అన్వేషించండి

Prabhas: తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేయని ప్రభాస్ - కారణం అదేనా?

Prabhas : గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో టాలీవుడ్ అగ్ర హీరో ప్రభాస్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.

Rebel Star Prabhas : గురువారం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు వేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబు, నమ్రత, విజయ్ దేవరకొండ, నితిన్, విక్టరీ వెంకటేష్, రాజమౌళి, నాగార్జున, నాగచైతన్య, రవితేజ, కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, నాని, విశ్వక్ సేన్, నిఖిల్ తమ ఓటు హక్కును హైదరాబాద్ జూబ్లీహిల్స్ చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ సెంటర్స్ లో వినియోగించుకున్నారు.

కానీ పాన్ ఇండియా హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. కొన్నాళ్ళుగా బయట ఎలాంటి ఈవెంట్స్ లో కనిపించని డార్లింగ్ కనీసం ఎలక్షన్ డే అయినా తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయటకు వస్తారని ఆశించిన అభిమానులకు చివరికి నిరాశే ఎదురైంది. ప్రభాస్ ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ బూత్ మణికొండలో ఉంది. దాంతో కొందరు డార్లింగ్ ఫ్యాన్స్ ఆయన కోసం పోలింగ్ కేంద్రం వద్ద ఎదురు చూశారు. కానీ ప్రభాస్ మాత్రం ఓటు వేయడానికి రాలేదు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు తమ పనులు అన్నిటిని మానుకొని మరి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేశారు.

రామ్ చరణ్ అయితే మైసూర్ లో షూటింగ్ మానేసుకుని మరి వచ్చాడు. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఎందుకు తన ఓటు హక్కు వినియోగించుకోలేదనేది అభిమానుల ప్రశ్న. మోకాలి సర్జరీ జరగడం వల్ల ప్రభాస్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని, అందుకే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రభాస్ రాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్ ఒక్కడే కాదు మరికొందరు సెలబ్రిటీలు కూడా ఓటు వేయలేదని తెలుస్తోంది. మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ‘కన్నప్ప’ షూటింగ్ లో ఫారిన్ లో ఉండడంతో వాళ్లు కూడా ఓటు వేయలేదని తెలుస్తోంది. ఎలక్షన్ రోజు హైదరాబాదులోనే ఉన్నా అఖిల్ అక్కినేని, అల్లరి నరేష్, శర్వానంద్, వరుణ్ తేజ్ లాంటి యంగ్ హీరోలు పోలింగ్ సెంటర్ల వద్ద కనిపించకపోవడం గమనార్హం.

కాగా ప్రభాస్ నటిస్తున్న'సలార్' మూవీ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలోనే డిసెంబర్ 1న ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. నిజానికి ట్రైలర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కానీ ప్రభాస్ మోకాలి సర్జరీ తో రీసెంట్ గానే హైదరాబాద్ కి రావడం, ఇంకా రెస్ట్ మూడ్ లోనే ఉండడంతో సింపుల్ గా యూట్యూబ్లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 7:19 గంటలకు సలార్ ట్రైలర్ విడుదల కాబోతోంది.

Also Read : యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Mammootty : మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
మలయాళ స్టార్‌ మమ్ముట్టీకి సామాన్యుడి సాయం - నా ఫ్రెండ్ అంటూ... వీడియో వైరల్
Anupama Parameswaran : కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
కష్టంలో నాకు గుర్తొచ్చే ఫస్ట్ వ్యక్తి ఆ హీరోనే - అనుపమ పరమేశ్వరన్
Bandla Ganesh : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె వివాహం - తరలివచ్చిన తారా లోకం... అల్లుడి బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Newtons 3rd Law OTT : ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి సుమంత్ కొత్త మూవీ - క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget