Prasanth Varma: 'హనుమాన్' చిత్రానికి తొలి అవార్డు అందుకున్న ప్రశాంత్ వర్మ - మురిసిపోతున్న డైరెక్టర్
Prasanth Varma: అప్పుడే 'హనుమాన్' మూవీ అవార్డుల వేట మొదలు పెట్టింది. ఈ రోజు ఉదయం ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. 'హనుమాన్'కు తొలి అవార్డు అందుకున్నానంటూ మురిసిపోయారు.
Prasanth Varma Received First Award For Hanuman: అప్పుడే ప్రశాంత్ వర్మ 'హనుమాన్' మూవీ అవార్డుల వేట మొదలు పెట్టింది. ఈ రోజు ఉదయం ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు. 'హనుమాన్'కు తొలి అవార్డు అందుకున్నానంటూ మురిసిపోయారు. ప్రస్తుతం హనుమాన్ మూవీ ఓటీటీలో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రికార్డుకు ఎక్కింది. ఈ సంక్రాంతికి జనవరి 12న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. చిన్న సినిమాగా వచ్చి సన్సేషన్ క్రియేట్ చేసింది.
రాజమౌళి బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాలతో తర్వాత ఆ రేంజ్‌లో బజ్ క్రియేట్ చేసిన చిత్రంగా హనుమాన్ నిలిచింది. దాంతో ఈ సినిమాకు అంతా అవార్డు పంట పండటం ఖాయం అంటున్నారు. ఇక మూవీ నేషనల్, ఇంటర్నేషన్ వైడ్ ఎన్ని అవార్డులు అందుకుంటుందో అని మూవీ లవర్స్ అంతా అంచనాలు వేస్తున్నారు. ఇక క్రమంలో హనుమాన్ మెల్లిమెల్లిగా అవార్డులు రావడం మొదలయ్యారు. తాజాగా ఈ చిత్రంగానే ఉత్తమ దర్శకుడిగా ఐకాన్ అవార్డు అందుకున్నా ప్రశాంత్ వర్మ. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
View this post on Instagram
ఇటీవల జరిగిన రెడియో సిటీ తెలుగు ఐకాన్ అవార్డులు కార్యక్రమానికి నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో హనుమాన్ మూవీకి గాను ప్రశాంత్ వర్మ ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. ఇదే విషయాన్ని చెబుతూ అవార్డుతో ఉన్న ఫోటోను షేర్ చేశారు. హనుమాన్‌కు అందిన తొలి అవార్డు కావడంతో ప్రశాంత్ వర్మ ఈ ఫోటోలో ఆ అవార్డు వంకే చూస్తు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై నెటిజన్లు, ఫ్యాన్స్ స్పందిస్తూ ప్రశాంత్ వర్మకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. హనమాన్‌కు అవార్డు వేట మొదలెట్టిందని, ఇదీద శుభారంభం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే కాదు నేషనల్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ అందుకోవడమే మిగిలుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: అమలా పాల్ షాకింగ్ పోస్ట్ - చేతిలో బిడ్డ, కవలలంటూ హింట్? కన్‌ఫ్యూజ్ చేస్తున్న బ్యూటీ!
యంగ్ హీరో తేజ సజ్జ, అమ్రతి అయ్యార్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ-అమృత అయ్యర్ హీరోహీరోయిన్లుగా 'హనుమాన్' మూవీ తెరకెక్కింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ బాబు 'గుంటూరు కారం' మూవీని సైతం వెనక్కి నెట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కేవలం రూ. 40 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా మొత్తం థియేట్రీకల్ రన్‌లో దాదాపు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్టు సమాచారం. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోయిన 'హనుమాన్' ఇప్పుడు ఓటీటీలోనూ అదరగొడుతుంది. ఇటీవల జీ5కి వచ్చిన సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చిన కొన్ని గంటల్లోనే అత్యధిక మిలియన్ల వ్యూస్‌తో రికార్డు నెలకొల్పింది. జస్ట్ పదకొండు గంటల్లోనే హనుమాన్ ఓటీటీలో నిమిషానికి మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోయింది. అలా వరల్డ్ వైడ్‌గా ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో టాప్‌లో నిలిచి ట్రెండింగ్ వచ్చింది.