By: ABP Desam | Updated at : 02 Jan 2023 02:22 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@SitharaEnts/twitter
యంగ్ హీరో పంజా వైష్ణవ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ #PVT04. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను ఏప్రిల్ 29న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ మాస్ లుక్ లో కనిపించనున్నాడు. శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ పూర్తి కావస్తోంది. వైష్ణవ్ తేజ్ గతంలో ఎన్నడూ కనిపించని లుక్ లో కనిపించబోతున్నట్లు తాజా పోస్టర్ చూస్తుంటే అర్థమవుతోంది. తీగల కంచె అవతలి వైపు నిల్చున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది. మరోవైపు ఫెన్సింగ్ కు మంటలు అంటుకున్నట్లు కనిపిస్తున్నాయి. మొత్తంగా మాస్ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన ఫోటోను మేకర్స్ రిలీజ్ చేశారు.
A journey of the fierce one, #PVT04 in theatres from this 29 April 2023! 🔥#PanjaVaisshnavTej in the all new massy pulsating action avatar like never before! 🌟@sreeleela14 #SrikanthNReddy @vamsi84 #Dudley #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/P4zSvjmRwW
— Sithara Entertainments (@SitharaEnts) January 2, 2023
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. సినిమాలో చాలా వరకు మాస్ యాక్షన్ అంశాలు ఉండటంతో హీరో వైష్ణవ్ తేజ్ కూడా సరికొత్త మేకోవర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అనౌన్స్ మెంట్ టీజర్ అదిరిపోయేలా ఉంది. ఈ సినిమాలో శ్రీలీల డ్యాన్స్, నటన మరో లెవల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా శ్రీలీల ‘ధమాకా’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకుంది. తన నటన, డ్యాన్స్ తో ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పటికే వైష్ణవ్ వెండి తెరపై కనిపించినా, అనుకున్న స్థాయిలో హిట్ అందుకోలేదు. ఈ నేపథ్యంలో తాజా సినిమా పై భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ గా కొనసాగుతున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈడ ఉండేడిది రాముడు కాదప్ప ఆ రావణుడే కొలిసే రుద్ర కాళేశ్వరుడు!🔱#PanjaVaisshnavTej in a raw & stupendous massy role! Coming this Sankranthi 2023💥#PVT04 shoot begins soon ⚡ @sreeleela14 #SrikanthNReddy @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas pic.twitter.com/lMPYhRnLij
— Sithara Entertainments (@SitharaEnts) June 22, 2022
Read Also: బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి సమంత ఔట్! - ఆ వదంతులే నిజమయ్యాయా?
MS Dhoni Tamil Film: ధోనీ ఎంటర్టైన్ మెంట్ తొలి సినిమా- పూజా కార్యక్రమాల పిక్స్ వైరల్
Rakesh Sujatha Engagement: రాకింగ్ రాజేష్, సుజాత ఎంగేజ్మెంట్ వేడుకలో మంత్రి రోజా, బుల్లితెర స్టార్స్ సందడి
RGV Backstabbing Tweet : పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటు? - వర్మ కలలో చెప్పిన దేవుడు
RRR 100 Days : ఆర్ఆర్ఆర్ @ 100 డేస్ ఇన్ జపాన్ - రజనీకాంత్ రికార్డులు స్మాష్
Nani 30 Opening : ఫిబ్రవరిలో సెట్స్‌కు నాని మృణాల్ సినిమా - జనవరి 31న 30వ సినిమా ఓపెనింగ్
Nizamabad News KTR : దేశానికి బీజేపీ చేసిందేమీ లేదు - ఎన్నికలకు ఎప్పుడయినా రావొచ్చన్న కేటీఆర్ !
Minister Roja On Lokesh : లోకేశ్ కాదు పులకేశి, అడుగుపెడితే ప్రాణాలు గాల్లోనే- మంత్రి రోజా సెటైర్లు
Minister Harish Rao : వరంగల్ హెల్త్ సిటీ దేశానికే ఒక మోడల్, దసరా నాటికి నిర్మాణం పూర్తి- మంత్రి హరీశ్ రావు
ఆంధ్రాను తాకిన బీబీసీ డాక్యు మెంటరీ వివాదం- ఏయూలో అర్థరాత్రి ఉద్రిక్తత