అన్వేషించండి

Prasanth Varma: దేవుళ్లను ఎప్పుడూ తప్పుగా చూపించలేదు, అవి చూసి ఎలా తీయకూడదో నేర్చుకున్నా - ‘హనుమాన్’ డైరెక్టర్

Prasanth Varma: ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్’ మూవీకి చాలామంది ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కానీ కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఆ విమర్శలపై దర్శకుడు స్పందించాడు.

Prasanth Varma: సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదలయిన అన్ని సినిమాల్లో ‘హనుమాన్’ ఎక్కువగా పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. ముఖ్యంగా విజువల్స్ పరంగా ఈ మూవీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జా ఒక్కసారిగా స్టార్లు అయిపోయారు. ఇప్పటికే ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అవ్వడానికి దూసుకుపోతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా కలెక్షన్స్ రికార్డులను సృష్టిస్తోంది. దాదాపు అందరు ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ టాలెంట్‌ను ప్రశంసిస్తున్నా.. కొందరు మాత్రం దేవుడి సినిమాను డిఫరెంట్ స్టైల్‌లో తెరకెక్కించినందుకు విమర్శిస్తున్నారు. తాజాగా ‘హనుమాన్’పై వస్తున్న విమర్శలపై స్పందించాడు ఈ యంగ్ డైరెక్టర్.

ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదు..
ముందుగా ఇండస్ట్రీలో రామాయణం, మహాభారతం ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయని గుర్తుచేసుకున్నాడు ప్రశాంత్ వర్మ. సీనియర్ ఎన్‌టీఆర్ ఇలాంటి సినిమాలు ఎన్నో చేశారన్నాడు. కానీ ఎన్ని సినిమాలు చేసినా.. ఆయన ఎప్పుడూ విమర్శలు ఎదుర్కోలేదని తెలిపాడు. సీనియర్ ఎన్‌టీఆర్ చిత్రం విడుదలయ్యిందంటే చాలు.. ప్రేక్షకులు పండగ చేసుకునేవాడని గుర్తుచేశాడు. చాలామంది ప్రేక్షకులకు ఆయనే రాముడు, కృష్ణుడని అన్నాడు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో దేవుడి రూపంలో ఆయన ఫోటోలు ఉంటాయని చెప్పాడు. టాలీవుడ్‌లోని సినిమాల్లో దేవుళ్లను తప్పుగా చూపించలేదని, తాను ఆ జోనర్‌లో వచ్చిన సినిమాలన్నీ చూస్తానని బయటపెట్టాడు ప్రశాంత్ వర్మ.

జాగ్రత్తగా తెరకెక్కించాలి..
దేవుళ్లపై తెరకెక్కించిన సినిమాల్లో కొన్ని చూసి ఎలా తీయాలో నేర్చుకుంటే.. కొన్ని చూసి ఎలా తీయకూడదో తెలుసుకున్నానని చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ఇలాంటివి సున్నితమైన అంశాలను, జాగ్రత్తగా తెరకెక్కించాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తాను ఇతర దర్శకుల గురించి మాట్లాడాలని అనుకోవడం లేదని, కానీ సంస్కృతి, చరిత్రను తాను మాత్రం ఎప్పుడూ తప్పుగా చూపించను అంటూ ప్రేక్షకులకు మాటిచ్చాడు. రామాయణం, మహాభారతం గురించి నేటి ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నానని, కానీ వాటిని తెరకెక్కించేంత అనుభవం తనకు లేదన్నాడు. అందుకే వాటిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఫిక్షనల్ కథలను రాసుకున్నానని బయటపెట్టాడు.

బడ్జెట్ లేదు.. కానీ సమయం ఉంది..
తన దగ్గర ఎక్కువగా బడ్జెట్ లేకపోయినా.. సమయం ఉందని అన్నాడు ప్రశాంత్ వర్మ. అందుకే ‘హనుమాన్’ను ప్రణాళిక ప్రకారం తెరకెక్కించామని చెప్పుకొచ్చాడు. వీఎఫ్‌ఎక్స్ కోసం భారీ బడ్జెట్ చిత్రాలు ఎంత సమయాన్ని తీసుకుంటాయో.. అంతకంటే ఎక్కువ సమయాన్ని తీసుకున్నామని తెలిపాడు. హాలీవుడ్‌లోని సినిమాల్లో చూపించే సూపర్ పవర్స్‌కంటే మన దేవుళ్ల దగ్గర ఎక్కువ పవర్స్ ఉన్నాయని, అలా ఇతిహాసాల్లో ఉన్న శక్తివంతమైన పాత్రల్లో హనుమాన్ ఒకరు అని చెప్పాడు. తాను సూపర్ హీరోల సినిమాలు తెరకెక్కించాలని నిర్ణయించుకున్నప్పుడు హనుమంతుడితోనే ప్రారంభించాలని అనుకున్నానని, అదే చేశానని తెలిపాడు ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ విడుదలకు ముందు మూవీని ప్రశాంత్ వర్మ ప్రమోట్ చేసిన విధానాన్ని చాలామంది ట్రోల్ చేశారు. కానీ సినిమా విడుదలయిన తర్వాత తను ప్రమోషన్‌లో చెప్పిన ప్రతీ మాట నిజమే అని ఒప్పుకుంటున్నారు.

Also Read: ఆ క్లబ్‌లో జాయిన్ అవ్వనున్న 8వ హీరోగా తేజ సజ్జా రికార్డ్ - ‘హనుమాన్’ వల్లే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Embed widget