Pawan Kalyan Speech: అవన్నీ నేను భయంతో చేశాను, ఇష్టంతో కాదు - ‘అంటే సుందరానికి’ ఈవెంట్లో పవన్ కళ్యాణ్
అంటే సుందరానికి ఈవెంట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే?
సినిమాల్లో డ్యాన్స్‌లు తాను భయంతోనే చేశాను తప్ప భయంతో కాదని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే సుందరానికి ప్రీ-రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... ‘ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. నాని నటుడిగానే కాకుండా, తన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం. నాని బలంగా నిలబడగల వ్యక్తి. ఆయన పెద్ద విజయాలు సాధించాలని నేను కోరుకుంటున్నాను. హీరోయిన్‌గా నటించిన నజ్రియాకు తెలుగు చిత్ర పరిశ్రమకు స్వాగతం. నరేష్ అంటే నాకు చాలా గౌరవం.’
‘ఈ సినిమాలో నటించిన అందరికీ అభినందనలు. వివేక్ సాగర్ అందించిన సంగీతం చాలా బాగుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ అద్భుతంగా తెరకెక్కించారు. తెలుగు సినీ పరిశ్రమ ఒకరి సొత్తు కాదు. ఇది అందరి సొత్తు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నా నిలబడగలిగే ధైర్యం నాకు అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ ఇచ్చింది.’
‘ఎన్ని ఆలోచనలు ఉన్నా సినిమా వేరు. రాజకీయం వేరు. ఆ స్పష్టత నాకుంది. చిత్ర పరిశ్రమ మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. నానికి మా ఇంట్లో చాలా మంది అభిమానులున్నారు. నేను త్వరలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్‌లో నటించబోతున్నాను.’
‘అంటే సుందరానికి ఈవెంట్‌కు వచ్చేటప్పుడు నా AV వేయవద్దని చెప్పాను. కానీ నా మాట వినకుండా ఏవీ వేశారు. వేయకపోతే అభిమానులు కోప్పడతారని భయం వేసింది. నా ఏవీ చూసుకుంటే నాకు భయంగా ఉంది. గొడవ పెట్టుకోవడానికి భయం లేదు. కానీ సినిమా చేయడానికి భయంగా ఉంది.’
‘ఆ డ్యాన్సులు అవీ నేను ఇష్టంతో చేయలేదు. భయంతో చేశాను. నన్ను గన్ పాయింట్‌లో పెట్టి నిర్మాతలు, దర్శకులు డ్యాన్స్ వేయిస్తూ ఉంటారు. మ్యూజిక్ వస్తుంటే నడిచి రావడం నాకు ఇష్టం. మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్లండి.’ అని ముగించాడు. తర్వాత చివర్లో మళ్లీ నివేతా థామస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.
View this post on Instagram