అన్వేషించండి

Varanasi : ఒక్క షాట్ కోసం 90 టేక్స్ - సీక్వెన్స్ వెరీ స్పెషల్... రణకుంభ చెప్పిన వారణాసి విశేషాలు

Varanasi Prithviraj Sukumaran : దర్శక ధీరుడు రాజమౌళి ఓ విజన్‌తో వర్క్ చేస్తారని చెప్పారు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్. తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పృథ్వీరాజ్: 'వారణాసి' ప్రత్యేక షాట్‌కు 90 టేక్‌లు తీసుకున్నారు.
  • రాజమౌళి ఉదయం 5 గంటలకే సెట్‌కు వచ్చి పనిచేసేవారు.
  • చిత్రం స్థాయి ఇంతకు ముందు చూడలేదని పృథ్వీరాజ్ తెలిపారు.
  • మహేశ్ బాబు బ్రేక్ తర్వాత త్వరలో తదుపరి షెడ్యూల్.

Prithviraj Sukumaran About Varanasi Shooting : యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ వారణాసి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ రణకుంభగా విలన్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వారణాసి షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 

90కి పైగా టేక్స్

'వారణాసి'లో ఓ స్పెషల్ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నట్లు చెప్పారు పృథ్వీరాజ్. 'వారణాసిలో ఓ స్పెషల్ షాట్ ఉంది. నేను, మహేశ్ బాబు ఉదయాన్నే మొదలుపెట్టాం. అయితే, ఆ రోజు కంప్లీట్ చేయలేకపోయాం. దీంతో అది మరుసటి రోజుకు కొనసాగింది. ఆ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నాం. షూట్‌లో లంచ్ బ్రేక్ 20 నిమిషాలే. ఫుట్ తినే లోపే షాట్ రెడీ అనగానే పరిగెత్తుకు వెళ్లి యాక్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. రాజమౌళి సార్‌ది పర్ఫెక్ట్ విజన్.' అని చెప్పారు.

రాజమౌళి న్యూ డైరెక్టర్

వారణాసి కోసం రాజమౌళి ఓ కొత్త డైరెక్టర్‌లా వర్క్ చేస్తున్నారని చెప్పారు పృథ్వీరాజ్. '30 ఏళ్లుగా ఛాన్స్ కోసం వెయిట్ చేసిన ఓ కొత్త డైరెక్టర్‌లా వారణాసి కోసం రాజమౌళి వర్క్ చేస్తున్నారు. సెట్స్‌లో ఫస్ట్ అడుగుపెట్టేది ఆయనే. లాస్ట్‌కు వెళ్లేది కూడా ఆయనే. 7AMకు ఫస్ట్ షాట్ ఉన్నప్పుడు ఆయన ఉదయం 5 గంటలకే వచ్చి టీంతో రిహార్సల్స్ చేసేవారు.

వారణాసిలో ఓ స్పెషల్ సీక్వెన్స్ ఉంది. మూవీలో ఓ స్పెషల్ సీక్వెన్స్ ఉంది. దాన్ని ఎలా షూట్ చేయాలని నేను అడిగా. స్టోరీ చెప్పేటప్పుడు తనకు తెలియదని అన్నారు. కానీ సెట్స్‌లో దాన్ని ఎలా చేయాలో కచ్చితంగా నిర్ణయించుకున్నారు.' అని తెలిపారు.

Also Read : Samantha: ప్రెగ్నెంట్ అయ్యాక మొదటిసారి మీడియా ముందుకు... 'మా ఇంటి బంగారం' థాంక్యూ మీట్‌లో సమంత

'ఈ స్థాయి చూడలేదు'

వారణాసి లాంటి సినిమా స్థాయిని ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పారు పృథ్వీరాజ్. 'వారణాసి లాంటి సినిమాలు చేస్తున్నప్పుడు పెద్దది అనే పదం కూడా సరిపోదు. ఇంతకు ముందెన్నడూ ఈ స్థాయిని చూడలేదు. రాజమౌళి సార్ కూడా అది చూడలేదని చెబుతుంటారు. ఇలాంటి భారీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేయడం వల్ల ఓ డైరెక్టర్‌గా, మనిషిగా పరిణితి చెందుతున్నాను. నేను ఏవైనా సూచనలు ఇచ్చినా ఆయన విని తన అభిప్రాయం చెప్పేవారు.' అని తెలిపారు.

ఇప్పటికే పలు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న వారణాసి... ప్రస్తుతానికి చిన్న బ్రేక్ తీసుకుంది. మహేశ్ బాబు షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకుని ట్రిప్ వెళ్లారు. త్వరలోనే మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి VFXపై ఫోకస్ చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు.

సినిమాలో రాముడిగా, రుద్రుడిగా మహేశ్ బాబు కనిపించనున్నారు. మందాకిని పాత్రలో ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Mahesh Babu: వారణాసికి సూపర్ స్టార్ స్మాల్ బ్రేక్... ఫ్రాన్స్‌లో ఫ్యామిలీతో మహేష్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Frequently Asked Questions

వారణాసి షూటింగ్ లో పృథ్వీరాజ్ ఎదుర్కొన్న సవాల్ ఏమిటి?

మహేష్ బాబుతో ఒక స్పెషల్ షాట్ కోసం 90కి పైగా టేక్స్ తీసుకున్నట్లు పృథ్వీరాజ్ తెలిపారు. ఆ షాట్ రెండు రోజుల పాటు కొనసాగిందని చెప్పారు.

రాజమౌళి పనితీరు గురించి పృథ్వీరాజ్ ఏమని వర్ణించారు?

రాజమౌళి 30 ఏళ్లుగా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న కొత్త డైరెక్టర్‌లా పనిచేస్తున్నారని పృథ్వీరాజ్ అన్నారు. సెట్‌లో ఆయన ఉదయాన్నే వచ్చి రిహార్సల్స్ చేసేవారని తెలిపారు.

వారణాసి సినిమా ఏ స్థాయిలో రూపొందుతోంది?

వారణాసి లాంటి సినిమా స్థాయిని తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. రాజమౌళి సార్ కూడా అదే మాట చెప్పారని తెలిపారు.

వారణాసి సినిమాలో మహేశ్ బాబు ఏ పాత్రలు పోషిస్తున్నారు?

సినిమాలో మహేశ్ బాబు రాముడిగా, రుద్రుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

RJ Mitte Passed Away: నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
నెట్‌ఫ్లిక్స్ పాపులర్ సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' నటుడు ఆర్జే మిట్టే ఇకలేరు... చిన్న వయసులో మృతి
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Quantum Valley Twin Towers: అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
అమరావతి క్వాంటం వ్యాలీలో కీలక ఘట్టం.. ట్విన్ టవర్స్‌కు మంత్రి నారాయణ శంకుస్థాపన
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
LB Nagar Hayathnagar Double Decker Corridor: ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
ఎల్బీనగర్ - హయత్ నగర్ డబల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్, 5 రోప్ వే లకు కేంద్రం ఆమోదం
Washing Machine : వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
వాషింగ్ మెషీన్ నుంచి దుర్వాసన వస్తోందా? అయితే మెషీన్ ఇలా శుభ్రం చేయండి
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Embed widget