అన్వేషించండి

Rakesh Master: ఆయన ఫోన్ పోయింది, అక్కడ రెండు బీర్లు కనిపించాయి : రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాఖీ భాయ్

రాకేష్ మాస్టర్ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆయన మీద ఎటాక్ కూడా చేశారని చెప్పాడు రాఖీ భాయ్. వాస్తవానికి ఎవరో హీరో ఫ్యాన్స్ సునిశిత్ మీద దాడి చేయడానికి వచ్చారని, ఆయన..

Rakesh Master: కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్(53) అనారోగ్యం కారణంగా ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. రాకేష్ మాస్టర్ మృతితో టాలీవుడ్ లో విషాదఛాయలు అలముకున్నాయి. వందలాది మంది ఆయన అభిమానుల నడుమ బోరబండలోని స్మశాన వాటికలో ఆయన కుమారుడు చరణ్ అంత్యక్రియలను నిర్వహించారు. పలువురు ప్రముఖ సినీ కొరియోగ్రఫర్ లు ఆయన అంత్యక్రియ కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్లే రాకేష్ మాస్టర్ చనిపోయారని గాంధీ వైద్యులు ప్రకటించారు. అయితే రాకేష్ మాస్టర్ సన్నిహితులు మాత్రం ఆయనది సహజమరణం కాదనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై లోతైన విచారణ జరిపి రాకేష్ మాస్టర్ మృతికి గల కారణాలను వెలికి తీయాలని కోరుతున్నారు. తాజాగా రాకేష్ మాస్టర్ ఫ్రెండ్ రాఖీ భాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ మృతి విషయంలో పలు అనుమానాలను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవతున్నాయి. 

ఆయన ఫోన్ పోయింది, అక్కడ రెండు బీర్లు కనిపించాయి : రాఖీ భాయ్

రాకేష్ మాస్టర్ చనిపోయారని తెలియగానే తాను గాంధీ ఆసుపత్రికి వెళ్లానని చెప్పాడు రాఖా భాయ్. నిన్నటి వరకూ మాతో మాట్లాడిన మనిషి సడెన్ గా ఇలా అయిపోవడం బాధనిపించిందని అన్నాడు. ఆ రోజు రాకేష్ మాస్టర్ పెదవి పై గాయాలు ఉన్నాయని తనకు డౌట్ వచ్చి రాకేష్ మాస్టర్ ను ఆసుపత్రికి తీసుకొచ్చిన ఆయన్ను అడిగానని అన్నారు. ఆదివారం ఉదయం ఆయన రూమ్ లో చలనం లేకుండా పడి ఉన్నాడని, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళారని చెప్పాడు. అయితే రూమ్ లో రాకేష్ మాస్టర్ వస్తువులు కొన్ని లేవని తర్వాత గుర్తించారని, ఆయన ఫోన్ కూడా కనబడలేదని చెప్పారని చెప్పాడు. అలాగే అక్కడ రెండు ఏపీకి సంబంధించిన బీర్ లు కనిపించాయని చెప్పాడు. దీంతో తమకు అనుమానం వచ్చిందని అన్నాడు. ఎవరైనా వచ్చి మాస్టర్ పై దాడి చేశారా అనే అనుమానం కలిగిందన్నాడు. 

Also Read పూర్ణ మళ్ళీ వచ్చిందోయ్ - అవును, 'ఢీ 16'తో రెడీ!

ఆంధ్రలో మాస్టర్ పై దాడి జరిగింది..

రాకేష్ మాస్టర్ ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆయన మీద ఎటాక్ కూడా చేశారని చెప్పాడు రాఖీ భాయ్. వాస్తవానికి ఎవరో హీరో ఫ్యాన్స్ సునిశిత్ మీద దాడి చేయడానికి వచ్చారని, ఆయన నివాసం దగ్గర నానా హంగామా చేశారని, ఆ విషయాన్ని రాకేష్ మాస్టర్ తనకు చెప్పారని చెప్పాడు. బహుశా వ్యక్తిగత కక్ష్యతో ఎవరైనా ఈ పని చేసుంటారా అనే డౌట్ ఉందన్నాడు. ఏపీలో దాడి చేస్తే అనుమానం వస్తుందని, పనికట్టుకొని ఇక్కడకు వచ్చి దాడి చేసుండే అవకాశం కూడా లేకపోలేదని అన్నాడు. రూమ్ లో పరిస్థితి చూస్తే అలా అనిపించిందన్నాడు. డాక్టర్లు కూడా లివర్ పగిలి రక్తం వచ్చిందని చెప్పారని, బహుశా ఆయన మీద దాడి చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. ఎందుకంటే గతంలోనే ఆయన కు మేజర్ ఆపరేషన్ అయిందని, ఎవరో బలంగా ఆ ఆపరేషన్ పడిన చోట దాడి చేసి ఉంటారనే అనుమానం కూడా తమకు వస్తుందని చెప్పాడు. ఏదేమైనా రాకేష్ మాస్టర్ మృతిపై లోతైన విచారణ చేసి అసలు నిజాలు బయటపెట్టాలని చెప్పాడు రాఖీ భాయ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

Also Read : పూజా హెగ్డేను తీసేసి మహేష్ సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చిన త్రివిక్రమ్?

టాప్ హెడ్ లైన్స్

Tejaswini Nandamuri Latest Dance Video: సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
సారంగదరియా పాటకు తేజస్విని నందమూరి డ్యాన్స్... సాయి పల్లవి రేంజ్‌లో బాలయ్య చిన్న కుమార్తె స్టెప్పులు
Maa Inti Bangaram OTT: మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్... వంద కోట్లు కొల్లగొట్టిన సమంత సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Lenin Box Office Collection Day 3: లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు
లెనిన్ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... అయ్యగారి కెరీర్‌లో నంబర్ వన్ - అఖిల్ దూకుడు
Bandla Ganesh Vs Prakash Raj: దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్
దిగజారుతూ ఉండండి... ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఫైర్ - బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Telangana Politics Mind Game: తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
తెలంగాణలో అప్పుడే ముందస్తు మైండ్ గేమ్! కేటీఆర్ 78 సీట్ల వెనుక అసలు వ్యూహం.. రేవంత్ 117 సీట్ల కౌంటర్!
TG20 League Winner: టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
టీజీ20 లీగ్‌ విజేతగా హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌.. ప్రైజ్ మనీ వివరాలివే
Veg Momos Recipe: ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
ఇంట్లోనే టేస్టీ మోమోస్ తయారు చేసుకోండి.. ఈ సీక్రెట్ రెసిపీతో ఫ్యామిలీ ఫుల్ హ్యాపీ
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Embed widget