అన్వేషించండి

Ranbir Kapoor: నన్ను అందరూ చీటర్ అన్నారు, థెరపీకి కూడా వెళ్లాను - రణబీర్ కపూర్

Ranbir Kapoor: బాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న రణబీర్ కపూర్ లవ్ స్టోరీలు అక్కడ చాలా ఫేమస్. తాజాగా తన ప్రేమకథల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ హ్యాండ్‌సమ్ హీరో.

Ranbir Kapoor: మామూలుగా సినీ సెలబ్రిటీలు అంటే వారికి సోషల్ మీడియా అకౌంట్స్ ఉండాలి. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ గురించి ఆ సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా ఉండే నటీనటులు కూడా ఉన్నారు. అందులో ఒకడు రణబీర్ కపూర్. బాలీవుడ్‌లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు రణబీర్. కానీ ఆఫ్ స్క్రీన్ మాత్రం తను పెద్దగా బయట కనిపించే వ్యక్తి కాదు. అంతే కాకుండా తనకు అఫీషియల్‌గా సోషల్ మీడియా అకౌంట్స్ కూడా లేవు. తాజాగా నిఖిల్ కామత్ పోడ్కాస్ట్‌లో పాల్గొన్న రణబీర్.. ఓపెన్‌గా మాట్లాడడం చూసి తన ఫ్యాన్స్ షాకవుతున్నారు.

నాన్నకు కోపం ఎక్కువ..

తాజాగా నిఖిల్ కామత్ హోస్ట్ చేసే ‘పీపుల్’ పోడ్కాస్ట్‌కు గెస్ట్‌గా వచ్చాడు రణబీర్ కపూర్. ఆ పోడ్కాస్ట్‌కు సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది. ‘‘నీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు మీరు చెప్పండి. నా జీవితానికి సంబంధించినవి నేను చెప్తాను’’ అని నిఖిల్ అడగగా.. ‘‘ఇప్పుడు నేను ఒక్కడినే పెద్ద డైలాగ్ చెప్పాలా ఏంటి’’ అంటూ రణబీర్ వేసే కౌంటర్‌తో ఈ ప్రోమో ప్రారంభమయ్యింది. బాలీవుడ్ గురించి తనకు ఎక్కువ తెలియదు అని నిఖిల్ అనగానే గ్రేట్ అంటూ వ్యంగ్యంగా అన్నాడు రణబీర్. తన చిన్నతినం గురించి చెప్పమని అడగగా.. ‘‘మా నాన్నకు కోపం ఎక్కువ. కానీ తను చాలా మంచి మనిషి’’ అని చెప్పుకొచ్చాడు రణబీర్ కపూర్.

థెరపీకి వెళ్లాను..

‘‘నేను ఎప్పుడూ తలదించుకునే ఉండేవాడిని. అన్నింటికి ఓకే అనే చెప్పేవాడిని. దేనికి నో అని చెప్పలేదు’’ అని తన గురించి చాలామందికి తెలియని విషయాన్ని బయటపెట్టాడు రణబీర్ కపూర్. ఇక రాహా పుట్టిన తర్వాత తన జీవితం గురించి మాట్లాడుతూ.. ‘‘ఎవరో నా గుండెను నాలో నుండి బయటికి తీసి నా చేతిలో పెట్టినట్టు అనిపిస్తుంది. రాహా.. ఆలియాలో ఒక భాగం. నాతో మాత్రం రాహా ఎప్పుడూ ఫన్‌గా ఉండాలని అనుకుంటుంది’’ అని అన్నాడు. ఇక తన గురించి చెప్తూ.. ‘‘నేను ఏదీ బయటికి చెప్పుకోను. ఏడవను. నేను థెరపీ కూడా ప్రయత్నించాను. నేను థెరపీకి వ్యతిరేకం కాదు. నేను ఓపెన్‌గా మాట్లాడాలి. కానీ అలా చేయాలంటే నాకు భయం. కానీ థెరపీ అనేది మైండ్‌కు జిమ్ లాగా పనిచేస్తుంది’’ అని రివీల్ చేశాడు రణబీర్.

చీటర్ అన్నారు..

రణబీర్ కపూర్ లవ్ స్టోరీలు బాలీవుడ్‌లో చాలా ఫేమస్. మొదటిసారి ఈ పోడ్కాస్ట్‌లో తన ప్రేమకథల గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడాడు. ‘‘నేను ఇద్దరు సక్సెస్‌ఫుల్ హీరోయిన్లను డేట్ చేశాను. ఆ తర్వాత అదే నా ఐడెంటిటీ అయిపోయింది. చాలాకాలం అందరూ నన్ను ఛీటర్ అని గుర్తుపెట్టుకున్నారు. ఇప్పటికీ చాలామంది అదే అనుకుంటున్నారు’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రణబీర్ కపూర్.

Also Read: ‘డ్యూన్: ప్రాఫెసీ’ టీజర్ - ఎట్టకేలకు టబు లుక్‌ను రివీల్ చేసిన మేకర్స్

టాప్ హెడ్ లైన్స్

Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Love Drama OTT : ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
ఓటీటీలో లవ్ రొమాంటిక్ డ్రామా టాప్ ట్రెండింగ్ - ఫీల్ గుడ్ మూవీ డోంట్ మిస్
Mahesh Babu : వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
వారణాసి సెట్‌లో రుద్రతో మందాకిని - మహేశ్ బాబుకు స్పెషల్ విషెష్
Toxic Trailer : టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్
టాక్సిక్‌లో వయలెన్స్, రొమాన్స్ - ట్రోలింగ్స్‌, విమర్శలపై యశ్ రియాక్షన్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget