అన్వేషించండి

Peddi Update : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'పెద్ది'పై బిగ్ అప్డేట్స్... రెండో సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?

Peddi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీ ఫస్టాఫ్ పూర్తి కాగా... త్వరలోనే కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే రెండో సాంగ్‌పైనా అప్డేట్ రానుంది.

Ram Charan Peddi Movie Update : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేం బుచ్చిబాబు కాంబో అవెయిటెట్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఈ మూవీ షూటింగ్ పనులు చివరి దశకు చేరుకోగా... తాజాగా బిగ్ అప్డేట్ వచ్చింది. 

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్

ఈ మూవీ ఫస్ట్ హాఫ్‍ను డైరెక్టర్ బుచ్చిబాబు లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వెర్షన్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కోసం పంపారట. దీనిపై ఆయన త్వరలోనే మ్యూజిక్ వర్క్ ప్రారంభించనున్నట్లు సమాచారం. అలాగే, నెక్స్ట్ షెడ్యూల్‌లో కీలక సీన్స్ షూట్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీని కోసం ఈ నెల చివరిలో మూవీ టీం యూరప్ వెళ్లనుందట. అక్కడ చరణ్‌పై ఓ సాంగ్‌తో పాటు యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తారట. పూర్తి షూటింగ్ త్వరగా కంప్లీట్ చేసి త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట.

రెండో సాంగ్ ఎప్పుడంటే?

ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన 'చికిరి చికిరి' సాంగ్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. రిలీజ్ చేసిన ఒక్క రోజులోనే 46 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఇక రెండో సాంగ్ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫిబ్రవరిలో రెండో పాట విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే సాంగ్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.

Also Read : ఓటీటీలోకి వచ్చేస్తోన్న 'ధురంధర్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎప్పటి నుంచంటే?

ఎక్స్‌పెక్ట్ చేయని క్లైమాక్స్?

ఈ మూవీలో ఇప్పటివరకూ చూడని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని క్లైమాక్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్రకు క్లైమాక్స్‌లో ఓ భారీ ప్రమాదంలో కాళ్లు రెండూ దెబ్బ తింటాయని అయినా కూడా హీరో అవన్నీ అధగమించి ఛాంపియన్‌గా నిలుస్తాడనేది లేటెస్ట్ బజ్. ఇది చాలా ఎమోషనల్‌గా ఉండబోతోందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో 'పెద్ది'లో తనది డిఫరెంట్ రోల్ అని చెప్పారు చరణ్. నిజానికి ఈ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

అందుకు తగ్గట్లుగానే చరణ్ లుక్స్, ఫస్ట్ గ్లింప్స్, చికిరి చికిరి సాంగ్ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో సిగ్నేచర్ షాట్ వేరే లెవల్. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ క్రమంలో మూవీ రిలీజ్ కోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మూవీలో చరణ్ సరసన అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ ఫేం దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో మార్చి 27న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Telangana News: 10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
10 శాతం కమీషన్ వివాదం! డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని భట్టిపై గవర్నర్‌కు ఫిర్యాదు
Miss Apoorva: 'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
'బిగ్ బాస్' అగ్నిపరీక్షలో మిస్ గ్రాండ్ తెలంగాణ టైటిల్ విన్నర్... అపూర్వ ఫోటోలు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
Breaking News: గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
గురువారం కర్నూలు పర్యటనకు వైఎస్ జగన్ ! విరూపాక్షికి పరామర్శ!
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
Embed widget