్నాహాలు చేస్తోందట మూవీ టీమ్. మొత్తానికి రోజుకు ఒక లేటెస్ట్ రూమర్‌పై నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ్’పై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ అవుతోంది. ఇక ఈ మూవీ రెండు భాగాలుగా వస్తుందనే వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: ఆ ప్రొడ్యూసర్లు నా ఇమేజ్‌ను పాడుచేయాలని చూస్తున్నారు, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను - పాయల్ రాజ్‌పుత్

టాప్ హెడ్ లైన్స్

Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget