అన్వేషించండి

Fauzi Leaks : ప్రభాస్ ఫౌజీ సెట్ నుంచి ఫోటోస్ లీక్ - షేర్ చేశారో ఇక అంతే... రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Fauzi Movie : ప్రభాస్ ఫౌజీ షూటింగ్ సెట్ నుంచి కొన్ని పిక్స్ లీక్ కావడంపై ఆందోళన కలిగిస్తోంది. దీనిపై మూవీ టీం రియాక్ట్ అయ్యింది. ఆ కంటెంట్ షేర్ చెయ్యొద్దని వార్నింగ్ ఇచ్చింది.

Fauzi Makers Issues Strong Warning About Leaked Pics : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, 'సీతారామం' ఫేం హను రాఘవపూడి కాంబో అవెయిటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... డార్లింగ్‌తో పాటు మూవీ టీం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా, సెట్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కావడంతో ఆందోళన నెలకొంది. 

స్ట్రాంగ్ వార్నింగ్

ఇవి మొదట AIతో రూపొందించిన ఫోటోలు అని అనుకున్నారు. కానీ, అవి నిజమైనవే అని తేలడంతో మూవీ టీం రియాక్ట్ అయ్యింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చెయ్యొద్దని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. సినిమాను థియేటర్లోనే బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ చేయాలంటూ ట్వీట్ చేశారు.

'ఫౌజీ సెట్స్ నుంచి లీకైన కొన్ని పిక్స్ ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ లీక్స్ మేము ఎంతో గొప్పగా, జాగ్రత్తగా నిర్మిస్తున్న అనుభవాన్ని దెబ్బ తీస్తున్నాయి. వెండి తెరపై రాబోయేది చాలా గొప్పగా ఉంటుంది. లీక్ అయిన కంటెంట్‌పై చర్చ కానీ, షేర్ చెయ్యొద్దని ప్రతీ ఒక్కరినీ కోరుతున్నాం. దీనిపై కంప్లైంట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం.' అని వార్నింగ్ ఇచ్చింది.

Also Read : టైసన్ నాయుడుకు బిగ్ ఓటీటీ డీల్! - బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కెరీర్‌లోనే...

ఫ్యాన్స్‌కు డైరెక్టర్ రిక్వెస్ట్

ఫోటోస్ లీక్ అయిన క్రమంలో డైరెక్టర్ హను రాఘవపూడి ఫ్యాన్స్, నెటిజన్లకు ఓ రిక్వెస్ట్ చేశారు. 'మీకు నిజంగా ప్రత్యేక అనుభూతి అందించడానికి మేము మా హృదయాలను ధారపోశాం. దయచేసి లీక్స్‌తో ఆ మ్యాజిక్ పాడు చెయ్యొద్దని అందరినీ వినయ పూర్వకంగా కోరుతున్నా. ఆ థ్రిల్, ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉండాలో అలాగే థియేటర్లలో అందరం కలిసి అనుభవిద్దాం.' అని అన్నారు.

ఈ మూవీని స్వాతంత్ర్యం ముందు 1930 కాలంలో జరిగిన ఘటనల ఆధారంగా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఓ బెటాలియన్ నాయకుడిగా, పవర్ ఫుల్ సైనికుడిగా కనిపించనున్నారు. తనకు ఇన్‌స్పైర్ కలిగించిన కొన్ని రియల్ లైఫ్ ఘటనలను ఇందులో చూపించనున్నట్లు డైరెక్టర్ హను ఇదివరకే తెలిపారు. రెండు పార్టులుగా మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రిలీజ్ ఎప్పుడంటే?

ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా... అనుపమ్ ఖేర్, భాను చందర్, మిథున్ చక్రవర్తి, జయప్రద తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తుండగా... ఈ ఏడాది డిసెంబర్ 4న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Objection My Lord Web Series Review - 'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
'అబ్జెక్షన్ మై లార్డ్' రివ్యూ: శ్రీకాంత్ vs ముఖేష్ రుషి - Zee5 ఓటీటీలో కోర్టు రూమ్ సిరీస్ ఎలా ఉందంటే?
Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget