అన్వేషించండి

'పుష్ప 2' బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది - బన్నీ సినిమాపై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు!

బాలీవుడ్ డైరెక్టర్ అనిల్ శర్మ తాజాగా 'పుష్ప 2' టీజర్ చూసి తన సోషల్ మీడియా వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.

Bollywood Director Praise On Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప2' పై టాలీవుడ్ తో పాటూ ఇతర ఇండస్ట్రీలోనూ ఓ రేంజ్ లో క్రేజ్ నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు 'పుష్ప 2' పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే 'పుష్ప 2' బాలీవుడ్ లో తన సినిమా కంటే అత్యధిక వసూళ్లు సాధిస్తుందని చెప్పడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరంటే?

'పుష్ప 2' పై బాలీవుడ్ దర్శకుడి ప్రశంసలు

బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనిల్ శర్మ గత ఏడాది 'గదర్ 2' సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. గత ఏడాది బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో 'గదర్ 2' కూడా ఒకటి. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తెరకెక్కించిన అనిల్ శర్మ తాజాగా 'పుష్ప 2' టీజర్ చూసి తన సోషల్ మీడియా ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు." ఇప్పుడే పుష్ప 2 టీజర్ చూశా. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నా. గత ఏడాది ఆగస్టు 15న నేను దర్శకత్వం వహించిన 'గదర్ 2' థియేటర్స్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది అదే రోజున విడుదల కాబోతున్న 'పుష్ప2', 'గదర్ 2' ను మించి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. తెలుగు సినీ పరిశ్రమ, చిత్ర బృందానికి నా అభినందనలు. స్పెషల్లీ అల్లు అర్జున్.. పుష్పరాజ్ గా అతని లుక్, నటన అత్యద్భుతంగా ఉంది" అని అన్నారు.

'పుష్ప 2' టీజర్ రేర్ రికార్డ్

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఏప్రిల్ 8న విడుదల చేసిన 'పుష్ప 2' టీజర్ సోషల్ మీడియాలో అత్యద్భుత స్పందన కనబరిచింది. అతి తక్కువ సమయంలో 110 మిలియన్ల వ్యూస్ ని 1.55 మిలియన్ల లైక్స్ ని అందుకొని టీజర్ గా ఘనత సాధించగా.. తాజాగా మరో రేర్ రికార్డ్ ని అందుకుంది. 'పుష్ప 2' టీజర్ ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లో నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్లో పిలిచిన ఏకైక టీజర్ గా నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు మరే స్టార్ హీరో సినిమా టీజర్ ఇన్ని గంటల పాటు యూట్యూబ్లో ట్రెండింగ్ నెంబర్ వన్ నిలిచిన దాఖలాలు లేవు. సుమారు 300 కోట్లకు పైగా అత్యంత భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు చైనా, జపాన్, రష్యా వంటి పలు విదేశీ భాషల్లోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేయనుంది.

Also Read : ఒక్కటీ అడక్కు రిలీజ్ డేట్ ఫిక్స్ - నరేష్ కొత్త సినిమా థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

టాప్ హెడ్ లైన్స్

OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
Dada Dhamaka Song : దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
దాదా ధమాకా సాంగ్ వచ్చేసింది - బాలయ్య పాడిన పాట విన్నారా?
Obsession OTT : రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
రెండు ఓటీటీల్లోకి హారర్ థ్రిల్లర్ 'అబ్సెషన్' - తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ravi Babu Scary Picture : బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?
బాలీవుడ్ క్వీన్‌తో రవిబాబు హారర్ థ్రిల్లర్... 'స్కేరీ పిక్చర్'తో భయపెడతారా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Flight Shutdown: అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
అమెరికాలో నిలిచిన 11 వేల విమాన సర్వీసులు.. అన్ని విమానాలపై నిషేధం, కుట్ర కోణంపై టెన్షన్!
Raptadu Accused Hemant: మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
మొన్న కాలు పోయింది.. ఇప్పుడు ప్రాణాలకు ముప్పు ? రాప్తాడు నిందితుడు హేమంత్ పరిస్థితి విషమం
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
AP CII Partnership Summit 2026: 12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
12 లక్షల కోట్ల పెట్టుబడుల లెక్కలు సరే.. సామాన్యుడికి కావాల్సింది ఏంటి? రాజకీయంగా లాభమా, నష్టమా?
Revanth Reddy About Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ కేసులో త్వరలో కీలక పరిణామాలు, నా మాటలు విన్నా ఇబ్బంది లేదు: రేవంత్ రెడ్డి
OM Trailer Review : O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
O.M ట్రైలర్ వచ్చేసింది - ధనుష్ మాస్ యాక్షన్... టైటిల్ ఛేంజ్ చేశారుగా!
Bigg Boss Season 10 Today November 13th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: కెప్టెన్సీ కోసం కొట్టుకున్న కంటెస్టెంట్స్! ముకేశ్ వర్షిణి గొడవ!
AP Panchayat Elections: ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే
Embed widget