LIK Release Date: ప్రదీప్ రంగనాథన్ హీరోగా నయనతార భర్త కొత్త మూవీ 'LIK' - రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Pradeep Ranganathan: ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఎల్ఐకె' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ తాజాగా ప్రకటించారు.

Pradeep Ranganathan's Lik Movie Release Date: ప్రదీప్ రంగనాథన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'తో మంచి సక్సెస్ అందుకున్న ఆయన మరో మూవీతో ముందుకొస్తున్నారు. ప్రదీప్, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'ఎల్ఐకే' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ). హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాతల్లో ఒకరు నయనతార.
రిలీజ్ ఎప్పుడంటే?
ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంటుండగా.. తాజాగా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సెప్టెంబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'థియేటర్స్‌లో లవ్ పండుగ' అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2023లో పట్టాలెక్కిన ఈ మూవీ త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకోనుంది.
A Love Festival in theatres from SEPTEMBER 18th 🤍🩵💛❤️💚💙#LIKfromSeptember18#LoveInsuranceKompany
— Seven Screen Studio (@7screenstudio) May 12, 2025
#VigneshShivan @pradeeponelife @IamKrithiShetty@iam_SJSuryah @anirudhofficial #RaviVarman @iYogiBabu @Gourayy @PradeepERagav @muthurajthangvl@PraveenRaja_Off… pic.twitter.com/O8Oyw5sk4n
టైమ్ ట్రావెల్ ప్రధానాంశంగా..
ఈ మూవీ టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్‌గా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. తన లవ్ కోసం మొబైల్ గాడ్జెట్ ఉపయోగించుకొని 2035 వరకు టైమ్ ట్రావెల్ చేసే వ్యక్తి రోల్‌లో ప్రదీప్ కనిపించనున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో మూవీ తెరకెక్కుతుండగా.. ఐదుగురు కలిసి నిర్మిస్తున్నారు. వారిలో నయనతార ఒకరు. ఆమె భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. లైఫ్‌కు ఇన్సూరెన్స్ ఉంటుందని అందరికీ తెలుసని.. కానీ లవ్‌కు ఉండే ఇన్సూరెన్స్ గురించి ఈ మూవీతోనే తెలుసుకుంటారని విఘ్నేష్ తెలిపారు.
వరుస వివాదాలతో..
ఈ మూవీ విషయంలో వరుస వివాదాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని తొలుత లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శివ కార్తికేయన్ హీరోగా చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, అవి కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత 2023లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా మూవీని విఘ్నేష్ శివన్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మూవీకి తొలుత 'ఎల్ఐసీ - LIC' (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) అని పేరు పెట్టగా.. చిత్ర బృందానికి ఎల్ఐసీ సంస్థ నోటీసులు జారీ చేసింది.
ఈ సినిమా కోసం తమ టైటిల్ ఉపయోగిస్తే సంస్థ ప్రతిష్టకు భంగం కలిగే ఛాన్స్ ఉందని.. పేరు మార్చకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. దీంతో సినిమా టైటిల్‌ను టీం 'ఎల్ఐకే'గా (LIK) మార్చారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై (Seven Screen Studio) ఈ మూవీని ప్రస్తుతం నిర్మిస్తున్నారు. తాజాగా నయనతార (Nayanthara) అధికారికంగా మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.






















