By: ABP Desam | Updated at : 07 Jun 2023 01:57 PM (IST)
శర్వానంద్, రక్షిత దంపతులతో రామ్ చరణ్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్న హీరోల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), యువ కథానాయకుడు శర్వానంద్ (Sharwanand) పేర్లు ముందు వినపడతాయి. వాళ్ళిద్దరూ స్కూల్ మేట్స్, తర్వాత కాలేజ్ మేట్స్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ వస్తోంది.
ఇటీవల శర్వానంద్ ఓ ఇంటివాడు అయ్యారు. వివాహ బంధంలో అడుగు పెట్టారు. జూన్ 3వ తేదీ రాత్రి పదకొండు గంటలకు రక్షిత (Sharwanand wife Rakshita) మెడలో మూడు ముళ్ళు వేశారు. ఏడు అడుగులు నడిచారు. ఆ పెళ్లికి రామ్ చరణ్ హాజరు కాకుండా ఎలా ఉంటారు? వెళ్లారు. స్నేహితుని పెళ్ళిలో సందడి చేశారు. కొత్త జంటతో దిగిన ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ జంటకు శుభాకాంక్షలు చెప్పారు. జీవితాంతం శర్వానంద్, రక్షిత సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
Also Read : తిరుమలలో కృతికి ఆ ముద్దులేంటి? కౌగిలించుకోవడం ఏమిటి? వివాదాస్పదంగా మారిన 'ఆదిపురుష్' దర్శకుడి ప్రవర్తన
పెళ్లి ఎక్కడ జరిగిందంటే?
శర్వానంద్, రక్షితల వివాహ మహోత్సవానికి జైపూర్ (Leela Palace Jaipur)లోని లీలా ప్యాలెస్ వేదిక అయ్యింది. పెళ్ళికి మూడు నాలుగు రోజుల క్రితమే నూతన వధూవరులతో పాటు ఇరువురి కుటుంబాలు, సన్నిహిత మిత్రులు జైపూర్ వెళ్ళారు. జూన్ 2వ తేదీ ఉదయం హల్దీ వేడుక జరిగింది. అదే రోజు సాయంత్రం సంగీత్ నిర్వహించారు. జూన్ 3వ తేదీ రాత్రి పెళ్లి జరిగింది.
Sharwanand Wedding Reception : జూన్ 9వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లో చిత్రసీమ ప్రముఖులు, స్నేహితులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు శర్వానంద్. ఆ రోజు తన శ్రీమతిని పరిచయం చేయనున్నారు.
Also Read : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్
శర్వా భార్య రక్షిత ఎవరు?
శర్వానంద్ పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఆమె తండ్రి పేరున్న లాయర్. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె ఈ రక్షిత అని తెలిసింది. అంతే కాదు... ఆమె మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణ మనవరాలు కూడా! జనవరి 26న వీరి నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగింది.
వరుస సినిమాలతో బిజీ బిజీగా శర్వానంద్!
ఇప్పుడు శర్వానంద్ వరుస సినిమాలు చేస్తున్నారు. పెళ్ళికి ముందు ఆయన చేసిన 'ఒకే ఒక జీవితం' తెలుగు, తమిళ భాషల ప్రేక్షకులను మెప్పించింది. విమర్శల నుంచి ప్రశంసలు అందుకుంది. మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఆ సినిమాలో కృతి శెట్టి కథానాయిక. ఆ సినిమా కాకుండా సితార సంస్థలో కూడా ఓ సినిమా అంగీకరించారని తెలిసింది. సోలో హీరోగా కాకుండా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి కూడా శ్వరానంద్ సిద్ధంగా ఉన్నారు.
రవితేజతో శర్వా సినిమా!
రవితేజ, శర్వానంద్ ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. ఆ సినిమాను 'కలర్ ఫోటో' ఫేమ్ సందీప్ రాజ్ డైరెక్ట్ చేయనున్నారు. అందులో లెక్చరర్ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలుస్తోంది. రవితేజకు శిష్యుడిగా స్టూడెంట్ పాత్రలో శర్వానంద్ కనిపిస్తారని సమాచారం.
Bala Krishna: బాలకృష్ణ ముఖం మీద గాజులు పగలగొట్టించుకున్నారు, ఉమ్మి వేయమన్నారు - నటుడు అప్పాజీ సంచలన వ్యాఖ్యలు!
తెలుగులో సిద్ధార్థ్ సినిమా ఎవరు చూస్తారని అడిగారు - స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్ధార్థ్!
Siddharth: పద్ధతిగా కూర్చొని ప్రశ్నలు అడగమనండి - ఆ జర్నలిస్ట్‌కు సిద్ధార్థ్ స్ట్రాంగ్ వార్నింగ్
'హాయ్ నాన్న' నుంచి సెకండ్ సింగిల్ - 'గాజు బొమ్మ' సాంగ్ ఎప్పుడంటే?
నా లైఫ్ నా ఇష్టం, వాటిని అస్సలు పట్టించుకోను - హృతిక్ రోషన్‌తో డేటింగ్‌పై సబా ఆజాద్ కామెంట్స్!
Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్‌కు అస్వస్థత, జనవాణి మధ్యలోనే వెళ్లిపోయిన జనసేనాని - అసలేం జరిగింది!
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాగుంట రాఘవ కూడా అప్రూవరే - ఆమోదించిన రౌస్ అవెన్యూ కోర్ట్ !
Tiger Nageswara Rao Trailer: గజదొంగగా మాస్ మహారాజ వీరవిహారం, ‘టైగర్ నాగేశ్వర్ రావు’ ట్రైలర్ చూశారా?
Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం
/body>