అన్వేషించండి

Pushpa 2 Release : పుకార్లకు చెక్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్ - 'పుష్ప2' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది!

Pushpa 2 : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బర్త్డే సందర్భంగా 'పుష్ప 2' రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

Pushpa 2 arriving on Independence Weekend : ఇండియన్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీస్ లో ఒకటైన 'పుష్ప: ది రూల్' రిలీజ్ మరోసారి వాయిదా పడబోతుందని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈరోజు సుకుమార్ బర్త్ డే సందర్భంగా మూవీ టీం రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ లో తన క్రియేటివిటీతో విజన్ తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సుకుమార్. 'పుష్ప'తో పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆయన తెరకెక్కిస్తున్న 'పుష్ప 2' కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సుకుమార్ ప్రస్తుతం 'పుష్ప2' షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఇదిలా ఉంటే 'పుష్ప 2' రిలీజ్ మరోసారి వాయిదా పడబోతుందని రీసెంట్ గా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 15 న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ కొద్ది కాలం కిందట ప్రకటించారు. అయితే రీసెంట్ గా 'పుష్ప 2' రిలీజ్ డేట్ ని మరోసారి వాయిదా వేయబోతుందని, ఆగస్టు 15 నుంచి వేరే డేట్ కి రీ షెడ్యూల్ చేసేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నారని బాలీవుడ్ మీడియా ప్రచారం చేసింది.

అందుకు కారణం అజయ్ దేవగన్ నటించిన 'సింగం అగైన్' చిత్రం సేమ్ అదే డేట్ అంటే ఆగస్టు 15న రిలీజ్ కాబోతుందని, అలా జరిగితే బాలీవుడ్ లో 'పుష్ప2' కలెక్షన్స్ పై ప్రభావం చూపే అవకాశం ఉందని, అందుకే నిర్మాతలు సింగం అగైన్ తో పోటీకి దించకుండా మరో సింగిల్ డేట్ కి రిలీజ్ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు పేర్కొంది. కాగా తాజా సమాచారం ప్రకారం 'పుష్ప 2' రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పులు లేవని నిర్మాతలు తెలియజేశారు. సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుందని, అందుకు తగ్గట్టే షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని మేకర్స్ ఈరోజు సుకుమార్ బర్త్డే సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు.

"సుకుమార్ విజన్ లో #Pushpa2The Rule చాలా పెద్దదిగా, గొప్పదిగా ఉండబోతోంది. ఆగస్టు 15 2024న ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నాం" అంటూ పేర్కొన్నారు. మరోవైపు బాలీవుడ్ సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ సైతం తన ట్విట్టర్ వేదికగా 'పుష్ప2' రిలీజ్ డేట్ పై ట్విట్టర్ వేదిక క్లారిటీ ఇచ్చారు. "పుష్ప 2 రిలీజ్ వాయిదా పడలేదు. పుకార్లను ఏమాత్రం నమ్మవద్దు. గురువారం ఆగస్టు 15, 2024 స్వాతంత్ర దినోత్సవం నాడు సినిమా రిలీజ్ కాబోతుంది" అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా బాలీవుడ్లో 'సింగం అగెన్' తో 'పుష్ప2' క్లాష్ ఓ రేంజ్ లో ఉండబోతుందంటూ రాసుకొచ్చాడు. దీంతో ఇన్ని రోజులుగా 'పుష్ప2' రిలీజ్ వాయిదా పడుతుందని వస్తున్న వార్తలకు చెక్ పడింది.

Also Read : అల్లు అర్జున్‌ రికార్డు బ్రేక్‌ చేసిన చరణ్‌ - కానీ!

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
బసిల్ జోసెఫ్‌తో అల్లు అర్జున్ సినిమా కన్ఫర్మ్... హింట్ ఇచ్చిన దర్శకుడు
Madhurapuri Sadhana OTT : ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి మిడిల్ క్లాస్ హార్ట్ టచింగ్ మూవీ డైరెక్ట్ స్ట్రీమింగ్ - ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
Azadi 501 Series OTT : ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్‌పై తెలుగు వెబ్ సిరీస్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Allu Arjun Raaka : అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ
అల్లు అర్జున్ రాకాలో మరో బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ - 11 ఏళ్ల తర్వాత సౌత్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mudragada Padmanabham Funeral:ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం! కుమార్తె రాకను అడ్డుకున్న కుటుంబం! కిర్లంపూడిలో ఉద్రిక్తత!
HYDRAA Demolitions: హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
హైడ్రా టార్గెట్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ కేటీఆర్ సన్నిహితులవేనా ? - తెలంగాణ రాజకీయాల్లో తెర వెనుక ఏం జరుగుతోంది?
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
US Iran War: తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
తీవ్ర స్థాయికి అమెరికా, ఇరాన్‌ మధ్య యుద్ధం! 20 యుద్ధనౌకలు, వందలాది ఫైటర్ జెట్‌లతో హోర్ముజ్‌తో రౌండప్‌!
TTD Latest News: తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
తిరుమల ట్రస్టులు, పథకాల దాత‌ల ప్రివిలేజెస్‌లో భారీ మార్పులు! ఒంటిమిట్ట అభివృద్ధికి నిధులు! టీటీడీ కీలక నిర్ణయాలు! 
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
Visakhapatnam Latest News:వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
వందల సంఖ్యలో జంతువుల సంరక్షణకు ఒకడే పశువైద్యుడా? విశాఖ జూలో ఉద్యోగ ఖాళీలపై అయ్యన్న విస్మయం!
Maruti S-Presso Price in Hyderabad: హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
హైదరాబాద్‌లో మారుతి ఎస్‌ప్రెస్సో ఆన్‌రోడ్ ధరలు! వేరియంట్స్, మైలేజీ పూర్తి వివరాలు ఇవే!
Embed widget