Natti Kumar: నంద్యాలలో వైఎస్సార్‌సీపీ తరపున బన్నీ ప్రచారం - నిర్మాత నట్టి కుమార్ షాకింగ్ కామెంట్స్
అల్లు అర్జున్ నంద్యాలలో తన స్నేహితుడు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తరుపున ప్రచారం చేయడంపై నిర్మాత నట్టి కుమార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ బన్నీపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
Natti Kumar Shocking Comments on Allu Arjun: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. కానీ ఇంకా ఏపీ ఎన్నికలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. ఏపీలో అధికారం చేపట్టేది ఎవరనేది తెల్చడం కష్టంగా మారింది. ఎవరికి వారు గెలుపు తమదే అని చెప్పుకుంటున్నారు కానీ, బయటకు వచ్చి మాత్రం గట్టిగా చెప్పలేకపోతున్నారు. అయితే ఏపీ ఎన్నికల చివరిలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మెగా హీరోలంతా జనసేనాని పవన్ కళ్యాణ్‌కు మద్దుతుగా పిఠాపురంలో ప్రచారం చేశారు. కానీ ఐకాన్ స్టార్ అర్జున్ మాత్రం నంద్యాలలో వైస్సార్‌సీపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసి ట్విస్ట్ ఇచ్చారు.
ఇప్పటికీ ఈ విషయం ఇటూ ఇండస్ట్రీలో, అటూ రాజకీయా వర్గాల్లో హాట్‌టాపిక్‌నే ఉంది. దీనిపై అల్లు అర్జున్‌ను వపర్ స్టార్ ఫ్యాన్స్, మెగా అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో టోల్ చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా నిర్మాత నటి కుమార్ అల్లు అర్జున్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కాగా తెలంగాణలో పది రోజుల పాటు సింగిల్ స్క్రిన్ థియేటర్లు బంద్‌ను ప్రకటించడంపై ఆయన స్పందించారు. దీనిపై తన అభిప్రాయం తెలిపిన ఆయన అల్లు అర్జున్ వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీన్ని సినిమాతో ముడిపెట్టకండి..
ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. "పవన్ కళ్యాణ్‌కు మెగా కుటుంబం మద్దతు ఉంది. అది చాలు. కుటుంబంలోని ఒక సభ్యుడు సపోర్టు చేయనంత మాత్రాన ఆయనకు పోయేది ఏం లేదు. పవన్ ఎప్పుడు కూడా నోరు తెరిచి ఎవరికి అడగలేదు. మెగాస్టార్ చిరంజీవి ఒక మహా వృక్షం. ఆయన నీడలోనే మెగా హీరోలంతా ఎదిగారు. అందులో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. కానీ, ఆయన వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేయడం నాకు అస్సలు నచ్చలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మెగా హీరోలంతా పవన్ కోసం ప్రచారం చేశారు. కుటుంబమంత ఆయనకు మద్దతుగా ఉంది. అలాంటి ఒక్క వ్యక్తి సపోర్టు చేయకపోవడం వల్ల జరిగే నష్టం ఏం లేదు. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే. అలా దీన్ని సినిమాకు ముడిపెట్టవద్దు. సినిమాను సినిమాల మాత్రమే చూడండి. సినిమా వేరు, రాజకీయం వేరు.
బన్నీ అలా చేయడం నాకు నచ్చలేదు
దీనిపై ఫ్యాన్స్ ఎవరూ రియాక్ట్ అవ్వకండి. కానీ, అల్లు అర్జున్ వైఎస్సార్‌సీపీ తరపున ప్రచారం చేయడమనేది నాకు నచ్చలేదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే" అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. "బన్నీ తన స్నేహితుడి కోసం మాత్రమేన వెళ్లానని చెప్పారు. కానీ అల్లు అర్జున వైఎస్సార్‌సీపీకి చేసిన ప్రచార ఫోటోలు, వీడియోలను ఆ పార్టీ శ్రేణులంతా తమకు అనుకూలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. పోలింగ్ ముందు నేను ఉత్తరాంధ్రలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ గ్రౌండ్ లెవల్లో రిపోర్టు తీసుకున్న ఉత్తరాంధ్ర కూటమిదే ఘన విజయం. అందుకే ఓటమి భయంతో వైఎస్సార్‌సీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారు" అని అన్నారు. అనంతరం ఏపీ అభివృద్ధిని కాంక్షించి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నట్టి కుమార్ ధన్యవాదాలు తెలిపారు.