అన్వేషించండి
Prakash Raj : 'జై భీమ్' హిందీ డైలాగ్ విమర్శకు ప్రకాష్ రాజ్ స్పందన
తమిళ స్టార్ హీరో సూర్య నటించి సూపర్ హిట్ అయిన జై భీమ్ లోని సన్నివేశం షేర్ చేసి సోషల్ మీడియా ద్వారా తనను విమర్శించిన నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ప్రకాష్ రాజ్ ట్వీట్ వైరల్ అయ్యింది

Prakash Raj (Image Credit : Twitter)
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్య వివాదాలతో సావాసం చేస్తున్నారు. ఈ మధ్య బీజేపీ శ్రేణులపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పలు సందర్భాల్లో విమర్శలు చేసిన ప్రకాష్ రాజ్.. దక్షిణాది ప్రజలపై కేంద్ర ప్రభుత్వం హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. #StopHindiImposition హ్యాష్ ట్యాగ్‌తో ప్రకాష్ రాజ్ ఏకంగా ఉద్యమాన్నే చేపడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అధికార పార్టీ తీరును ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక సన్నివేశంలో కనిపించి మెప్పించిన విషయం తెల్సిందే. ఆ సన్నివేశంలో ఒక వ్యక్తి హిందీ మాట్లాడుతుంటే చెంపపై ఒక్కటి కొట్టి తెలుగులో మాట్లాడు అంటారు. తమిళ వర్షన్ జై భీమ్ లో హిందీ మాట్లాడుతున్న వ్యక్తిని చెంపపై కొట్టి తమిళంలో మాట్లాడమంటారు. హిందీ వెర్షన్ జై భీమ్ లో మాత్రం ఆ వ్యక్తి చెంప మీద కొట్టి ‘‘ఇప్పుడు నిజం చెప్పు’’ అన్నట్లుగా ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది. ఈ వీడియోను కొందరు షేర్ చేసి ప్రకాష్ రాజ్ ద్వంద నీతి, వంచన మీకు అర్థం అవుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా శషాంక్ శేఖర్ ఝా అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేసి ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేశారు. తెలుగు, తమిళం, హిందీలో ఒకే సీన్.. తేడా చూడండి, ఎంత వంచనో అంటూ కామెంట్ పెట్టాడు.
A scene from #jaibheem a local police officer interrogates a criminal who tries to dodge the law by speaking Hindi in spite of knowing the local language is slapped . And you want to use this to question our fight #StopHindiImposition your hate agenda is exposed 😊😊#justasking https://t.co/Fqi1PFppuc
— Prakash Raj (@prakashraaj) March 8, 2023
శషాంక్ శేఖర్ ఝా ట్వీట్ కు స్పందించిన ప్రకాష్ రాజ్ కాస్త సీరియస్ గానే రిప్లై ఇచ్చారు. ‘‘జై భీమ్ సినిమాలోని ఆ సన్నివేశంలో స్థానిక భాష తెలిసినప్పటికీ హిందీలో మాట్లాడి కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న ఒక నేరస్థుడిని స్థానిక పోలీసు అధికారి చెంప దెబ్బ కొట్టడం. ఆ సన్నివేశాన్ని మీరు విమర్శిస్తున్నారు అంటే మీరు #StopHindiImposition పై మీ ద్వేషం అర్ధమవుతుంది. మీ ఉద్దేశం స్పష్టంగా అర్థమవుతోంది’’ అని అన్నారు.
ప్రకాష్ రాజ్ పై గతంలో కూడా ఇలాంటి విమర్శలు ఎన్నో వచ్చాయి. వాటన్నింటికి ఇదే సమాధానం అన్నట్లుగా ఆయన ట్వీట్ ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రత్యర్థి పార్టీకి చెందిన ప్రతి ఒక్కరు కూడా విమర్శించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకోసం ఇలా సినిమా సన్నివేశాలను కూడా ఉపయోగించుకుంటారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
సినిమా
తిరుపతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion