అన్వేషించండి

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం - రెండు రోజుల్లో సర్జరీ... అసలేం జరిగిందంటే?

Ram Charan Surgery : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో సర్జరీ జరగనుంది. పెద్ది షూటింగ్ టైంలో కంటితో పాటు చేతికి కూడా గాయాలయ్యాయి. కంటి సర్జరీ పూర్తి కాగా చేతికి సర్జరీ జరగనుంది.

Producer Venkata Satish Kilaru About Ram Charan Surgery : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో సర్జరీ జరగనుంది. రీసెంట్‌గా ఆయన చేతికి గాయంతో సపోర్ట్ బ్రేస్‌తో కనిపించిన సంగతి తెలిసిందే. పెద్ది మూవీ షూటింగ్ టైంలో ఆయనకు కంటితో పాటు చేతి మణికట్టుకు కూడా గాయమైనట్లు తెలుస్తోంది.

కంటికి సర్జరీ కంప్లీట్ కాగా... రాబోయే రెండు రోజుల్లో చేతి మణికట్టుకు సర్జరీ చేయించుకుంటారని నిర్మాత వెంకట సతీష్ కిలారు తెలిపారు. సినిమాలో కుస్తీ సీన్స్ షూట్ చేసేటప్పుడు ఆయనకు గాయాలయ్యాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన ఎంతో కష్టపడ్డారని... ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ప్రాణం పెట్టి చేశారని అన్నారు. 

Also Read : స్పిరిట్ నుంచి మరో ఫోటో లీక్ - వైట్ అండ్ వైట్ లుక్‌లో ప్రభాస్

పెద్దిలో క్రికెట్‌తో పాటు కుస్తీ ప్రధానాంశంగా స్టోరీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, సాంగ్స్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... రీసెంట్ ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో డైరెక్టర్ బుచ్చిబాబు దగ్గర నుంచీ స్టంట్ మాస్టర్, ఆర్ట్ డైైరెక్టర్ ఇస్తున్న ఎలివేషన్స్ పదింతలు అంచనాలు పెంచేశాయి. ఈ నెల 18న ట్రైలర్ రిలీజ్ కానుండగా... ఇప్పటికే మెగాస్టార్ చిరు పవర్ ఫుల్ డైలాగ్ లీక్ చేయగా ట్రెండ్ అవుతోంది.

ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉండగా... ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ నిర్వహించనున్నారు. ఇప్పటికే షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ ఈవెంట్ కోసం ఇప్పటికే చరణ్ ముంబై వెళ్లారు. బాంద్రాలో ఫేమస్ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ట్ హకీమ్ అలీమ్ సెలూన్‌కు వెళ్లి బయటకు వస్తుండగా ఫోటోగ్రాఫర్స్ క్లిక్‌మనిపించారు. వారిని నవ్వుతూ పలకరించారు చరణ్. ఇదే టైంలో ఆయన చేతికి గాయం కనిపించింది. అటు, లాంగ్ హెయిర్‌తో గ్లోబల్ స్టార్ న్యూ లుక్ ట్రెండ్ అవుతోంది. 

యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్

పెద్దిలో యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్ అని చెప్పారు ఫైట్ మాస్టర్ నబాకాంత్. 'మాస్ స్టైల్ నుంచే గ్లింప్స్‌లో సిగ్నేచర్ షాట్ రూపొందింది. యాక్షన్  సీక్వెన్స్ కాదు గానీ ఫైట్ లానే ఉండాలన్న ఆలోచనతో బ్యాటింగ్ స్టైల్ షాట్ రూపొందించా. ఇది దేశవ్యాప్తంగా చాలా వైరల్ అయ్యింది. ఫస్ట్ సీన్ నుంచి ఆడియన్స్ పెద్ది ప్రపంచంలోకి వెళ్లిపోతారు. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. జాతీయ స్థాయిలో జరిగే కుస్తీ పోటీలుంటాయి.

ఓ యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు చరణ్‌కు గాయమైంది. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు. కుట్లు వేయించుకుని మరుసటి రోజే షూట్‌కు వచ్చేశారు. సార్ ఏదైనా ఒకసారి అనుకుంటే అది జరిగిపోవాలి. పెద్దిలో ఓ కుస్తీ ఎపిసోడ్ చాలా మాస్‌గా ఉంటుంది. నాకు తెలిసి అలాంటి మాస్ ఎవరూ చూసి ఉండరు.' అని చెప్పారు.

చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. కన్నడ స్ఠార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, సాయి కుమార్, దివ్యేందు శర్మ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా... జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chennai Love Story Collections: వీకెండ్ తర్వాత చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు ఎలా ఉన్నాయ్? సోమవారం ఎన్ని కోట్లు వచ్చాయంటే? 
Chennai Love Story Four Days Collection - చెన్నై లవ్ స్టోరీ కలెక్షన్లు... నాలుగో రోజు ఎంత వచ్చిందంటే?
Pavala Shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత... చివరి రోజుల్లో ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదు
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Jr NTR Shoulder Injury : ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
ఎన్టీఆర్‌కు భుజం గాయం - 6 నుంచి 8 వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచన!
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
"63 కోర్ట్ ధిక్కార కేసులు భూ మాఫియావే!" - హైకోర్టు తీర్పుపై HYDRA క‌మిష‌న‌ర్ రంగనాథ్ వివరణ
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Blood Pressure Tablets : బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
బీపీ మందులు (High BP Medicine) ఎప్పుడు వేసుకుంటే మంచిది? పరగడుపునా.. తిన్న తర్వాతా?
Tollywood Stars Injured: జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
జూనియర్ ఎన్టీఆర్‌ సహా టాలీవుడ్ స్టార్‌ హీరోలకు గాయాల బెడద! ఆందోళనలో అభిమానులు!
Embed widget