అన్వేషించండి

Deepika Padukone : దీపికా పదుకోన్ ప్రెగ్నెన్సీ - షూటింగ్ షెడ్యూల్స్‌పై రూమర్స్... రాకా టీం రియాక్షన్ ఇదే!

Raaka Movie Update : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ ప్రెగ్నెన్సీ ప్రకటనతో 'రాకా' షూటింగ్‌పై ఎఫెక్ట్ పడుతుందంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. దీనిపై మూవీ టీం క్లారిటీ ఇచ్చింది.

Raaka Team Clarifies About Rumours About Deepika Padukone Shooting Delay Rumours : బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్ తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రకటన వెలువడిన వెంటనే ఆమె ప్రస్తుతం నటిస్తోన్న భారీ ప్రాజెక్టులపై పలు రూమర్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అల్లు అర్జున్ 'రాకా'లో దీపికా కీలక పాత్ర పోషిస్తుండగా... షూటింగ్ డిలే కాబోతోందంటూ ప్రచారం సాగింది. దీనిపై తాజాగా టీం క్లారిటీ ఇచ్చింది.

షెడ్యూల్ ప్రకారమే...

షూటింగ్ డిలే అవుతుందని... దీపికా స్థానంలో మరొకరిని తీసుకుంటారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. దీనిపై మూవీ టీం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. మూవీలో దీపికా పదుకోన్ రోల్ చాలా కీలకమని... షూటింగ్ అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే కంటిన్యూ అవుతుందని స్పష్టం చేసింది. 'సినిమాలో దీపిక రోల్ రన్ టైం కూడా ఏమాత్రం తగ్గలేదు. ఆమె రోల్ మూవీకే కీలకం. క్రేజీ యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఆమె నటిస్తున్నారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యాక్షన్ పార్ట్ కంప్లీట్ చేస్తారు.' అని తెలిపింది.

Also Read : ఫైనల్‌గా ‘పెద్ది’ కోసం ఐటమ్ పాప ఫిక్సయింది.. ఎవరో తెలిస్తే షాకే!

షూటింగ్ అప్డేట్...

ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... ముంబైలోనే ఎక్కువ భాగం షెడ్యూల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్, దీపికాలపై కీలక యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లు సమాచారం. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ గూస్ బంప్స్ క్రియేట్ చేస్తోంది. తోడేలు చేయి గుండు ఆకారంలో ఉన్న బన్నీ లుక్ వేరే లెవల్. కేవలం లుక్ కోసమే బన్నీ 3 నుంచి 4 గంటల వరకూ స్పెండ్ చేస్తున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్. 

స్టోరీ అదేనా?

ఈ మూవీలో బన్నీ రెండు డిఫరెంట్ రోల్స్‌లో నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. ప్రధాన పాత్రతో పాటు నెగిటివ్ రోల్ కూడా ఆయన చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. సినిమాలో పగలు మనిషిగా రాత్రి తోడేలుగా మారుతారంటూ సోషల్ మీడియా బజ్. కేవలం ఒక్క లుక్, టైటిల్‌తోనే నెట్టింట కొత్త స్టోరీస్ వైరల్ అవుతున్నాయి. చీకటి నుంచి వెలుగులు నింపే వారియర్‌గా బన్నీ కనిపించబోతున్నారని తెలుస్తోంది.

ఈ మూవీ షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి VFXపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ అట్లీ సిల్వర్ స్క్రీన్‌పై ఓ సరికొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేయబోతున్నట్లు సమాచారం. 

హీరోయిన్స్ ఎంతమందే?

ఈ మూవీలో హీరోయిన్స్ ఎంత మంది అనే దానిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు. కేవలం దీపికాను మాత్రమే అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మరో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం సాగుతోంది. నేషనల్ క్రష్ రష్మిక నెగిటివ్ రోల్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే, మృణాల్, జాన్వీ కపూర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఎవరిది అతిథి పాత్ర అనేది ఇంకా క్లారిటీ లేదు. వీటిపై స్పష్టత వచ్చేందుకు మరికొంత టైం పట్టే ఛాన్స్ ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mary Rivera: 'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
'స్పైడర్ మ్యాన్' నటి మృతి... మూడున్నర నెలల తర్వాత వెలుగులోకి
Trisha: తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా 
తమిళనాడులో త్రిష పోస్టర్స్ కలకలం... రాజకీయాల్లోకి రావాలంటూ మధురై ఫ్యాన్స్ హంగామా
Mrunal Thakur: లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
లీగల్ యాక్షన్ తీసుకుంటా... డీప్ ఫేక్ వీడియోలపై మృణాల్ స్ట్రాంగ్ రియాక్షన్
Priyanka Chopra: సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్
సర్వ మంగళ మాంగళ్యే... అమ్మాయితో ప్రియాంక పూజలు... మంగళ శ్లోక పఠనంలో Varanasi హీరోయిన్

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget