అన్వేషించండి

Varanasi Business: రాజమౌళికి 'వారణాసి' బిజినెస్ టెన్షన్... దర్శక ధీరుడిపై ఒత్తిడి!?

Varanasi Movie Pre Release Business: సినిమాకు డైరెక్షన్ చేయడమే కాదు... బిజినెస్ సవ్యంగా జరిగేలా కూడా రాజమౌళి చూస్తారని ఇండస్ట్రీలో పేరు ఉంది. ఇప్పుడు ఆయనపై 'వారణాసి' బిజినెస్ టెన్షన్ పడుతోందట.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దర్శకుడు రాజమౌళి 'వారణాసి' చిత్రం ఏప్రిల్ 7న విడుదల.
  • నెట్‌ఫ్లిక్స్ నుండి ₹150 కోట్ల ఓటీటీ డీల్ ఆఫర్.
  • భారీ బడ్జెట్‌తో రాజమౌళిపై ఒత్తిడి, తక్కువ ఓటీటీ ధరలు.
  • నాన్-థియేట్రికల్, అంతర్జాతీయ విడుదల కోసం చర్చలు జరుగుతున్నాయి.

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' (Varanasi Movie). హనుమంతుడు, మహాశివుడు వంటి దేవుళ్ళతో పాటు మైథలాజికల్ కథాంశంతో రూపొందుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. పాన్ ఇండియా కాదు... పాన్ వరల్డ్ రిలీజ్ చేసేలా భారీ ఎత్తున సినిమాను తీస్తున్నారు. అందుకోసం అంతే స్థాయిలో భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యిందని చెప్పాలి. షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆల్రెడీ ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేశారు. రాజమౌళి మీద ఆ బిజినెస్ వ్యవహారం ఒత్తిడి పెంచుతున్నట్లు ట్రేడ్ వర్గాల ఖబర్.

'వారణాసి'కి నెట్‌ఫ్లిక్స్ భారీ ఆఫర్!
Varanasi OTT Rights Netflix: 'వారణాసి' డిజిటల్ రైట్స్ కోసం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ మంచి ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తీసుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ముందుకు వచ్చింది. సుమారు రూ. 150 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే... ఆ అమౌంట్ అంత కంటే చాలా ఎక్కువ అని మరో టాక్. ఎలా లేదన్నా 400 కోట్లకు పైగా వస్తుందని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం.

ఇప్పటి వరకు 'వారణాసి' సినిమాకు వచ్చిన ఆఫర్లలో నెట్‌ఫ్లిక్స్ నుంచి వచ్చినదే అత్యంత పెద్ద డీల్ అయినప్పటికీ... సినిమాకు అవుతున్న భారీ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని దర్శకుడు రాజమౌళి ఆలోచనలో పడ్డారట. ఇంతకు ముందు స్టార్ హీరోలతో రూపొందిన భారీ బడ్జెట్ సినిమాలకు ఓటీటీ ద్వారా మంచి అమౌంట్ వచ్చేది. అయితే... ఇటీవల ఓటీటీ, డిజిటల్ మార్కెట్ డీల్స్ విలువ అంత పలకడం లేదు. దాంతో 'వారణాసి' నిర్మాతలు ఒత్తిడిలో పడ్డారట. ఈ పరిస్థితుల్లో రాజమౌళి ఎటువంటి హడావుడికి లోను కాకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నప్పటికీ, బడ్జెట్ పెరగడంతో ఆయనపై ఒత్తిడి పెరుగుతోందట.

నాన్ థియేట్రికల్ రైట్స్... ఇంటర్నేషనల్ రిలీజ్ ప్లాన్స్!
సినిమా బడ్జెట్‌లో వీలైనంత త్వరగా ఎంతో కొంత అమౌంట్ వెనక్కి రాబట్టడానికి నాన్ థియేట్రికల్ హక్కులను అమ్మడం ఒక్కటే పరిష్కారం. అందువల్ల, ఓటీటీ డీల్స్ పట్ల రాజమౌళి అండ్ టీమ్ డిస్కషన్స్ జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయాలని ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూటర్లతో కూడా సమావేశం అవుతున్నారు. 

