Prabhas : సింగ్ గీతంపై ప్రభాస్ రివ్యూ - నాగ్ అశ్విన్‌తో ఫన్... డార్లింగ్ న్యూ లుక్ చూశారా?
Sing Geetham Review : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సింగ్ గీతం మూవీపై ప్రశంసలు కురిపించారు. అలాగే, ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్‌తో చేసిన ఫన్ వీడియో వైరల్ అవుతోంది.

Prabhas Reviews Nag Ashwin Sing Geetham : లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు లేటెస్ట్ సూపర్ నేచురల్ ఫాంటసీ సింగ్ గీతం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. స్టార్ హీరోస్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా... పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రివ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ నాగ్ అశ్విన్‌తో ఫన్ చేశారు.
డార్లింగ్ సందడి
నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ చేసిన ఫన్ వీడియోను వైజయంతీ మూవీస్ రిలీజ్ చేసింది. 'వరల్డ్స్ ఫస్ట్ మాట పాట సినిమా. సింగీతం గారు, మీరు, దేవిశ్రీ ప్రసాద్ అందరూ కష్టపడి చేశారు. ఇది మీరు గట్టిగా చెప్పాలి.' అంటూ ప్రభాస్ చెప్పగా... బాగుంది సార్ అంటూ అశ్విన్ రియాక్ట్ అయ్యారు. ప్రమోషన్లలో భాగంగా చేసిన ఫన్ వీడియో అదిరిపోయింది. ముఖ్యంగా ప్రభాస్ న్యూ లుక్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు కల్కి 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ కాగా... త్వరలోనే మరిన్ని షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నట్లు అశ్విన్ తెలిపారు.
Also Read : Maa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?
94 ఏళ్ల వయసులో లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన మ్యూజికల్ ఫాంటసీ డ్రామా సింగ్ గీతం. ఆయాన్, అహల్యా బమ్రూ, షాలిని కొండెపూడి, తులసి, రేవతి, బెనర్జీ, నారిపెద్ది శివన్నారాయణ, ఆగు స్టాన్‌లీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మించారు. రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.
తన తండ్రి ఆస్తి కోసం సొంతూరికి వచ్చిన యువకుడికి ఎదురైన అనుభవాలు. అప్పటికే ఆస్తి కాజేయాలని ఊరిలో కొందరు పన్నే పన్నాగాలు. ఊరు మొత్తానికి ఉండే చెట్టులో తన అమ్మను చూసుకునే అమ్మాయి వల్ల ఊరిలో జరిగే గొప్ప మార్పు ఏంటి? అనేదే ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కించారు.
Before You Go
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
ట్రెండింగ్ వార్తలు