Also Read: R Narayana Murthy On Husharu 2 Movie - నన్ను ఒప్పించలేదు... మంచి వేషం ఇచ్చాడు - ఆర్ నారాయణ మూర్తి

భారతీయ భాషలలో 'వారణాసి' విడుదల కానుంది. ఈ థియేట్రికల్ బిజినెస్ డీల్ పెద్ద మొత్తంలో ఉంటుందని చెప్పడంలో మరో సందేహం అవసరం లేదు. అయితే ఇంగ్లీష్ రిలీజ్ కోసం ఎంత ఖర్చు చేస్తారు? ఎంత వెనక్కి వస్తుంది? అనేది చూడాలి. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'లో 'నాటు నాటు...' పాటకు ఆస్కార్ రావడం వెనుక భారీగా ఖర్చు జరిగిందనే ప్రచారం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు 'వారణాసి'ని ఇంటర్నేషనల్ రిలీజ్ చేయాలంటే ఖర్చు చేయక తప్పదు. అందువల్ల రాజమౌళి మీద కొంత ఒత్తిడి ఉంటుందని టాక్. 

మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తున్న 'వారణాసి'లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్. ప్రకాష్ రాజ్ ఓ కీలక పాత్ర చేశారట. ప్రముఖ నిర్మాత కెఎల్ నారాయణతో కలిసి రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

Also Read: Balakrishna Koratala Siva NBK112 Movie Music Director - అనిరుధ్ రవిచందర్ కాదు... తమన్ లేడు... బాలయ్య - కొరటాల సినిమా సంగీత దర్శకుడిగా తెరపైకి కొత్త పేరు

Frequently Asked Questions

'వారణాసి' సినిమా దర్శకుడు ఎవరు, హీరో ఎవరు?

'వారణాసి' చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు.

'వారణాసి' డిజిటల్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఎంత ఆఫర్ చేసింది?

నెట్‌ఫ్లిక్స్ 'వారణాసి' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం సుమారు రూ. 150 కోట్లు ఆఫర్ చేసింది. ఇది వచ్చిన ఆఫర్లలో అత్యంత పెద్ద డీల్.

'వారణాసి' సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?

'వారణాసి' వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది.

'వారణాసి' చిత్రంలో ప్రధాన నటీనటులు ఎవరు?

మహేష్ బాబు హీరో, ప్రియాంక చోప్రా హీరోయిన్. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో కనిపిస్తారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

MegaVerse Launching Date : మెగాస్టార్ చిరు టాక్ షో - మెగావర్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
మెగాస్టార్ చిరు టాక్ షో - మెగావర్స్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్... ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Horror Comedy OTT : ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
ప్రేమలో పడ్డ మగాళ్లను బొమ్మలుగా మార్చే మంత్రగత్తె - ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో కొత్త మూవీ
Mysaa New Release Date : రష్మిక 'మైసా' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
రష్మిక 'మైసా' రిలీజ్ వాయిదా - అఫీషియల్ అనౌన్స్‌మెంట్... అసలు రీజన్ ఏంటంటే?
Anil Ravipudi : రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన అనిల్ రావిపూడి - ఎందులో తెలుసా?
రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్లిపోయిన అనిల్ రావిపూడి - ఎందులో తెలుసా?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
High Tension in Pulivendula: పులివెందులలో నామినేషన్ల వివాదం.. జనసేన కార్యకర్త మృతి, బీటెక్ రవి వర్గంపై ఆరోపణలు
పులివెందులలో నామినేషన్ల వివాదం.. జనసేన కార్యకర్త మృతి, బీటెక్ రవి వర్గంపై ఆరోపణలు
Rishabh Pant Century: తొలి టెస్టులో 720 పరుగులతో ఇండియా రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
తొలి టెస్టులో 720 పరుగులతో India రికార్డు.. ఆసియా తొలి వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ అరుదైన మైలురాయి
AgriGold Scam: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. ఈ నెల 25 నుంచి బాండ్ల వెరిఫికేషన్.. వెంట తీసుకెళ్లాల్సిన పత్రాలివే
Hyderabad Crime News: డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని లేపేస్తానంటూ బెదిరింపులు.. లేడీ డాన్ అరెస్ట్!
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Jabardasth Team Accident : రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ టీం సభ్యులకు గాయాలు - పంచాయతీ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా...
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Embed widget